ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఈ-మెయిల్ ఐడీ, ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్, సోషల్ మెసేజింగ్ యాప్స్ వంటి వాటికి పాస్‌వర్డ్ పెట్టుకోవడం తప్పనిసరి. అయితే, ఇలాంటి కీలకమైన విషయాలలో ప్రజలు చాలా వరకు అజాగ్రత్తగా ఉంటారు. అందుకే, దేశంలో రోజు రోజుకి సైబర్ నేరాల సంఖ్య పెరిగి పోతుంది. చాలా మంది తమ ఖాతాలను సులభంగా గుర్తు పెట్టుకోవడం కోసం సులువైన పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటారు. ఈ అజాగ్రత్తే వారిని సైబర్ మోసాల బారిన పడేలా చేస్తోంది. అయితే, ఇలాంటి సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు కొన్ని సూచనలు ఇచ్చింది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. (చదవండి: టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులకు తీపికబురు)
ఎస్‌బీఐ ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్
- ఎస్‌బీఐ ఖాతాదారులు అప్పర్ కేస్, లోయర్ కేస్ లెటర్లు కలిసి ఉండే విధంగా పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. ఉదా: aBjsE7uG
- ఖాతాదారులు నెంబర్లు, సింబల్స్ రెండింటినీ ఉపయోగించి పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు. ఉదా: AbjsE7uG61!@
- ఫుల్ సెక్యూరిటీ కోసం కనీసం 8 క్యారెక్టర్లు గల పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. ఉదా: aBjsE7uG
- సాధారణంగా డిక్షనరీలో ఉండే పదాలు, సులువుగా ఉండే పదాలను పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. ఉదా: itislocked, thisismypassword
- ఎస్‌బీఐ కస్టమర్లు "qwearty" లేదా "asdfg" వంటి కీబోర్డులో వరుసగా ఉండే పదాలను వాడరాదు. దానికి బదులుగా ":)", ":/" వంటి వాటిని వాడవచ్చు.
- 12345678 లేదా abcdefg వంటి పాస్‌వర్డ్ లను అసలు పెట్టుకోరాదు.
- ఖాతాదారులు సులభంగా/ తేలికగా ఊహించగల పదాలను పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు.
- ఖాతాదారులు మీ పేరు, పుట్టినతేదీ, లేదా మీ కుటుంబసభ్యుల పేర్లు, పుట్టిన తేదీని అసలు పెట్టుకోకూడదు. ఉదా : Ramesh@1967.
"మీ పాస్‌వర్డ్ అనేది ప్రత్యేకంగా ఉండటంతో పాటు బలంగా(Storng) ఉండే విధంగా" పెట్టుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది.
A strong password ensures higher levels of security. Here are 8 ways in which you can create an unbreakable password and protect yourself from cybercrime. Stay alert & #SafeWithSBI! #CyberSafety #StrongPassword #OnlineSafety #CyberCrime #StaySafe pic.twitter.com/ScSI8H5ApF
— State Bank of India (@TheOfficialSBI) August 18, 2021
Comments
Please login to add a commentAdd a comment