తమిళ ఫ్యాంటసీ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్‌గా ‘మూకుత్తి అమ్మన్ 2’ సెట్స్‌పైకి వెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘మూకుత్తి అమ్మన్’ చిత్రంలో నయనతార టైటిల్ రోల్ చేయగా, ఆర్‌జే బాలాజీ మరో లీడ్‌లో నటించారు. ఎన్‌జే శరవణన్‌తో కలిసి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది.
వీక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ పనులను మొదలు పెట్టారట ఆర్‌జే బాలాజీ. అయితే సీక్వెల్‌లో నయనతార కాకుండా త్రిష నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈసారి ఆర్‌జే బాలజీయే పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారట. మరి.. సీక్వెల్‌లో త్రిష నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment