ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్. కరోనా సంక్షోభంలో సైబర్ నేరస్తులు మీకు చెప్పి మరి కష్టపడ్డ సొమ్మును కాజేస్తున్నారని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. ఇటీవల కాలంలో కేవైసీ పేరుతో సైబర్ నేరస్తులు బ్యాంక్ అకౌంట్‌లలో నుంచి డబ్బుల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేస్తూ బ్యాంక్ ఖాతాదారులకు జాగ్రత్తలు చెప్పింది.
కేవైసీ అప్‌డేట్ చేయండి.. లేదంటే
టెక్నాలజీ పెరిగిపోయే కొద్ది ఏది నిజమో, ఏది డూఫ్లికేటో తెలుసుకునేలోపే అనర్ధాలు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ల విషయంలో ఎక్కువగా జరుగుతుందని ఎస్‌బీఐ తెలిపింది. టెక్నాలజీపై ప్రజల్లో అవగాహాన పెరిగే కొద్ది సైబర్ నేరస్తులు కొత్త మార్గాల్ని అన్వేస్తున్నట్లు ఎస్‌బీఐ ట్వీట్‌లో పేర్కొంది. అచ్చం ఎస్‌బీఐ ఎస్‌ఎంఎస్‌ను పోలి ఉండే ఓ కేవైసీ డూబ్లికేట్ మెసేజ్‌ను బ్యాంక్ అకౌంట్ల వినియోగదారులకు సెండ్ చేస్తున్నారు. అందులో మీ కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలని, 24 గంటల్లో పూర్తి చేయకుంటే బ్యాంక్ సేవలు నిలిచిపోతాయని హెచ్చరిస్తారు.
Here is an example of #YehWrongNumberHai, KYC fraud. Such SMS can lead to a fraud, and you can lose your savings. Do not click on embedded links. Check for the correct short code of SBI on receiving an SMS. Stay alert and stay #SafeWithSBI.#SBI #AmritMahotsav pic.twitter.com/z1goSyhGXq
— State Bank of India (@TheOfficialSBI) March 4, 2022
పొరపాటున ఎవరైనా ఆ మెసేజ్‌లో ఉన్న లింక్‌ను ఓపెన్ చేసి వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేస్తే బ్యాంక్‌లో ఉన్న మనీ మాయమవుతుందని ఎస్‌బీఐ సూచించింది. కేవైసీ అంశంలో ఇలాంటి మెసేజ్‌ల పట్ల అవగాహన లేని ఖాతాదారులు డబ్బులు పోగొట్టుకుంటున్నట్లు తెలిపింది. ఒకవేళ మీ ఫోన్‌కి మెసేజ్ లేదంటే మెయిల్స్ వచ్చినా వాటిని క్లిక్ చేయకుండా వదిలేయాలని. అలాంటి ఎస్ఎంఎస్లు మళ్లీ మళ్లీ వస్తుంటే.. సైబర్ క్రైమ్ పోలీసులకు తెలపాలని సలహా ఇచ్చింది.
చదవండి: బంగారం కొనేవారికి షాక్ !! ఆగమన్నా ఆగడం లేదు.. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయ్
Comments
Please login to add a commentAdd a comment