సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా పోలీసు ఉన్నతాధికారి ఫోన్ హ్యాకింగ్‌కు గురి కావడం కలకలం సృష్టించింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరికొందరు పోలీసుల ఫోన్లను కూడా హ్యాక్ చేసి సమాచారం బయటకు తీస్తామని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎన్నికల సమయం కావడంతో పోలీసు యంత్రాంగం నిత్యం తనిఖీలు, బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉంది. ఇలాంటి తరుణంలో సైబరాబాద్ పరిధిలోని ఒక డీసీపీ ఫోన్ హ్యాక్ అయ్యింది. శనివారం ఉదయం నుంచి విధి నిర్వహణలో నిమగ్నమైన ఆ డీసీపీ ఫోన్ మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా హ్యాకింగ్‌కు గురైనట్టు గుర్తించారు. దాదాపు 2 గంటల సమయం ఫోన్ పూర్తిగా అవతలి వారి చేతిలోకి చేరినట్టు నిర్ధారించారు.
అతికష్టమ్మీద సైబర్ నిపుణులు డీసీపీ ఫోన్‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇది హ్యాకర్ల పనేనా?.. లేక ఎవరైనా గిట్టని వారు చేశారా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి అధికారి ఫోన్ హ్యాక్ చేయటం.. పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే, నగరంలో ఒక ఐటీ ఉద్యోగిపై సదరు డీసీపీ చేయిచేసుకోవటం వల్లనే ఐటీ నిపుణులు ఫోన్ హ్యాక్ చేసి సమాచారం. ఫోన్‌లోని వ్యక్తిగత వీడియోలు బయటపెట్టినట్టు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రాబోయే రోజుల్లో మరికొందరి పోలీసుల సమాచారం కూడా ఇదే విధంగా వెలికితీస్తామంటూ తమ పోస్టు ద్వారా హెచ్చరించటం గమనార్హం. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. సదరు హ్యాకర్ కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రియుడు మోసం చేశాడనే ప్రవల్లిక ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment