దొంగ దొరుకుతాడా? | Someone hansika and trisha's phones have been hacked | Sakshi
Sakshi News home page

దొంగ దొరుకుతాడా?

Published Sun, Nov 20 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

దొంగ దొరుకుతాడా?

దొంగ దొరుకుతాడా?

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు.. సమస్యలందు అందరి సమస్యలు వేరయా అనొచ్చు. అయితే ఒక్కోసారి ఇద్దరు వ్యక్తులకు ఒకే సమస్య ఎదురవుతుంది. విచిత్రంగా త్రిషకూ, హన్సికకూ అదే జరిగింది. ఈ ఇద్దరి ఫోన్లను ఎవరో హ్యాక్ చేశారు. ఫోన్‌లో ఉన్నవన్నీ చెరిపేసి.. మొత్తం ఖాళీ చేసేశారు. ‘‘ఎవరో పనిలేనివాళ్లు నా ఫోన్‌లో ఉన్న డేటానంతా చెరిపేశారు.

అందుకని నా ఫోన్ నంబర్ తెలిసిన సన్నిహితులు, శ్రేయోభిలాషులందరూ మీ పేరుతో మీ ఫోన్ నంబర్ జతచేసి నా ఫోన్‌కి మెసేజ్ పెట్టగలరు’’ అని త్రిష పేర్కొన్నారు. ఆ వెంటనే హన్సిక... ‘‘నా ఫోన్ పరిస్థితి కూడా ఇదే. అందుకని నాక్కూడా మెసేజ్ పెట్టగలరు’’ అని విన్నవించుకున్నారు. ఇలా తమ ఫోన్‌ని హ్యాక్ చేసిన దొంగ దొరికితే త్రిష-హన్సిక ఊరుకుంటారా? అవునూ.. దొంగ దొరుకుతాడంటారా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement