హీరో, హీరోయిన్ల ప్రైవేట్ ఫోటోలు లీక్..హల్‌చల్!
చెన్నై: కోలీవుడ్‌లో గాయని, నటి సుచిత్ర తన ట్వీట్‌లతో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలలో పాడిన ఆమె నటిగానూ రాణిస్తున్నారు. కాగా ఇటీవల ఒక పార్టీలో నటుడు ధనుష్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తన ట్విట్టర్‌లో పేర్కొని పెద్ద సంచలనాన్నే సృష్టించారు. హీరో ధనుష్ తనతో తప్పుగా ప్రవర్తించారని, ఈ విషయాన్ని ఎక్కడ, ఎవరితో చెప్పడానికైనా సిద్ధమేనని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే ఆ తరువాత గాయని సుచిత్ర భర్త, నటుడు కార్తీక్‌కుమార్ ఈ ప్రచారాన్ని ఖండించారు. ధనుష్ గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది తన భార్య సుచిత్ర కాదని, ఆమె ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్ చేసి అలాంటి దుష్ప్రచారానికి పాల్పడారని వివరణ ఇచ్చారు. (హీరోలపై గాయని సంచలన ఆరోపణలు)
అయితే ఆ కలకలం చల్లారక ముందే సుచిత్ర మరోసారి హీరో ధనుష్, సంగీత దర్శకుడు అనిరుధ్, నటి తాప్సీ, ఆండ్రియా, హన్సిక, బుల్లితెర నటి వ్యాఖ్యా డీడీ (దివ్యదర్శిని)ల రాసలీలలంటూ వారి ఫొటోలను తాజాగా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేగాకుండా ఇది నటుడు ధనుష్ రాసలీల, ఇది అనిరుధ్ రాసలీల, ఇవి తాప్సీ, ఆండ్రియా, బుల్లితెర నటి డీడీల రాసలీలల దృశ్యాలు అంటూ రైటప్‌లను కూడా పేర్కొనడం ప్రకంపనలను సృష్టిస్తోంది. కాగా కొసమెరుపేమిటంటే ఈ సారి కూడా ఆ ఫొటోలను తాను పోస్ట్ చేయలేదని, తన ట్విట్టర్‌ను ఎవరో హ్యక్ చేసి ఇలా ప్రచారం చేస్తున్నారని చేతులు దులిపేసుకున్నారు.
అంతేకాకుండా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ ఫోటోలను డిలీట్ చేశారు. అయితే ఈ దుమారం నేపథ్యంలో సుచిత్ర తన ట్విట్టర్ అకౌంట్ ను లాక్ చేసి పెట్టుకున్నారు. ఆమెను ఎవరైనా ట్విట్టర్ లో ఫాలో కావాలంటే సుచిత్ర అనుమతి కావాల్సిందే. రిక్వెస్ట్ ను ఆమె ఓకే చేసిన తర్వాత మాత్రమే సుచిత్ర ట్విట్స్, వాల్ ను చూడగలం. కాగా గాయని సుచిత్ర ట్విట్టర్‌ను ఎవరూ హ్యాక్ చేయలేరని, ఆ విధంగా తను ఎలా పాస్‌వర్డ్ పెట్టుకున్నారని నెటిజన్లు పేర్కొనడం గమనార్హం.