స్మార్ట్‌ ఫోన్లపై హ్యాకర్ల కన్ను | hackers eye on smartphones | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ ఫోన్లపై హ్యాకర్ల కన్ను

Published Fri, Oct 27 2017 12:58 PM | Last Updated on Fri, Oct 27 2017 12:58 PM

hackers eye on smartphones

ప్రస్తుతం ఆన్‌లైన్‌ బ్యాంకు లావాదేవీలకు ఎక్కువ మంది స్మార్టుఫోన్లనే వినియోగిస్తున్నారు. ఇదే అదనుగా సైబర్‌ నేరస్తులు మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసి మీ విలువైన సమాచారం దొంగలించే అవకాశం ఉంది. ఇటీవల వెలుగు చూస్తోన్న సైబర్‌ నేరాల్లో హ్యాకింగ్‌ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కొన్ని బ్యాంకుల క్రెడిట్‌ కార్డులను సైతం హాకింగ్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ బ్యాంకులు కస్టమర్లను అలర్ట్‌ చేసి కొత్త కార్డులు జారీ చేశాయి. ఇలా మీ స్మార్ట్‌ ఫోన్లలోకి వైరస్‌ రూపంలో ఓ సాఫ్ట్‌వేర్‌నుపంపి మీ మొబైల్‌ లావాదేవీలపై దుండగులు ఓ
కన్నేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీ స్మార్ట్‌ఫోన్‌ హ్యాకింగ్‌ బారి నుంచి రక్షించుకోవాలంటే, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

అల్లిపురం(విశాఖదక్షిణ): స్మార్ట్‌ఫోన్‌ ఆన్‌ చేసేటప్పుడు పాస్‌వర్డ్‌ను అడిగేలా లాక్‌సెట్‌ చేసుకోవాలి. చీటికి మాటికి లాక్‌ తీయాల్సి వస్తుందని విసుగు చెందవద్దు. ఈ లాక్‌ పిన్‌పాస్‌వర్డ్, ప్యాట్రన్‌ లాక్‌ ఏదైనా కావచ్చు.

ఓపెన్‌ వైఫైతో ప్రమాదమే
కొందరు వారి ఫోన్లలో ఎప్పుడూ వైఫై/మొబైల్‌ డేటా ఆన్‌చేసి ఉంచుతారు. అయితే అలా ఉంచాల్సిన పని లేదు. మొబైల్‌ డేటా మాట అటుంచి వైఫై ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉందనుకోండి. ఒక్కోసారి ఓపెన్‌ వైఫై/ పబ్లిక్‌ వైఫైలకు కనెక్ట్‌ అయితే హ్యాకర్ల నుంచి ఏదైనా ప్రమాదం ఉందని నిపుణులు చెపుతున్నారు. వారు మీ డివైస్‌ను కంట్రోల్‌ను వారి చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఆటో మేటిక్‌ వైఫై కనెక్షన్‌ ఆపేయండి.

డేటా ఎన్‌క్రిప్షన్‌ ఎనాబుల్‌ చేసుకోవాలి
స్మార్ట్‌ ఫోన్లలో సెట్టింగ్స్, సెక్యూరిటీ అనే విభాగంలోకి వెళితే అక్కడ డేటా ఎన్‌క్రిప్షన్‌ అనే ఫీచర్‌ డిజేబుల్‌ అయి ఉంటుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి. దీంతో మీ డివైస్‌లోని సమాచారాన్నిఅంత ఈజీగా ఎవరూ తస్కరించలేరు. ఎందుకంటే డివైస్‌లోని వివరాలన్నీ 256 బిట్‌ లేదా 128బిట్‌ సెక్యూరిటీతో లాక్‌ అయి ఉంటాయి. వాటిని ఓపెన్‌ చేయడం అంత సులభం కాదు.

థర్డ్‌ పార్టీ యాప్‌ల జోలికి వెళ్లద్దు
ఆండ్రాయిడ్, ఐ ఫోన్‌ ఏది వాడినా వాటిలో ఆయాస్టోర్స్‌లో ఉండే అప్లికేషన్లను మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఆండ్రాయిడ్‌ అయితే గూగుల్‌ ప్లేస్టోర్, ఐఫోన్‌ అయితే యాపిల్‌ స్టోర్‌కు వెళ్లి కావాల్సిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఫ్రీగా లభిస్తున్నాయని ఇతర వేరే సైట్‌ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. ఇతరసైట్లలోని యాప్‌లన్నీ 99 శాతం వైరస్‌లు ఉంటాయి. ఇలా థర్డ్‌ పార్టీ స్టోర్ల నుంచి యాప్‌లను ఏ ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దు.

పోర్న్‌ (అశ్లీల) వెబ్‌ సైట్లతో ముప్పు
కంప్యూటర్లలో పోర్న్‌ దృశ్యాలు ఏ విధంగా చూసేవారో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లలో అశ్లీల వీడియోలు చూడడం కూడా ఎక్కువైంది. అయితేఇలా చేయడం మీ ఫోన్‌ రక్షణ విషయంలో ఏమాత్రం మంచిది కాదు. అలాంటి సైట్లలో మాల్‌వేర్, వైరస్‌లు చొరబడతాయి. బ్యాంకింగ్‌ లావాదేవీలు చేసే ఫోన్లలో పోర్న్‌ సైట్‌ల వైపు వెళ్లకండి.

ఈ మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌ల విషయంలో జర జాగ్రత్త
 ఈ మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు మీకు స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఏదైనా బ్యాంకు నుంచివచ్చినట్లు కొన్నిసార్లు ఈ మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు, ఇన్‌స్టంట్, పుష్‌ మెసేజ్‌లు వస్తుంటాయి.అయితే వాటిని ఓపెన్‌ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. సాధారణంగా ఎవరికీ బ్యాంకింగ్‌ డిటెయిల్స్‌ ఇవ్వమని ఎవరిని అడగరు.బ్యాంకులైతే ఆ పని అసలు చెయ్యవని గమనించండి. కొన్ని మెసేజ్‌లకు, మెయిల్స్‌కు లింకులు ఉంటాయి. వాటిని క్లిక్‌ చేస్తే ఏదైనా ఆఫర్‌వస్తుందనో, లేదంటే మరో గిఫ్ట్‌ వస్తుందనోమెసేజ్‌లో మభ్య పెడతారు. అలాంటి సందర్భాల్లో ఆ లింకులను అసలు ఓపెన్‌ చెయ్యవద్దు. అదిహ్యాకర్ల విసిరిన వల అని జాగ్రత్త పడండి. ఈసూచనలు పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఆర్థిక లావాదేవీలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.

బ్రౌజింగ్‌ సురక్షితం
బ్యాంకింగ్‌ లావాదేవీలు చేసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్‌ చేసేటప్పుడు వెబ్‌సైట్‌ అడ్రస్‌ టైప్‌ చేసే ఎంటర్‌ చేస్తే వచ్చే అడ్రస్‌ ఒకసారి కచ్చితంగా పరిశీలించాలి. బ్యాంకింగ్‌ సంబంధిత వెబ్‌సైట్‌ అయితే సైట్‌ అడ్రస్‌కు ముందు http://కచ్చితంగా ఉంటుంది. అలా లేదంటే ఆ సైట్‌ సురక్షితం కాదని తెలుసుకోండి. వెంటనే లావాదేవీలు ఆపేయ్యండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement