నా ప్రాణానికి ముప్పు | Suchitra Karthik leaks private pictures, videos of celebrities on Twitter | Sakshi
Sakshi News home page

నా ప్రాణానికి ముప్పు

Published Mon, Mar 6 2017 2:23 AM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

నా ప్రాణానికి ముప్పు - Sakshi

నా ప్రాణానికి ముప్పు

గాయని సుచిత్ర
పెరంబూర్‌ (చెన్నై): ‘నా ప్రాణానికి ముప్పు ఉంది. ఇంట్లో కూడా రక్షణ లేదు’ అని గాయని, నటి సుచిత్ర పేర్కొన్నారు.  నటుడు ధనుష్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ట్వీటర్‌లో పేర్కొని తొలుత వివాదానికి తెరలేపిన సుచిత్ర.. తరువాత ధనుష్‌–త్రిష, అనిరుధ్‌–ఆండ్రియా, నటి హన్సిక ముగ్గురు యువకులతో రాసలీలల ఫొటోలను పోస్ట్‌ చేసి అలజడి సృష్టించారు. అనంతరం ఆ ఫొటోలను తాను విడుదల చేయలేదని, తన ట్వీటర్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని పేర్కొన్నారు.

సుచిత్ర భర్త, నటుడు కార్తీక్‌కుమార్‌ స్పందిస్తూ తన భార్య మానసికస్థితి సరిగా లేదని వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఇంట్లో కూడా రక్షణ లేదని, ఎవరెవరో వచ్చి బెదిరిస్తున్నారని తెలిపారు. ఒక వ్యక్తి కాలింగ్‌బెల్‌ నొక్కి కాఫీ తీసుకొచ్చానని చెప్పి తలుపు తెరవమని బెదిరించాడని చెప్పారు. ప్రశాంతంగా జీవించాలను కుంటున్న తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. చెన్నై, ఎంఆర్‌సీనగర్‌లో ఒక పబ్‌ ఉందని, అక్కడ కలుసుకునే ఒక ముఠా ఇదంతా చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement