మూడు రోజుల్లో ఫిర్యాదు చేస్తే నష్టపోనక్కర్లేదు Customers should report fraud in 3 days to avoid losses: RBI | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో ఫిర్యాదు చేస్తే నష్టపోనక్కర్లేదు

Published Fri, Jul 7 2017 12:19 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

మూడు రోజుల్లో ఫిర్యాదు చేస్తే నష్టపోనక్కర్లేదు

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాలపై
రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టత
పది రోజుల్లోనే ఖాతాలో తిరిగి జమ
ఆలస్యం చేస్తే నష్టానికి బాధ్యత వారిదే

న్యూఢిల్లీ: ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు, కార్డుల నుంచి జరిగే అనధికార ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల మోసాలపై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఇకపై రూపాయి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఈ దిశగా ఆర్‌బీఐ గురువారం స్పష్టతనిచ్చింది. మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే పది దినాల్లోగా సదరు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. బీమా పరిహారం కోసం ఆలస్యం చేయడం ఉండదని స్పష్టం చేసింది. మూడో పార్టీ చేసిన మోసపూరిత లావాదేవీలపై నాలుగు నుంచి ఏడు దినాల్లోపు రిపోర్ట్‌ చేస్తే రూ.25,000 వరకు నష్టానికి ఖాతాదారుడే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

ఖాతాదారుడి నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే, దానిపై బ్యాంకుకు ఫిర్యాదు చేసే వరకూ చోటుచేసుకునే నష్టం ఏదైనా గానీ దాన్ని ఖాతాదారుడే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుడు అనధికార లావాదేవీపై బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత చోటు చేసుకునే నష్టం ఏదైనా బ్యాంకే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. తమ ఖాతాలు, కార్డుల నుంచి అనధికారిక లావాదేవీలు జరుగుతున్నాయంటూ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.

‘‘ఖాతాదారుడు వైపు నుంచి, బ్యాంకు వైపు నుంచి లోపం లేకుండా, వ్యవస్థలో ఎక్కడో లోపం కారణంగా మూడో పక్షం చేసిన ఉల్లంఘనపై ఖాతాదారుడికి ఎటువంటి బాధ్యత లేదు. అయినప్పటికీ అనధికార లావాదేవీ గురించి ఖాతాదారుడు మూడురోజుల్లోపే బ్యాంకుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్లక్ష్యం, లోపం, సాయం కారణంగా అనధికారిక లావాదేవీ చోటు చేసుకుంటే, ఖాతాదారుడు దానిపై సమాచారం ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ విషయంలోనూ అతడికి ఎటువంటి బాధ్యత ఉండదు’’ అని ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. మోసంపై ఏడు రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే దానిపై ఖాతాదారుల బాధ్యత ఎంత మేరకు అన్నది బ్యాంకుల బోర్డు విధానం మేరకు నిర్ణయించడం జరుగుతుందని వివరించింది.

న్యూఢిల్లీ: ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు, కార్డుల నుంచి జరిగే అనధికార ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల మోసాలపై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఇకపై రూపాయి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఈ దిశగా ఆర్‌బీఐ గురువారం స్పష్టతనిచ్చింది. మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే పది దినాల్లోగా సదరు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. బీమా పరిహారం కోసం ఆలస్యం చేయడం ఉండదని స్పష్టం చేసింది.

మూడో పార్టీ చేసిన మోసపూరిత లావాదేవీలపై నాలుగు నుంచి ఏడు దినాల్లోపు రిపోర్ట్‌ చేస్తే రూ.25,000 వరకు నష్టానికి ఖాతాదారుడే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఖాతాదారుడి నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే, దానిపై బ్యాంకుకు ఫిర్యాదు చేసే వరకూ చోటుచేసుకునే నష్టం ఏదైనా గానీ దాన్ని ఖాతాదారుడే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుడు అనధికార లావాదేవీపై బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత చోటు చేసుకునే నష్టం ఏదైనా బ్యాంకే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. తమ ఖాతాలు, కార్డుల నుంచి అనధికారిక లావాదేవీలు జరుగుతున్నాయంటూ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement