సైబర్ నేరం కింద నైజీరియా దేశస్తుడి అరెస్ట్
తిరుచానూరు: సైబర్ నేరానికి పాల్పడ్డ నైజీరియా దేశస్తుడిపై తిరుచానూరు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అలాగే అతడిని నిర్బంధించిన 16 మందిని సైతం అరెస్టు చేశారు. తిరుచానూరు సీఐ రామకృష్ణాచారి కథనం మేరకు...
నైజీరియాకు చెందిన ఇమ్మాన్యుయేల్(39) సంపాదన కోసం ఢిల్లీ వచ్చాడు. అక్కడ మ్యాక్స్‌వెల్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి డబ్బు సంపాదనకు సైబర్ మోసాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన వెంకటరమణ నాయుడుకు లారాజమ అనే మహిళ పేరుతో వీరు ఈ మెయిల్ పంపిం చారు. ‘జింబాబ్వేదేశం శెనగల్ పట్టణంలోని రెస్క్యూ హోమ్‌లో ఉంటున్నాను. అంతర్యుద్ధంలో మా తండ్రి మరణించాడు.
ఆయనకు సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తి నా పేరుమీద ఉంది.. రెస్క్యూ హోమ్ నుంచి నేను బయటపడేందుకు డబ్బు అవసరం. ఆ మొత్తాన్ని పంపిస్తే నేను బయటకొచ్చి నాకు సాయం చేసినందుకు అధిక మొత్తంలో నగదు పంపిస్తా’ అని మెయిల్‌లో తెలిపారు. నగదును ఓ బ్యాంకు అకౌంట్లో వేయాలని తెలిపారు. దీంతో వెంకటరమణ నాయుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా సంబంధిత బ్యాంక్ అకౌంట్‌కు రూ.3.61లక్షలు చె ల్లించాడు.
కొద్దిరోజుల తరువాత వెంకటరమణ నా యుడికి వారు ఒక పెట్టెను పంపించారు. అందులో అమెరికన్ డాలర్లు ఉన్నాయని, దాంతో పాటు ఒక రసాయనాన్ని పంపించామని, ఆ రసాయనంతో నో ట్లపై రుద్దితే డాలర్లుగా మారుతాయని సూచించారు. ఆ ప్రకారం వెంకటరమణనాయుడు రసాయనాన్ని రుద్దగా నల్లకాగితాలు బయటపడ్డాయి. బాధితుడు మెయిల్ ద్వారా ఈ విషయాన్ని వారికి వివరించాడు. వారు మరో రసాయనాన్ని వాడాల్సి ఉందని, దీని కోసం ఇంకా డబ్బు పంపించాలని తెలిపారు.
దీంతో మోసపోయానని భావించిన వెంకటరమణనాయు డు ఎలాగైనా పోయిన డబ్బును రాబట్టుకునేందుకు పథకం పన్నాడు. ఇక్కడికి వస్తే డబ్బు ఇస్తానంటూ వారికి మెయిల్ చేశాడు. మంగళవారం సాయంత్రం ఇమ్మాన్యుయేల్ విమానం ద్వారా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాడు. వెంకటరమణనాయుడు తో పాటు మరో 15మంది కుర్రాళ్లు అతడిని మంచి మాటలు చెప్పి తనపల్లి సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించారు.
డబ్బు చెల్లించాలంటూ డిమాం డ్ చేశారు. తాను నిర్భంధానికి గురైనట్లు తెలుసుకు న్న ఇమ్మాన్యుయేల్ వెంటనే మ్యాక్స్‌వెల్‌కు జరిగిన సంగతి వివరించాడు. అతను పోలీసులకు సమాచా రం ఇచ్చాడు. దీంతో తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఈస్టు డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, తిరుచానూరు సీఐ రామకృష్ణాచారి, ఎస్‌ఐ సూర్యనారాయణ సిబ్బంది తో కలిసి మంగళవారం అర్ధ రాత్రి ఆ ఇంటిపై దాడిచేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో తెలిసిన వివరాల మేరకు ఇమ్మాన్యుయేల్‌పై బుధవారం సైబర్ నేరం కింద కేసు నమోదు చేశారు. అలాగే ఇమ్మాన్యుయేల్‌ను అక్రమంగా నిర్బంధించినందుకు వెంకటరమణ నాయుడుతో పాటు మరో 15మంది యువకులపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.