![Lok Sabha MP Supriya Sule says her phone and WhatsApp hacked](/styles/webp/s3/article_images/2024/08/11/ncp.jpg.webp?itok=ABgaXf2J)
ముంబై: ఎన్సీపీ( శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే తన మొబైల్ ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయినట్లు తెలిపారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. ‘అర్జెట్: నా మొబైల్ ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయింది. దయచేసి బారామతి ప్రజలు ఎవరూ నాకు కాల్స్ లేదా సందేశాలు చేయోద్దు’. నేను మొబైల్ హ్యాక్‌కు సంబంధించి పోలీసు స్టేషన్‌కు వెళ్లి సాయం కోరాను’ అని తెలిపారు.
మరోవైపు.. ప్రహార్ జనశక్తి పార్టీ (పీజేపీ) అధ్యక్షుడు, అధికార మహాయుతి మిత్రపక్షం ఎమ్మెల్యే ఓంప్రకాష్ అలియాస్ బచ్చు కడు శనివారం పూణెలో ఎన్సీపీ( శరద్ పవర్ వర్గం) చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు.శరద్ పవార్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార మహాయుతితో ఉండాలా.. లేదా కూటమి నుంచి వైదొలుగాలా? అనే విషయంఐ సెప్టెంబర్ 1న నిర్ణయం తీసుకుంటానని అన్నారు. దీనిపై ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ.. దివ్యాంగుల రాజకీయ సిద్ధాంతాలు భిన్నమైనప్పటికీ వారి పక్షాన కడు కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి అందరూ ఏకం కావాలని ఆమె కోరారు.
Comments
Please login to add a commentAdd a comment