phone hacked
-
నా ఫోన్ హ్యాక్ అయింది: ఎంపీ సుప్రియా సూలే
ముంబై: ఎన్సీపీ( శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే తన మొబైల్ ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయినట్లు తెలిపారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. ‘అర్జెట్: నా మొబైల్ ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయింది. దయచేసి బారామతి ప్రజలు ఎవరూ నాకు కాల్స్ లేదా సందేశాలు చేయోద్దు’. నేను మొబైల్ హ్యాక్‌కు సంబంధించి పోలీసు స్టేషన్‌కు వెళ్లి సాయం కోరాను’ అని తెలిపారు. మరోవైపు.. ప్రహార్ జనశక్తి పార్టీ (పీజేపీ) అధ్యక్షుడు, అధికార మహాయుతి మిత్రపక్షం ఎమ్మెల్యే ఓంప్రకాష్ అలియాస్ బచ్చు కడు శనివారం పూణెలో ఎన్సీపీ( శరద్ పవర్ వర్గం) చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు.శరద్ పవార్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార మహాయుతితో ఉండాలా.. లేదా కూటమి నుంచి వైదొలుగాలా? అనే విషయంఐ సెప్టెంబర్ 1న నిర్ణయం తీసుకుంటానని అన్నారు. దీనిపై ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ.. దివ్యాంగుల రాజకీయ సిద్ధాంతాలు భిన్నమైనప్పటికీ వారి పక్షాన కడు కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి అందరూ ఏకం కావాలని ఆమె కోరారు. -
పోలీసులకు హ్యాకర్ వార్నింగ్.. పర్సనల్ డేటా బయటపెడతామంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా పోలీసు ఉన్నతాధికారి ఫోన్ హ్యాకింగ్‌కు గురి కావడం కలకలం సృష్టించింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరికొందరు పోలీసుల ఫోన్లను కూడా హ్యాక్ చేసి సమాచారం బయటకు తీస్తామని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎన్నికల సమయం కావడంతో పోలీసు యంత్రాంగం నిత్యం తనిఖీలు, బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంది. ఇలాంటి తరుణంలో సైబరాబాద్ పరిధిలోని ఒక డీసీపీ ఫోన్ హ్యాక్ అయ్యింది. శనివారం ఉదయం నుంచి విధి నిర్వహణలో నిమగ్నమైన ఆ డీసీపీ ఫోన్ మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా హ్యాకింగ్‌కు గురైనట్టు గుర్తించారు. దాదాపు 2 గంటల సమయం ఫోన్ పూర్తిగా అవతలి వారి చేతిలోకి చేరినట్టు నిర్ధారించారు. అతికష్టమ్మీద సైబర్ నిపుణులు డీసీపీ ఫోన్‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇది హ్యాకర్ల పనేనా?.. లేక ఎవరైనా గిట్టని వారు చేశారా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి అధికారి ఫోన్ హ్యాక్ చేయటం.. పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే, నగరంలో ఒక ఐటీ ఉద్యోగిపై సదరు డీసీపీ చేయిచేసుకోవటం వల్లనే ఐటీ నిపుణులు ఫోన్ హ్యాక్ చేసి సమాచారం. ఫోన్లోని వ్యక్తిగత వీడియోలు బయటపెట్టినట్టు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రాబోయే రోజుల్లో మరికొందరి పోలీసుల సమాచారం కూడా ఇదే విధంగా వెలికితీస్తామంటూ తమ పోస్టు ద్వారా హెచ్చరించటం గమనార్హం. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. సదరు హ్యాకర్ కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రియుడు మోసం చేశాడనే ప్రవల్లిక ఆత్మహత్య -
మాల్వేర్ 'దామ్'తో జాగ్రత్త.. అలా చేస్తే..మీ ఫోన్ డేటా మొత్తం హ్యాక్
కొత్తరకమైన ఆండ్రాయిడ్ మాల్వేర్ 'దామ్'తో జాగ్రత్తగా ఉండమని కేంద్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మెుబైల్ ఫోన్లలోకి దామ్ ప్రవేశించి డేటాను హ్యాక్ చేస్తుంది. కాల్ రికార్డ్స్, హిస్టరీ, కెమెరాలోని సమాచారాన్ని స్వాధీనం చేసుకుంటుంది. లక్షిత డివైజ్‌లపై రాన్సమ్వేర్ను సృష్టించి యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లను కూడా సులభంగా ఛేదించగలదని వెల్లడించింది. డివైజ్‌లోకి ఈ మాల్వేర్ చొరబడిన తర్వాత మెుబైల్ సెక్యూరిటీని మభ్యపెడుతుంది. ఆ తర్వాత సున్నితమైన డేటాను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి తన ప్రయత్నంలో సఫలమైతే ఫోన్లోని హిస్టరీని, బుక్‌మార్క్‌ను, కాల్ లాగ్స్ వంటి కీలక సమాచారాన్ని సులభంగా రాబడుతుంది. సమాచారాన్ని రాబట్టుకున్న తర్వాత ఒరిజినల్ డేటాను డిలీట్ చేసి, హ్యాక్ చేసిన డేటాను '.enc' ఫార్మాట్లో ఎన్‌క్ట్రిప్ట్ చేసుకుని భద్రపరుచుకుంటుందని వెల్లడించాయి. దీంతో పాటు ఫైల్స్‌ను అప్లోడ్, డైన్లోడ్, అడ్వాన్స్డ్ ఎన్క్రిప్టెడ్ స్టాండర్డ్ ఆల్గారిథంతో కమాండ్ అండ్ కంట్రోల్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీని భారిన పడకుండా ఉండాలంటే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్స్‌పై క్లిక్ చేయకూడదని సైబర్ సెక్యూరిటీ టీం తెలిపింది. యూఆర్ఎల్లో 'bitly','tinyur' వంటివి ఉంటే అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. చదవండి:హెలిప్యాడ్‌ను అలానే ఎందుకు రూపొందిస్తారో తెలుసా? -
స్మార్ట్ ఫోనుల్లో చాలా మంది చేసే తప్పులు ఇవే.. మరి ఏం చేయాలి?
గీతిక (పేరుమార్చడమైనది) డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఈ మధ్య తన క్లాస్మేట్ (నందు) చేసే మెసేజ్‌లు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా అందుకు సంబంధించిన సమాచారాన్ని తిరిగి తనకే పోస్ట్ చేస్తున్నాడు. ఎవరికైనా చెబుదామంటే ఎవరూ నమ్మరు. పైగా తననే నిందిస్తారు. తను ఊళ్లో లేకపోయినా తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తిరిగి తనకే పంపిస్తున్నాడు. ఏమైనా అంటే, నాకు అన్నీ తెలుసు.. అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇది ఇబ్బందికరంగా ఉండటమే కాదు భయంగానూ ఉంటోంది. గీతిక లాగే చాలా మంది ఇబ్బందులకు లోనయ్యే సమస్య ఇది. తమ ఫోన్ హ్యాక్ అయిందనే విషయాన్ని ఏ మాత్రం పసిగట్టలేరు. అంత స్మార్ట్‌గా మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోనుల్లో దొంగలు దూరుతున్నారు జాగ్రత్త. స్మార్ట్ ఫోన్లలో చాలా మంది చేసే కొన్ని తప్పులు ఏంటంటే.. ♦ మనం ఏం చేస్తున్నామో మిగతా అంతా చూసేలా చేయడం. ♦ అలెక్సా వంటి టూల్స్ వాటంతట అవే రన్ అయ్యేలా చేయడం ♦ ఎప్పుడూ యాప్స్ సైన్ ఇన్లోనే ఉండటం ♦ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ ఏదైనా ఓకే చేయడం. వెంటనే తెలుసుకోవాలంటే... ♦ ఆండ్రాయిడ్ వినియోగదారులు అయితే.. సెట్టింగ్స్–యాప్స్, నోటిఫికేషన్లు (ఏదైనా తెలియని యాప్‌లో స్పై, మానిటర్, ట్రాక్ ట్రోజన్ .. మొదలైన పేర్లు ఉన్నాయేమో చెక్ చేయండి. ఒకవేళ అలాంటివి కనిపిస్తే వెంటనే వాటిని తీసేయండి. ఇది తెలుసుకోవడానికి సెట్టింగ్స్, ప్లేస్ – గూగుల్ ప్లే, ప్రొటెక్షన్ స్కాన్ చేయండి. ♦ ఐవోఎస్ వినియోగదారులు అయితే.. అన్ని పాస్‌వర్డ్‌లను మార్చాలి. నెట్వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయాలి. ఐఓఎస్ రీసెంట్ వెర్షన్‌ను అప్డేట్ చేయాలి. స్మార్ట్‌ఫోన్‌లో స్నూపింగ్‌కి అనుమతించేవి... ♦ పిల్లలు వాడుతున్న స్మార్ట్ ఫోన్ల ద్వారా వారు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకోవడానికి ట్రాక్ చేయగల యాప్స్ ఉంటాయి. ♦ కంపెనీ గ్యాడ్జెట్లలో ఇన్స్టాల్ చేయబడిన మానిటరింగ్ సాఫ్ట్వేర్, వాటిని కంపెనీ ప్రయోజనాల కోసమే ఉపయోగించాలి కాబట్టి ఈ హక్కును రిజర్వ్ చేసుకోవచ్చు. ♦ ఆర్డర్ డెలివరీని ట్రాక్ చేయడం, డెలివరీని పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిఘా అవసరం కావచ్చు. కొన్ని రకాల సమస్యలు ♦ హాని కలిగించే యాప్స్, స్పై వేర్, పబ్లిక్ వైఫై, ఉపయోగించని యాప్స్, ఫిషింగ్, పాస్వర్డ్ సెక్యూరిటీ లేనివి .. వంటి వాటి వల్ల సమస్యలు కలగవచ్చు. ముఖ్యమైన పోర్టల్స్ ♦ మీ ఫోన్ IMEI నెంబర్ని https://www.imei.info/ చెక్ చేయండి. ♦ మీ పేరుపై ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో చెక్ చేసుకోవడానికి https://tafcop.dgtelecom.gov.in సైబర్ టాక్ ఎలా చెక్ చేయాలి? ♦ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే సెట్టింగ్స్–యాప్స్, నోటిఫికేషన్స్– కెమెరా/ మైక్రోఫోన్ (ఏదైనా తెలియని యాప్‌కి యాక్సెస్ ఉందో లేదో తనిఖీ చేయండి) ♦ యాపిల్ ఫోన్ అయితే సెట్టింగ్స్– ప్రైవసీ–కెమెరా/మైక్రోఫోన్ (ఏదైనా తెలియని యాప్‌కి యాక్సెస్ ఉందో లేదో చెక్ చేయాలి) తెలుసుకోవడం ఎలా..? ♦ ఫోన్ చాలా స్లో అవుతుంది. ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ♦ డేటా వినియోగం బాగా పెరుగుతుంది. ♦ యూ ట్యూబ్ లేదా ఆన్లైన్ వీడియోలు బఫర్ అవ్వవు. ♦వెబ్ పేజీలు లోడ్ అవడానికి టైమ్ పడుతుంది. ♦ ప్రోగ్రామ్స్, యాప్స్ క్రాష్ అవుతాయి. ♦ గాడ్జెట్ సడెన్‌గా రీస్టార్ట్ అవుతుంది. ♦ చిత్రమైన, ఊహించని మెసేజీలు వస్తుంటాయి. ఏం చేయాలి? ♦ మీ ఫోన్ పరిమితులను మీకు మీరుగా నిర్దేశించుకోండి. ♦ ఐఓఎస్ యాప్స్‌ని వెంటనే అప్డేట్ చేయండి. ♦ ఉపయోగంలో లేనప్పుడు మీ గ్యాడ్జెట్స్‌ను లాక్ చేసి ఉంచండి. ♦ వైఫై, బ్లూ టూత్ వాడకంలో జాగ్రత్తలు పాటించండి. ♦ బ్యాంకింగ్, సామాజిక మాధ్యమాల కోసం రెండురకాలప్రామాణీకరణలను పాటించండి. ♦ డేటాను తరచూ బ్యాకప్ చేయండి. ♦ సెక్యూరిటీ యాంటీవైరస్, మాల్వేర్ అప్లికేషన్లను ఉపయోగించండి ♦ మీరు ఇన్స్టాల్ చేసే యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఎంచుకోండి. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వ్యాపారవేత్తకు భారీ షాక్: రూ. కోటి ఖాళీ, ఏం జరిగిందంటే?
సాక్షి, ముంబై: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు హద్దే లేకుండా రోజురోజుకు మితిమీరుతున్నాయి. టెక్నాలజీ తెలియని అమాయక ప్రజలనే మాత్రమే కాదు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ కోట్లను దోచేస్తున్నారు. తాజాగా ఒక వ్యాపారవత్త మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి కోటి రూపాయలను మాయం చేసిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని థానే నగరంలో వ్యాపారవేత్త ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్‌ను హ్యాకింగ్ గురైందనీ, ఆ తరువాత రూ. 99.50 లక్షలు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారి గురువారం తెలిపారు. ఈ నెల 6-7 తేదీల మధ్య వ్యాపారవేత్త ఫోన్ హ్యాక్ చేసి మరీ, బ్యాంకు ఖాతాలోని సొమ్మును నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇతర ఖాతాలకు తరలించారని వాగ్లే ఎస్టేట్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఐటీ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. -
షాకింగ్.. బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్.. కీలక రహస్యాలు లీక్!
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ వ్యక్తిగత ఫోన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం పనిచేసే ఏజెంట్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. మిత్ర దేశాలతో లిజ్ మాట్లాడిన సంభాషణలతో పాటు ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ క్వాసి కార్తెంగ్ పంపుకున్న సందేశాలు వంటి కీలక రహస్యాలు రష్యా చేతికి చిక్కినట్లు డెయిలీ మెయిల్ కథనం ప్రచురించింది. ట్రస్ ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలోనే రష్యా ఏజెంట్లు ఫోన్ హ్యాక్ చేసినట్లు పేర్కొంది. ట్రస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఆమె క్లోజ్ ఫ్రెండ్ క్వాసి కార్తెంగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. ఈ ఫోన్ హ్యాక్ చేసిన రష్యాకు బ్రిటన్ రహస్యాలు తెలిశాయని డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆయుధ సరఫరా, మిత్ర దేశాలతో సంబంధాలతో పాటు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆమె వివర్శించిన సంభాషణలు కూడా పుతిన్ చేతికి చేరినట్లు వెల్లడించింది. ఇతర దేశాలకు కీలక సమాచారం చిక్కడంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి ఉండవచ్చని తెలిపింది. లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 45 రోజుల్లోనే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. యూకే చరిత్రలోనే అతితక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది ఆమే కావడం గమనార్హం. పదవి చేపట్టాక దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత ముదరడం, మంత్రులు రాజీనామా చేయడంతో లిజ్ ట్రస్ స్వతహాగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రిషి సునాక్ ఎలాంటి పోటీ లేకుండా బ్రిటన్ ప్రధాని అయ్యారు. చదవండి: ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో పేలుడు.. 10 మంది యువకులు మృతి -
ఫోన్ హ్యాకింగ్ భయమా?.. సింపుల్‌గా రీస్టార్ట్ చేయండి
ఈ మధ్య కాలంలో పెగాసస్ పేరు బాగా వినిపిస్తోంది. సొసైటీలో హై ప్రొఫైల్ వ్యక్తుల ఫోన్ డేటా, కాల్ రికార్డింగ్‌లు మొత్తం హ్యాకర్లకు అందుబాటులో పెట్టిందంటూ ఈ కుంభకోణం కుదిపేసింది. అయితే తాము పెగాసస్ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతామని ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో ప్రకటనతో వివాదం రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. అయితే హ్యాకింగ్‌కు ఎవరూ అతీతులు కాదు. ఈ తరుణంలో హ్యాకింగ్ భయాలు-అనుమానాలు సాధారణ ప్రజల్లోనూ వెంటాడొచ్చు. కాబట్టి, హ్యాకర్ల ముప్పు తీవ్రతను తగ్గించుకునేందుకు ఓ సింపుల్ టిప్ చెబుతున్నారు సెన్ అంగస్ కింగ్. సెన్ అంగస్ కింగ్(77).. అమెరికా జాతీయ భద్రతా సంస్థ విభాగం(NSA) ‘సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ’ సభ్యుడు. ఇంతకీ ఆయన ఏం సలహా ఇస్తున్నాడంటే.. ఫోన్‌ను రీబూట్ చేయమని. రోజుకు ఒకసారి కాకపోయినా.. కనీసం వారానికి ఒకసారి రీస్టార్ట్ చేసినా చాలని ఆయన చెప్తున్నాడు. యస్.. కేవలం ఫోన్‌ను ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా హ్యాకర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆయన అంటున్నాడు. ఇదేం కొత్తది కాదని డిజిటల్ ఇన్సెక్యూరిటీ కోసం ఎన్నో ఏళ్లుగా కంప్యూటర్ల మీద వాడుతున్న ట్రిక్కేనని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే.. పూర్తిగా కాకున్నా.. బోల్తా స్మార్ట్ ఫోన్ రీబూట్ అనేది సైబర్ నేరగాళ్లను పూర్తిగా కట్టడి చేయలేదని, కానీ, అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించే హ్యాకర్లకు సైతం హ్యాకింగ్ పనిని కష్టతరం చేస్తుందనేది నిరూపితమైందని ఆయన అంటున్నాడు. ఇక NSA గత కొంతకాలంగా చెప్తున్న ఈ టెక్నిక్‌పై నిపుణులు సైతం స్పందిస్తున్నారు. కొన్ని ఫోన్లలో సెక్యూరిటీ బలంగా ఉంటుంది. హ్యాకింగ్ అంత ఈజీ కాదు. కాబట్టే హ్యాకర్లు యాక్టివిటీస్ మీద నిఘా పెడతారు. అదను చూసి ‘జీరో క్లిక్’ పంపిస్తారు. అయితే ఫోన్ రీస్టార్ట్ అయిన ఎలాంటి ఇంటెరాక్షన్ ఉండదు. కాబట్టి, ‘జీరో క్లిక్’ ప్రభావం కనిపించదు. దీంతో హ్యాకర్లు సదరు ఫోన్‌ను తమ టార్గెట్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంది. ఇలా హ్యాకర్లను బోల్తా కొట్టించవచ్చు. జీరో క్లిక్ అంటే.. జీరో క్లిక్ అంటే నిఘా దాడికి పాల్పడే లింకులు. సాధారణంగా అనవసరమైన లింకుల మీద క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని చాలామందికి తెలుసు. కానీ, ఇది మనిషి ప్రమేయం లేకుండా, మానవ తప్పిదంతో సంబంధం లేకుండా ఫోన్లోకి చొరబడే లింక్స్. హ్యాకర్లు చాలా చాకచక్యంగా ఇలాంటి లింక్స్‌ను ఫోన్లోకి పంపిస్తుంటారు. అంటే మనం ఏం చేసినా.. చేయకపోయినా ఆ లింక్స్ ఫోన్లోకి ఎంటర్ అయ్యి.. హ్యాకర్లు తమ పని చేసుకుపోతుంటారన్నమాట. పైగా ఈ లింకులను గుర్తించడం కష్టం. అందుకే వాటిని నివారించడం కూడా కష్టమే. అయితే ఫోన్ రీబూట్ సందర్భాల్లో హ్యాకర్లు.. తెలివిగా మరో జీరో క్లిక్ పంపే అవకాశమూ లేకపోలేదు. కానీ, ఫోన్‌ను రీస్టార్ట్ చేయడమనే సింపుల్ ట్రిక్‌తో హ్యాకింగ్ ముప్పు చాలావరకు తగ్గించగలదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. -
Pegasus: ఆగస్టు మొదటివారంలో విచారిస్తాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ వ్యవహారంపై దాఖలు చేసిన పిల్‌ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పెగాసస్ కుంభకోణంపై కోర్టు పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తు కోరుతూ ప్రముఖ జర్నలిస్టులు ఎన్ రామ్, శశి కుమార్ ఇతరులు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపైన ఆగస్టు మొదటి వారంలో విచారణ చేపడతామని ప్రకటించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ దీనిపై విచారణ జరుపుతుంది. జాతీయ భద్రతపై పెగాసెస్ పర్యవసానాల కారణంగా దీనిపై విచారణ అత్యవసరం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ తెలిపారు. పౌర స్వేచ్ఛపై పెగాసస్ తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెగాసస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం విపక్ష నాయకులు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థలోని ప్రముఖుల ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఇది భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రకంపనలు సృష్టించిందని సిబాల్ తెలిపారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. దీనిపై "వచ్చే వారం వింటాం" అని సీజేఐ రమణ స్పందించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్‌ను ఉపయోగించి దేశంలోని ప్రముఖ పౌరులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ చేశారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని రామ్, ఇతరులు డిమాండ్ చేశారు. ఇక పార్లమెంట్లో పెగాసస్‌పై రచ్చ జరుగుతుంది. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ.. దీనిపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు అధికారపక్షంపై ఒత్తిడి తెస్తున్నాయి. కీలక నేతల ఫోన్ సంభాషణలను పెగాసస్ ద్వారా హ్యాక్ చేశారని, వ్యక్తగత భద్రతకు స్వేచ్ఛ లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. పెగాసస్, వ్యవసాయ చట్టాల వ్యవహారంతో ఇప్పటికే సభ అనేకసార్లు వాయిదా పడింది. -
రాజ్యసభలో రగడ
న్యూఢిల్లీ: పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ అంశం మరోసారి పార్లమెంట్ సభాకార్యక్రమాలను పట్టి కుదిపేసింది. దేశంలోని ప్రముఖ నాయకులు, సుప్రీంకోర్టు జడ్జి, కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయుల ఫోన్ల హ్యాకింగ్ ఉదంతంపై కేంద్రప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా సవివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం తరఫున కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరణ ఇవ్వాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభ వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. దీంతో ఈ అంశంపై రాజ్యసభలో వివరణ ఇచ్చేందుకు ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేచి నిలబడి తన చేతుల్లోని పేపర్లను చదవడం మొదలుపెట్టారు. కొన్ని వాక్యాలు చదవడం పూర్తయ్యేలోపే తృణమూల్ ఎంపీ శంతను సేన్.. మంత్రి వైష్ణవ్ చేతుల్లోని పేపర్లు లాక్కొని, చింపేసి, గాల్లోకి విసిరేశారు. దీంతో మంత్రి తన ప్రసంగాన్ని ఆపేయాల్సి వచ్చింది. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కలగజేసుకుని.. సభ్యులు సభలో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఆ తర్వాత తన వివరణ/నివేదికకు సంబంధించిన ప్రతిని ఒకదాన్ని డిప్యూటీ చైర్మన్‌కు మంత్రి అందజేశారు. వెల్‌లో ఆందోళనలు ఆగకపోవడంతో సభను వాయిదావేస్తున్నట్లు డెప్యూటీ చైర్మన్ ప్రకటించారు. పెగసస్ వివాదం మొదలయ్యాక 19వ తేదీన మంత్రి మీడియాతో మాట్లాడిన అంశాలే.. సభలో డిప్యూటీ చైర్మన్‌కు మంత్రి ఇచ్చిన నివేదికలో ఉన్నాయి. ‘ప్రముఖులపై నిఘా పెట్టారంటూ ది వైర్ వెబ్‌పోర్టల్ ద్వారా వెల్లడైన నివేదికలన్నీ అబద్ధాలు. భారత ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు సృష్టించినవి ’అని మంత్రి వివరణలో ఉంది. మంత్రి హర్దీప్ దూషించారు: శంతను సేన్ ‘సభలో మంత్రి వైష్ణవ్ చేతిలోని పేపర్లు చింపేసి నిరసన తెలిపాను. అదే సమయంలో అక్కడే ఉన్న మంత్రి హర్దీప్సింగ్ పూరీ నన్ను బూతులు తిట్టారు. నాపై దాడికి సైతం ప్రయత్నించారు. తోటి ఎంపీలు నన్ను వెనక్కి లాగి కాపాడారు’అని తృణమూల్ ఎంపీ శంతను సేన్ మీడియాతో చెప్పారు. మంత్రి వైష్ణవ్సహా పలువురి పట్ల సభామర్యాదలు ఉల్లంఘించి ప్రవర్తించిన విపక్ష సభ్యులపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఎంపీ శంతను సేన్‌పై సస్పెన్షన్ విధించాలని రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. -
కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు చలో రాజ్‌భవన్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేడు చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కాగా తమ నిరసనలు శాంతియుతంగా కొనసాగించాలని కాంగ్రెస్ భావించగా.. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పందించారు. '' శాంతియుతంగా తలపెట్టిన చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిరసనలు చేస్తుంటే అరెస్ట్ చేయడం సరికాదు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. ఇందిరా పార్కు వద్ద జరిగే నిరసన కార్యక్రమాలలో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని'' డిమాండ్ చేశారు. -
భార్య ఫోన్ హ్యాక్ చేసిన భర్త.. భార్య ఏం చేసిందంటే..!
చైత్ర (పేరు మార్చడమైనది), వర్ధన్(పేరు మార్చడమైనది) ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పెళ్లై ఎనిమిదేళ్లు. ఇద్దరి జీతాలు నెలకు చెరో లక్ష రూపాయలకు పైనే. ఆరేళ్ల కూతురు. చింతల్లేని చిన్నకుటుంబం. అర్ధరాత్రి దాటింది. ల్యాప్‌ట్యాప్ మూసేసి బెడ్ మీద వాలింది చైత్ర. నోటిఫికేషన్ ఏదో వచ్చినట్టు ఫోన్లో ‘బీప్’ మని సౌండ్ వచ్చింది. ఫోన్ చేతిలోకి తీసుకుంది చైత్ర. మెసేజ్ చూడగానే పెదాల మీదకు యధాలాపంగా నవ్వు వచ్చింది. ఆ పక్కనే ఉన్న వర్ధన్ కూడా ఫోన్లోనే ఉన్నాడు. చైత్రను ఒకసారి చూసి, లైట్ ఆఫ్ చేసి, తన ఫోన్ పక్కన పెట్టి, పడుకున్నాడు. చైత్ర మరో అరగంట వరకు ఉండి తనూ పడుకుంది. ఏడాది క్రితం వరకు ఇద్దరూ ఆఫీసులకు వెళ్లేవారు. లాక్డౌన్ పుణ్యమా అని వర్క్‌ఫ్రమ్ హోమ్ కారణంగా ఇద్దరూ ఇంటినుంచే వర్క్ చేస్తున్నారు. ఓ రోజు చైత్ర ఇంటి నుంచి బయటకు వచ్చేసి, విడాకులు ఫైల్ చేసింది. ఇరువైపు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకునే స్థితి లేదు. ఇద్దరి ఒంటిమీద గాయాల తాలూకు మచ్చలు ఉన్నాయి. ఆరేళ్ల వారి కూతురు బిక్కుబిక్కుమంటూ తల్లితండ్రిని చూస్తూ ఉండిపోయింది. ఏమైందంటే.. భార్యాభర్త ఇద్దరూ ఇంటి దగ్గర ఉంటున్నారు. ఇంటి పనులు చేయడంలో వాటాలు వేసుకున్నారు. నువ్వంటే.. నువ్వంటూ .. ఇద్దరి ఇగోస్ దెబ్బతిన్నాయి. కొన్ని రోజుల వరకు భరించిన చైత్రకు వర్ధన్ అంటే అసహనం మొదలైంది. ఓ రోజు తన కొలీగ్ నుంచి ఓదార్పు మెసేజ్‌తో చైత్రకు పోగొట్టుకున్న పెన్నిధి దొరికినట్టయ్యింది. సాధారణంగా మొదలైన మెసేజ్.. రెగ్యులర్‌గా చాట్ చేయడం వరకు వెళ్లింది. భార్య అస్తమానం ఫోన్‌తో ఉండటం గమనించిన వర్ధన్ ఆమెకు తెలియకుండా ఆమె ఫోన్లో ఓ సాఫ్ట్‌వేర్‌ని ఇన్స్టాల్ చేశాడు. ఆమెకు వచ్చిన మెసేజ్‌లు, ఆమె వాడిన డేటా, రోజు మొత్తం ఎన్ని గంటలు ఫోన్లో ఉంటుందనే వివరాలన్నీ తను గమనించడం మొదలుపెట్టాడు. చైత్ర కూడా భర్త తనతో సరిగా లేకపోవడంతో చిన్న అనుమానం మొదలైంది. సాఫ్ట్వేర్ కావడంతో భర్త ఫోన్లో అతనికి తెలియకుండా అతని డేటాను తన ఫోన్లో చూసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకుంది. చిన్న డౌట్‌తో మొదలై ఒకరి ఫోన్లను ఇంకొకరు హ్యాక్ చేసుకునేంతవరకు వెళ్లారు. ఇద్దరిలోనూ ఒకరిపై ఒకరికి విపరీతమైన అనుమానం తలెత్తింది. ఫలితంగా గొడవలు. ఓ రోజు ఇద్దరూ కొట్టుకోవడంతో విషయం పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. అటు నుంచి విడాకులకు దారితీసింది. స్మార్ట్‌గా.. విచ్ఛిన్నం అవుతున్న జీవితాలు సైబర్ సేఫ్టీ వింగ్ వారు ఒకరినొకరు చేసుకున్న ఫోన్ హ్యాకింగ్ గుర్తించి, అసలు విషయం తెలుసుకున్నారు. ‘ఒక ఇంటి కప్పు కింద ఉన్నవాళ్లైనా తమ వాళ్లను చేసే సాఫ్ట్ మోసం కూడా జీవితాలను చెల్లాచెదురు చేస్తుంది. కోవిడ్ వల్ల అందరూ ఇంట్లోనే ఉండే స్థితి. ఫలితంగా గృహహింస కేసులు 27 శాతం పెరిగాయి. అదే ఐటి కమ్యూనిటీలలో ఉన్నవారి కేసులయితే 28 శాతం ఉన్నాయి’ అంటూ వివరించారు సైబర్ సేఫ్టీ నిర్వాహకులు అనీల్ రాచమల్ల. స్మార్ట్‌గా ఉంటే సరిపోదు స్మార్ట్ ఫోన్ వాడకం పట్ల అవగాహన పెంచుకుంటే జీవితాలు దిద్దుకోవచ్చని చెబుతున్నారు. బానిసలవడమే అసలు కారణం స్మార్ట్ ఫోన్లో ఉండే సాఫ్ట్వేర్ వాడకంతో ఐటీ కమ్యూనిటీలో కొత్త ఆలోచనలు పెరుగుతున్నాయి. తమ భాగస్వాముల ఫొటోలు తీసి షేర్, ట్యాగ్ చేయడం చేస్తుంటారు. ఆన్లైన్ అవమానం అంటూ ఓ కొత్త తరానికి తెరతీస్తున్నారు. భర్త లేదా భార్య తనని పట్టించుకోవడం లేదని బాధపడుతూ బయటివారితో చాటింగ్ చేస్తూ ‘సో బ్యూటిఫుల్, గార్జియస్, అమేజింగ్’ అంటూ మెచ్చుకునే పదాలకు పొంగిపోతుంటారు కొందరు. స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ వల్లే డైవోర్స్ రేట్ పెరుగుతోందని మా నివేదికల్లో తేలింది. స్క్రీన్ టైమ్.. గ్రీన్ టైమ్ లెక్కింపు ఫోన్ స్క్రీన్ మీద ఎంతసేపు ఉంటున్నాం. పచ్చదనంలో ఎంతసేపు ఉంటున్నాం.. అనేది కూడా గ్రహించాలి. ఈ నిబంధన పెట్టుకోవడం వల్ల ఫోన్లో గడిపే సమయం తగ్గుతుంది. టెక్నాలజీని ఎలా వాడుకోవాలనే విషయాలపట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి. బంధాలు విచ్ఛిన్నం చేసుకునేంతగా, మన ప్రవర్తన–అలవాట్లు మారేంతగా స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నామా అనేది కూడా గ్రహింపులోకి తెచ్చుకోవాలి. స్మార్ట్ ఫోన్‌ని బెడ్రూమ్లోకి తీసుకెళ్లకూడదు. ఒక టైమ్ పరిధి దాటగానే నోటిఫికేషన్ని బ్లాక్ చేసుకోవాలి. ఇప్పుడున్న కాలంలో నిజం చెప్పినా ‘ఈజ్ ఇట్ ట్రూ’ అని అడుగుతుంటారు. ఒక అబద్ధంలో బతికేస్తున్నామనే విషయం సోషల్ మీడియా వల్ల మనకు అర్థమవుతూనే ఉంది. అందుకే, మన ప్రైవసీని కాపాడుకుంటూ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. ఇంటర్నెట్ వాల్యూస్, డిజిటల్ వెల్నెస్ గురించి మరింత తెలుసుకోవడానికి సైబర్ టాక్‌ను సంప్రదించవచ్చు. – అనీల్ రాచమల్ల, ఎండ్ నౌ ఫౌండేషన్, సైబర్ సేఫ్టీ, హైదరాబాద్ -
'జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ చేయలేదు'
వాషింగ్టన్ : వాట్సప్ మెసేజ్ ద్వారా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ వాషింగ్టన్‌లోని సౌదీ ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ ట్విటర్ ద్వారా అధికారులు స్పందిస్తూ.. బెజోస్ ఫోన్ హ్యాక్‌కు గురైందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహ్మద్ బిన్ సల్మాన్‌కు బెజోస్ ఫోన్ హ్యాక్ చేయాల్సిన అవసరం ఏముంటదని తెలిపారు. కాగా 2018లో సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ నుంచి ఓ వాట్సాప్ మెసేజ్ రిసీవ్ చేసుకున్న అనంతరం జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ అయిందని వాషింగ్టన్ పత్రిక పేర్కొన్న విషయం తెలిసిందే. మహ్మద్ బిన్ సల్మాన్ వ్యక్తిగత వాట్సాప్ అకౌంట్ నుంచి వైరస్‌తో కూడిన వీడియో ఫైల్‌ను పంపడం ద్వారా 2018 నుంచి అమెజాన్ చీఫ్ ఫోన్‌కు సంబంధించిన డేటా చోరీకి గురైందని తమ కథనంలో పేర్కొంది. దీంతో పాటు 2018లో కాలమిస్ట్ జమల్ ఖషోగ్గి మరణానికి సౌదీ రాజుకు ప్రమేయముందని సెంట్రల్ కూడా తమ కథనంలో రాసుకొచ్చింది. (జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్ చేసిన సౌదీ రాజు) -
ప్రియాంక ఫోన్ హ్యాక్ చేశారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఫోన్ హ్యాక్‌కు గురైందని ఆ పార్టీ ఆరోపించింది. ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ వల్ల ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 1400 మంది ఫోన్లు హ్యాక్‌కు గురైనట్లు వాట్సాప్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని యూజర్లకు తెలిపేందుకు వాట్సాప్ ప్రత్యేక సందేశాలను బాధితులకు పంపింది. ఇలాంటి సందేశం ప్రియాంకాగాంధీ ఫోన్‌కు కూడా వచ్చినట్లు కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆదివారం స్పష్టంచేశారు. అయితే, పెగాసస్ వల్లనే హ్యాక్ అయినట్లు ఆ వాట్సాప్ సందేశం పేర్కొనలేదని చెప్పారు. ఈ హ్యాక్‌ను ప్రభుత్వమే చేయించిందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం కుట్రపూరిత మౌనాన్ని అవలంబిస్తోందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రభుత్వానికి ముందే చెప్పాం: వాట్సాప్ ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ భారత్‌కు చెందిన 121 మందిని టార్గెట్ చేసుకుందని సెప్టెంబర్‌లోనే ప్రభుత్వాన్ని హెచ్చరించామని వాట్సాప్ సంస్థ చెబుతోంది. అయితే, దీనిపై వాట్సాప్ తమకు పూర్తి సమాచారం ఇవ్వలేదని ఐటీ శాఖ పేర్కొంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రెండు పార్లమెంటరీ కమిటీలు ఫోన్ హ్యాకింగ్‌పై సమావేశాలు జరపనున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని హోంశాఖ కార్యదర్శి ద్వారా తెలుసుకోనున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన ఘటనలు చింతించదగ్గవని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. 15న జరగనున్న భేటీలో కశ్మీర్‌తో పాటు వాట్సాప్ అంశాన్ని కూడా చర్చిస్తామని తెలిపారు. -
ప్రియాంక ఫోన్ హ్యాక్ చేశారు
-
వాట్సాప్ స్పైవేర్‌తో ప్రియాంక ఫోన్ హ్యాక్..
సాక్షి, న్యూఢిల్లీ : విపక్ష నేతల ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తమ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా, పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. వాట్సాప్ స్పైవేర్ ద్వారా ప్రియాంక గాంధీ ఫోన్‌ను హ్యాక్ చేశారని ధ్వజమెత్తింది. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న మంత్రులు, అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. కాగా ఇజ్రాయిల్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎన్ఎస్ఓ వాట్సాప్ సర్వర్ల ద్వారా స్పైవేర్‌తో 20 దేశాలకు చెందిన1400 మంది యూజర్లను టార్గెట్ చేసిందని వాట్సాప్ మాతృసంస్థ ఫేస్బుక్ గతవారం ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. భారత్‌లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇలా టార్గెట్ చేసిన వారిలో జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు సహా ప్రభుత్వ అధికారులు ఉన్నట్టు ఫేస్బుక్ పేర్కొంది. ఎన్ఎస్ఓపై ఫేస్బుక్ దావా వేయడం ద్వారా న్యాయపోరాటానికి దిగింది. -
హ్యాకైన అమెజాన్ సీఈఓ ఫోన్
సాక్షి, వాషింగ్టన్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్‌కు గురైంది. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులు ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్టు సమాచారం. జెఫ్ బెజోస్ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడానికే హ్యాకింగ్ జరిగినట్టు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో కాలమిస్ట్ అయిన జమాల్ ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు సౌదీ ప్రభుత్వమే కారణమంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. దీనికి ప్రతిచర్యగా బెజోస్ ఫోన్‌ను సౌదీ హ్యాక్ చేసిందని, ఆయనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సౌదీ అధికారులు దొంగిలించారని బెజోస్ సెక్యూరిటీ అధికారి గవిన్ బెకర్ తెలిపారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని గెవిన్ బెకర్ అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఖషోగ్గి హత్యను ప్రిన్స్ సల్మాన్ చేయించారని అమెరికా ఇంటెలిజన్స్ సంస్థ సీఐఏ సెనేట్‌కు సమాచారమందించింది. -
నటి ఫోన్ హ్యాక్.. ప్రైవేట్ ఫోటోలు లీక్
మొన్న అక్షరా హాసన్.. నిన్న అమీ జాక్సన్.. నేడు హన్సిక మోత్వాని.. ఏంటనుకుంటున్నారా హ్యాకింగ్ బాధితులు. అవును నటి హన్సిక ఫోన్ హ్యాక్ అయ్యింది. దాంతో ఆమె ప్రైవేట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హన్సిక ఫోన్‌ని హ్యాక్ చేసిన వ్యక్తులు ఆమె టూ పీస్ బికినీ ధరించి తీసుకున్న సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమయ్యారు హన్సిక. పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ‘నా ఫోన్, ట్విటర్ అకౌంట్ రెండు హ్యాక్ అయ్యాయి. ప్రస్తుతం నా బ్యాక్ ఎండ్ టీమ్ దీని గురించి పని చేస్తోంది. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. నా ట్విటర్ ఖాతాలో వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి అంటూ హన్సిక ట్వీట్ చేశారు. ప్రస్తుతం హన్సిక మహా చిత్రంలో నటిస్తున్నారు. ఇది హన్సిక నటిస్తున్న 50వ చిత్రం. Phone n Twitter hacked please don’t respond to any random messages . My back end team is working on getting things in control. — Hansika (@ihansika) January 23, 2019 -
స్మార్ట్ ఫోన్లపై హ్యాకర్ల కన్ను
ప్రస్తుతం ఆన్లైన్ బ్యాంకు లావాదేవీలకు ఎక్కువ మంది స్మార్టుఫోన్లనే వినియోగిస్తున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరస్తులు మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి మీ విలువైన సమాచారం దొంగలించే అవకాశం ఉంది. ఇటీవల వెలుగు చూస్తోన్న సైబర్ నేరాల్లో హ్యాకింగ్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులను సైతం హాకింగ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ బ్యాంకులు కస్టమర్లను అలర్ట్ చేసి కొత్త కార్డులు జారీ చేశాయి. ఇలా మీ స్మార్ట్ ఫోన్లలోకి వైరస్ రూపంలో ఓ సాఫ్ట్వేర్నుపంపి మీ మొబైల్ లావాదేవీలపై దుండగులు ఓ కన్నేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ బారి నుంచి రక్షించుకోవాలంటే, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. అల్లిపురం(విశాఖదక్షిణ): స్మార్ట్‌ఫోన్ ఆన్ చేసేటప్పుడు పాస్‌వర్డ్‌ను అడిగేలా లాక్‌సెట్ చేసుకోవాలి. చీటికి మాటికి లాక్ తీయాల్సి వస్తుందని విసుగు చెందవద్దు. ఈ లాక్ పిన్పాస్వర్డ్, ప్యాట్రన్ లాక్ ఏదైనా కావచ్చు. ఓపెన్ వైఫైతో ప్రమాదమే కొందరు వారి ఫోన్లలో ఎప్పుడూ వైఫై/మొబైల్ డేటా ఆన్‌చేసి ఉంచుతారు. అయితే అలా ఉంచాల్సిన పని లేదు. మొబైల్ డేటా మాట అటుంచి వైఫై ఎప్పుడూ ఆన్లైన్లో ఉందనుకోండి. ఒక్కోసారి ఓపెన్ వైఫై/ పబ్లిక్ వైఫైలకు కనెక్ట్ అయితే హ్యాకర్ల నుంచి ఏదైనా ప్రమాదం ఉందని నిపుణులు చెపుతున్నారు. వారు మీ డివైస్‌ను కంట్రోల్‌ను వారి చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఆటో మేటిక్ వైఫై కనెక్షన్ ఆపేయండి. డేటా ఎన్క్రిప్షన్ ఎనాబుల్ చేసుకోవాలి స్మార్ట్ ఫోన్లలో సెట్టింగ్స్, సెక్యూరిటీ అనే విభాగంలోకి వెళితే అక్కడ డేటా ఎన్క్రిప్షన్ అనే ఫీచర్ డిజేబుల్ అయి ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో మీ డివైస్‌లోని సమాచారాన్నిఅంత ఈజీగా ఎవరూ తస్కరించలేరు. ఎందుకంటే డివైస్‌లోని వివరాలన్నీ 256 బిట్ లేదా 128బిట్ సెక్యూరిటీతో లాక్ అయి ఉంటాయి. వాటిని ఓపెన్ చేయడం అంత సులభం కాదు. థర్డ్ పార్టీ యాప్‌ల జోలికి వెళ్లద్దు ఆండ్రాయిడ్, ఐ ఫోన్ ఏది వాడినా వాటిలో ఆయాస్టోర్స్లో ఉండే అప్లికేషన్లను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ అయితే గూగుల్ ప్లేస్టోర్, ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్‌కు వెళ్లి కావాల్సిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రీగా లభిస్తున్నాయని ఇతర వేరే సైట్ నుంచి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దు. ఇతరసైట్లలోని యాప్‌లన్నీ 99 శాతం వైరస్లు ఉంటాయి. ఇలా థర్డ్ పార్టీ స్టోర్ల నుంచి యాప్‌లను ఏ ఇన్స్టాల్ చేసుకోవద్దు. పోర్న్ (అశ్లీల) వెబ్ సైట్లతో ముప్పు కంప్యూటర్లలో పోర్న్ దృశ్యాలు ఏ విధంగా చూసేవారో ఇప్పుడు స్మార్ట్ఫోన్లలో అశ్లీల వీడియోలు చూడడం కూడా ఎక్కువైంది. అయితేఇలా చేయడం మీ ఫోన్ రక్షణ విషయంలో ఏమాత్రం మంచిది కాదు. అలాంటి సైట్లలో మాల్వేర్, వైరస్లు చొరబడతాయి. బ్యాంకింగ్ లావాదేవీలు చేసే ఫోన్లలో పోర్న్ సైట్ల వైపు వెళ్లకండి. ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ల విషయంలో జర జాగ్రత్త ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్లు మీకు స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఏదైనా బ్యాంకు నుంచివచ్చినట్లు కొన్నిసార్లు ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్లు, ఇన్స్టంట్, పుష్ మెసేజ్‌లు వస్తుంటాయి.అయితే వాటిని ఓపెన్ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. సాధారణంగా ఎవరికీ బ్యాంకింగ్ డిటెయిల్స్ ఇవ్వమని ఎవరిని అడగరు.బ్యాంకులైతే ఆ పని అసలు చెయ్యవని గమనించండి. కొన్ని మెసేజ్‌లకు, మెయిల్స్‌కు లింకులు ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే ఏదైనా ఆఫర్వస్తుందనో, లేదంటే మరో గిఫ్ట్ వస్తుందనోమెసేజ్లో మభ్య పెడతారు. అలాంటి సందర్భాల్లో ఆ లింకులను అసలు ఓపెన్ చెయ్యవద్దు. అదిహ్యాకర్ల విసిరిన వల అని జాగ్రత్త పడండి. ఈసూచనలు పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఆర్థిక లావాదేవీలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. బ్రౌజింగ్ సురక్షితం బ్యాంకింగ్ లావాదేవీలు చేసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు వెబ్సైట్ అడ్రస్ టైప్ చేసే ఎంటర్ చేస్తే వచ్చే అడ్రస్ ఒకసారి కచ్చితంగా పరిశీలించాలి. బ్యాంకింగ్ సంబంధిత వెబ్సైట్ అయితే సైట్ అడ్రస్‌కు ముందు http://కచ్చితంగా ఉంటుంది. అలా లేదంటే ఆ సైట్ సురక్షితం కాదని తెలుసుకోండి. వెంటనే లావాదేవీలు ఆపేయ్యండి. -
దొంగ దొరుకుతాడా?
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు.. సమస్యలందు అందరి సమస్యలు వేరయా అనొచ్చు. అయితే ఒక్కోసారి ఇద్దరు వ్యక్తులకు ఒకే సమస్య ఎదురవుతుంది. విచిత్రంగా త్రిషకూ, హన్సికకూ అదే జరిగింది. ఈ ఇద్దరి ఫోన్లను ఎవరో హ్యాక్ చేశారు. ఫోన్లో ఉన్నవన్నీ చెరిపేసి.. మొత్తం ఖాళీ చేసేశారు. ‘‘ఎవరో పనిలేనివాళ్లు నా ఫోన్లో ఉన్న డేటానంతా చెరిపేశారు. అందుకని నా ఫోన్ నంబర్ తెలిసిన సన్నిహితులు, శ్రేయోభిలాషులందరూ మీ పేరుతో మీ ఫోన్ నంబర్ జతచేసి నా ఫోన్‌కి మెసేజ్ పెట్టగలరు’’ అని త్రిష పేర్కొన్నారు. ఆ వెంటనే హన్సిక... ‘‘నా ఫోన్ పరిస్థితి కూడా ఇదే. అందుకని నాక్కూడా మెసేజ్ పెట్టగలరు’’ అని విన్నవించుకున్నారు. ఇలా తమ ఫోన్‌ని హ్యాక్ చేసిన దొంగ దొరికితే త్రిష-హన్సిక ఊరుకుంటారా? అవునూ.. దొంగ దొరుకుతాడంటారా?