వారిద్దరిలా నాకు వయసవ్వలేదు | Hansika commented over Nayantara and Trisha | Sakshi
Sakshi News home page

వారిద్దరిలా నాకు వయసవ్వలేదు

Published Wed, Feb 1 2017 1:03 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

వారిద్దరిలా నాకు వయసవ్వలేదు

వారిద్దరిలా నాకు వయసవ్వలేదు

నయనతార, త్రిషలా నాకు వయసవ్వలేదు అంటోంది నటి హన్సిక. తమిళం, తెలుగు భాషల్లో కథానాయకిగా మంచి గుర్తింపు పొందిన నటి ఈ ఉత్తరాది భామ. అయితే తెలుగు కంటే తమిళంలోనే అధిక చిత్రాల్లో నటించారు. ఇక్కడ విజయ్, సూర్య, ధనుష్, జయంరవి, ఆర్య ఇలా స్టార్‌ హీరోలందరితోనూ నటించారు. అలాంటి హన్సికకు అనూహ్యంగా మార్కెట్‌ డౌన్  అయ్యింది. చేతిలో ఒక్క చిత్రం లేదు. తెలుగులో చాలా గ్యాప్‌ తరువాత నటించిన లక్కున్నోడు చిత్రం ఇటీవలే విడుదలైంది.

ఇక తమిళంలో జయంరవికి జంటగా ముచ్చటగా మూడోసారి నటించిన భోగన్  చిత్రం ఫిబ్రవరి రెండవ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే హన్సికకు కొత్త అవకాశాలేమైనా వస్తాయేమో. కొత్త అవకాశాల కోసం గాలం వేసే పనిలో పడ్డారీ అమ్మడు. అందులో భాగంగా తానెప్పుడూ హీరోలను దృష్టిలో పెట్టుకుని చిత్రాలను ఒప్పుకోలేదని, తన కథాపాత్రలు నచ్చితేనే అంగీకరించి నటించానని చెప్పుకొచ్చారు. కథ నచ్చక ప్రముఖ హీరోల చిత్రాలు కూడా వదిలేశానని అన్నారు. ఇకపోతే నూతన నటుల సరసస నటిస్తారా? అని చాలా మంది అడుగుతున్నారని, అలాంటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు.

అదే విధంగా నయనతార, త్రిషలా హీరోయిన్  ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటిస్తారా? అన్న ప్రశ్నకు నయనతార, త్రిషలా తనకు వయసవ్వలేదని, ఇప్పటికి తన వయసు 25 నని అన్నారు. వారి వయసుకు వచ్చిన తరువాత అలాంటి పాత్రల గురించి ఆలోచిస్తానని చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తన వయసుకు తగ్గట్టు యూత్‌ఫుల్‌ పాత్రల్లోనే నటిస్తానని హన్సిక చెప్పుకొచ్చారు. అయితే అలాంటి అవకాశాలు ప్రస్తుతానికి కనుచూపుమేరలో కనిపించడం లేదన్నది గమనార్హం. ఆఫ్టర్‌ భోగన్  ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూద్దాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement