రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ (2023) సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ కథను రెడీ చేస్తున్నారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఈ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి కావొచ్చాయని కోలీవుడ్ సమాచారం.
అంతేకాదు... ‘జైలర్ 2’ సినిమాను అధికారికంగా ప్రకటించడానికి, రజనీకాంత్ పాల్గొనగా నెల్సన్ అండ్ టీమ్ ఓ వీడియోను రికార్డు చేసిందని, సంక్రాంతికి ‘జైలర్ 2’ అధికారిక ప్రకటన రానుందని టాక్. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల జైపూర్‌లో పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌ను కోయంబత్తూర్‌లో ఆరంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment