ఆర్యతో తమన్న | tamanna with arya | Sakshi
Sakshi News home page

ఆర్యతో తమన్న

Published Fri, Apr 11 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

ఆర్యతో తమన్న

ఆర్యతో తమన్న

ఆర్య, తమన్నల సరికొ త్త కలయికలో నూతన చిత్రం తెరకెక్కనుందనే తాజా సమాచారం. అనుష్క, నయనతార, హన్సిక వంటి ప్రముఖ హీరోయిన్లందరితోనూ రొమాన్స్ చేసిన సంచలన నటుడు ఆర్య, తమన్నతో మాత్రం ఇప్పటి వరకు జత కట్టలేదు.

ఆ లోటు త్వరలో తీరనుంది. ఇంతకుముందు ఆర్య, నయనతార జంటగా బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రం రూపొందింది. ఎం.రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో విడుదలై ఘన విజయం సాధించింది.

ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. అదిప్పుడు నిజం కానుంది. ఎం.రాజేష్‌నే దర్శకత్వం వహించనున్న ఈ కొనసాగింపు చిత్రంలో ఆర్య సరసన మళ్లీ నయనతారనే నటింప చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

అయితే ఆర్యకు జంటగా తమన్నను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక హిందీ చిత్రంతో పాటు తెలుగులో బాహుబలి చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇది కాకుండా మరో తెలుగు చిత్రంలోను నటిస్తున్నారు.
 
తమిళంలో వీరం చిత్రం తరువాత ఈ ముద్దుగుమ్మ నటించనున్న చిత్రం బాస్ ఎన్గిర భాస్కరన్-2నే అవుతుంది. దీని గురించి తమన్న మాట్లాడుతూ తాను హిందీ చిత్రాల్లో నటిస్తున్నా తెలు గు, తమిళ చిత్రాలకు దూరం కానని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement