Dhanush Watched 'Jailer' Movie With Trisha - Sakshi
Sakshi News home page

అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో 'జైలర్‌' చూసిన ధనుష్‌

Aug 12 2023 12:27 PM | Updated on Aug 12 2023 2:31 PM

Danush Jailer Movie Watch With Trisha - Sakshi

సూపర్‌ స్టార్ రజినీకాంత్‌, తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం జైలర్‌. విజయ్‌తో నెల్సన్‌  బీస్ట్‌ సినిమా తీశాడు. ఇది ప్లాప్‌ కావడంతో ఎంతో కసితో జైలర్‌ను తెరకెక్కించి మళ్లీ సూపర్‌ హిట్‌ కొట్టాడు.  ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌, జాకీష్రాఫ్‌, కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఉన్నారు. దీంతో సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ అంతా మొదటిరోజు థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అదే సమయంలో, నటుడు ధనుష్ కూడా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నా సమయం తీసుకొని జైలర్‌ కోసం థియేటర్‌కు వెళ్లాడు. కానీ అప్పటికే అక్కడ తన మాజీ అత్తగారు కూడా సినిమా చూడటానికి వెళ్లారు. అంత వరకు బాగుంది. కానీ నటి త్రిషతో కలిసి సినిమా చూసేందుకు ధనుష్ వచ్చాడని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అలాగే వీరిద్దరూ థియేటర్ లోపల ఉన్న ఫోటోలు ఇవే అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

(ఇదీ చదవండి: నయనతారకు అలాంటి అర్హతే లేదు: కస్తూరి)

ఐశ్వర్య రజనీకాంత్‌తో విబేదాల వల్ల ధనుష్‌ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో త్రిషతో ధనుష్‌ ప్రేమాయణం నడుపుతున్నాడంటూ పలు వార్తలు వెంటనే వచ్చేశాయి. దీనిని ధనుష్‌ అభిమానులు ఖండించారు. తలైవా సినిమాకు ధనుష్‌ వెళ్లడం వరకు నిజమేనని, త్రిషతో కలిసి వెళ్లలేదని వారు తెలిపారు. పెట్టా సినిమా రిలీజ్‌ సమయంలో వారిద్దరూ కలిసి వెళ్లి మూవీ చూశారని వారు పేర్కొన్నారు.  అప్పటి ఫోటోలను మళ్లీ నెట్టింట్లో షేర్‌ చేస్తున్నారని ఆయన అభిమానులు వివరణ ఇచ్చారు. పూర్తి విషయాలు తెలుసుకోకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయకండని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement