నా హీరోయిన్లతో చనువుగా ఉంటా | tamanna, Nayantara is my best friend says Arya | Sakshi
Sakshi News home page

నా హీరోయిన్లతో చనువుగా ఉంటా

Published Mon, Jul 13 2015 8:03 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

నా హీరోయిన్లతో చనువుగా ఉంటా

నా హీరోయిన్లతో చనువుగా ఉంటా

నా కథానాయికలతో సన్నిహితంగా ఉంటానన్నది నిజమేనంటున్నారు నటుడు ఆర్య. ఈ నటుడిపై ప్రచారం జోరుగా సాగుతోంది. హీరోయిన్లను బిరియానీ విందులతో మచ్చిక చేసుకుంటారు, హీరోయిన్లకు హీరో, ప్లేబాయ్ లాంటి వదంతులకు సొంతదారుడు ఆర్య అంటారు. ప్రభుదేవా నయనతార విడిపోయిన తరువాత ఆర్య నయనతారతో కలిసి బిరియానీ పార్టీ చేసుకున్నారనే ప్రచారం అప్పట్లో హోరెత్తింది. అంతేకాదు తన చిత్ర నాయికలతో విందులు, వినోదాలు అంటూ షికార్లు కొడుతుంటారనే ప్రచారం తరచూ మీడియాలో హెడ్ లైన్లలో కనపిస్తుంటుంది.
 
ఆయన ప్రవర్తన చూసిన వాళ్లు ఇవన్ని నిజమేననుకుంటారు. స్నేహితులు కూడా హీరోయిన్లతో కలుపుతూ ఆట పట్టిస్తారు. అన్నింటికీ చిరునవ్వే సమాధానంగా సరదాగా ఉండే ఆర్య అలాంటి వదంతులను ఎంజాయ్ చేస్తుంటారు. ఆర్య ఎక్కడుంటే అక్కడ అల్లరే అంటారు. అలాటి జాలీ టైప్ ఆర్య నటిస్తున్న తాజా చిత్రం వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచ్చవంగ చిత్ర టీజర్ శుక్రవారం యూట్యూబ్‌లో విడుదలై మంచి స్పందనను పొందుతోంది. ఈ సందర్భంగా ఆర్య మనోభావాలను చూద్దాం. నటి పూజ, ఎమిజాక్సన్, నయనతార, త్రిష, అనుష్క, హన్సిక వీళ్లందరూ నాతో కలిసి నటించిన వాళ్లూ. వాళ్లందరితోనూ నేను సన్నిహితంగా ఉంటాను. అందరూ నాకు స్నేహితులే. అందరం వ్యక్తిగత విషయాలను చెప్పుకుంటాం.
 
 ప్లేబాయ్‌ను కాను:
షూటింగ్‌లో అందరితోనూ కలివిడిగా ఉంటూ సందడి వాతావరణాన్ని కలిగిస్తాను. అయితే నేను ప్లేబాయ్‌ని కాను. నేనేమిటో వారికి తెలుసు.
 
 వదంతులను ఎంజయ్ చేస్తా.
నా గురించి వదంతులు ప్రచారం అవుతున్నాయని తెలుసు. నిజం చెప్పాలంటే అలాంటి వాటిని ఎంజాయ్ చేశాను. ఇంకా ఆహ్వానిస్తాను. ఎందుకంటే అలాంటివి లేకపోతే ప్రేక్షకులు మమ్మల్ని మరచిపోతారు. ఇక ప్రస్తుతం నటిస్తున్న వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచ్చవంగా వినోదభరితంగా ఉంటుంది. ఇంతకు ముందు నేను నటించిన బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రం మంచి విజయాన్ని సాధిం చింది. అదే చిత్ర యూని ట్ చేస్తున్న చిత్రం ఇది. త్వరలో తెరపైకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement