సాక్షి, హైదరాబాద్: ఏటీఎం, ఆన్‌లైన్ బ్యాకింగ్ పాస్‌వర్డ్‌ల విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం తగదని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు మరిచిపోతామనో..సులభంగా ఉండాలనో ...1111, 1212 తరహా అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లు పెట్టుకునే వారంతా సైబర్ నేరగాళ్లకు డబ్బులు కాజేసే అవకాశమిచి్చనవారవుతారని హెచ్చరించారు. చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ నివేదిక ప్రకారం, 2024 మొదటి త్రైమాసికంలో భారతదేశంలోని సైబర్ దాడులలో 33% గణనీయమైన పెరుగుదల నమోదైంది.
3.4 మిలియన్ల పాస్‌వర్డ్‌ల అధ్యయనం తర్వాత పది వీక్ పాస్‌వర్డ్‌లను గుర్తించినట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటిలో ఏదైనా సంఖ్యను పిన్ నంబర్ (పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్)గా వాడుతుంటే..దాన్ని వెంటనే మార్చుకుని..ఇతరులు సులువుగా గుర్తించలేని పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా తమ, లేదా ఇతర కుటుంబ సభ్యుల పుట్టిన సంవత్సరాలు సైతం పెట్టుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.
అత్యంత వీక్ పాస్‌వర్డ్‌లు ఇవే...
1234, 1111, 0000,
1212, 7777, 1004,
2000, 4444, 2222, 6969
Comments
Please login to add a commentAdd a comment