నాడు అజిత్‌ కూతురిగా మెప్పించి.. నేడు ‍గ్లామర్‌ ఫోటోలతో ఛాన్స్‌లు | Anikha Surendran Get Dhanush Movie Chance | Sakshi
Sakshi News home page

నాడు అజిత్‌ కూతురిగా మెప్పించి.. నేడు ‍గ్లామర్‌ ఫోటోలతో ఛాన్స్‌లు

Published Fri, Dec 22 2023 7:02 AM | Last Updated on Fri, Dec 22 2023 8:12 AM

Anikha Surendran Get Dhanush Movie Chance - Sakshi

కోలీవుడ్‌లో నటి అనికా సురేందర్‌ గురించి తెలియని సినీ ప్రియులు ఉండరు. టాలీవుడ్‌లో కూడా ఆమెకు గుర్తింపు ఉంది. ఆమె ఎక్కువ చిత్రాల్లోనూ నటించలేదు. కథానాయకిగా సక్సెస్‌లు అందుకోలేదు. మరి ఈ అమ్మడి పాపులారిటీకి కారణం ఏమిటంటారా? ఓన్లీ గ్లామర్‌. అవును తన గ్లామరస్‌ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ కుర్రకారుకు కిర్రెక్కిస్తుంటారు నటి అనికా సురేందర్‌. బాల నటిగా పరిచయమైన ఈ మలయాళీ కుట్టి కోలీవుడ్‌లో గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన అజిత్‌ సినిమా 'ఎన్నై అరిందాల్‌' తెలుగులో (ఎంత వాడు కానీ) చిత్రంలో త్రిషకు కూతురిగా నటించి గుర్తింపు పొందింది.

ఆ తరువాత విశ్వాసం చిత్రంలో అజిత్‌, నయనతారల కూతురిగా నటించి ఇంకా ప్రాచుర్యం పొందింది. అలా మొదటిసారిగా తెలుగులో బుట్టబొమ్మ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైంది. ఆ చిత్రం నిరాశ పరిచింది. అయినా మాతృభాషలో ఓ మై డార్లింగ్‌ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలై చాలా ఇంట్రెస్టింగ్‌ను క్రియేట్‌ చేసింది. దానికి కారణం గ్లామర్‌నే. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది.

ఇప్పుడు తమిళంలో కథానాయకిగా నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం నటి అనికా సురేందర్‌ తమిళంలో ధనుష్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తన 50వ చిత్రంలో ముఖ్య భూమికను పోషిస్తోంది. ధనుష్‌ మరో చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆయన అక్క కొడుకును కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చితంలో నటి అనికా సురేందర్‌ను హీరోయిన్‌గా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంతోనైనా నటి అనికా సురేందర్‌ సక్సెస్‌ను అందుకుంటుందా అన్న ఆసక్తి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement