Sathuranga Vettai 2: Trisha, Arvind Swamy Movie Release On 7th Oct, 2022 - Sakshi
Sakshi News home page

Trisha-Arvind Swamy: త్రిష ‘చతురంగవేట్టై-2’కి మోక్షం 

Published Mon, Jul 18 2022 9:34 AM | Last Updated on Mon, Jul 18 2022 11:19 AM

Trisha, Arvind Swamy Sathuranga Vettai 2 Movie Release on 7th October 2022 - Sakshi

త్రిషకు కాలం అసలు కలిసిరానట్లు ఉంది. ఈ అమ్మడు నటించిన చిత్రాలు పలు రకాల కారణాలతో విడుదలకు నోచుకోవడం లేదు. ఈమె నటించిన చిత్రాలు తెరపైకి వచ్చి చాలా కాలమైంది. ఆ లోటు తీర్చడానికి మణిరత్నం దర్శకత్వంలో నటించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ సెప్టెంబర్‌ 30వ తేదీ పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. దీంతో పాటు అరవిందస్వామికి జంటగా త్రిష నటించిన చతురంగవేట్టై–2 చిత్రం కూడా తెరపై రావడానికి సిద్ధం అవుతోంది. అక్టోబర్‌ 7వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాలు ఆదివారం అధికారిక పూర్వకంగా ప్రకటించారు.

చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’, కోర్టు నోటీసులు

దర్శకుడు హెచ్‌ వినోద్‌ తెరకెక్కించిన చతురంగవేట్టై చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో దానికి సీక్వెల్‌గా చతురంగవేట్టై –2 చిత్ర నిర్మాణానికి బీజం పడింది. దీనికి హెచ్‌ వినోద్‌ కథ, మాటలు అందించారు. సలీమ్‌ చిత్రం ఫేమ్‌ నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. అరవిందస్వామి, త్రిష జంటగా నటించిన ఇందులో ప్రకాష్‌రాజ్, నాజర్, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషించారు. అశ్విన్‌ గురుమూర్తి సంగీతాన్ని అందించిన ఈ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలమైంది. ఎట్టకేలకు అక్టోబర్‌లో మోక్షం కలుగనుంది. 

చదవండి: ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం: పూజా హెగ్డే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement