Immanuel
-
‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ
టైటిల్: గం..గం..గణేశా నటీనటులు : ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.నిర్మాణ సంస్థ:హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్నిర్మాతలు:కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచిరచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి సంగీతం: చేతన్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడిఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్విడుదల తేది: మే 31, 2024‘బేబీ’లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ మూవీపై హైప్‌ని క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘గం..గం..గణేశా’పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాలతో నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ కామెడీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్‌కు గణేష్(ఆనంద్ దేవరకొండ) ఓ అనాథ. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయేల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటాడు. అదే ఏరియాలో ఓ షాపులో పని చేసే శృతి(నయన్ సారిక)తో పీకల్లోతూ ప్రేమలో ఉంటాడు. అయితే శ్రుతి మాత్రం డబ్బుకు ఆశపడి ఆ షాపు ఓనర్ కొడుకుతో పెళ్లికి రెడీ అయిపోతుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో హర్ట్ అయిన గణేష్..ఎలాగైన భారీగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో స్నేహితుడు శంకర్‌తో కలిసి రూ. 7 కోట్లు విలువ చేసే డైమండ్‌ను దొంగిలిస్తాడు. ఆ డైమండ్ కోసం అరుణ్ (ప్రిన్స్ యావర్) గ్యాంగ్ గణేష్ వెంటపడుతుంది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ డైమంగ్ ఓ గణేశ్ విగ్రహంలోకి చేరుతుంది. ఆ విగ్రహం కర్నూలు జిల్లాకు చెందిన రాజావారు(సత్యం రాజేశ్)కొనుగోలు చేసి తన గ్రామానికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వినాయకుడి విగ్రహంలో పడిపోయిన డైమండ్ కోసం గణేష్ ఏం చేశాడు? ఆ విగ్రహాన్ని దొంగిలించేందుకు రుద్రా(కృష్ణ చైతన్య) గ్యాంగ్ ఎందుకు ప్రయత్నించింది? ముంబైలో చాలా విగ్రహాలు ఉన్నప్పటికీ.. రాజావారు ప్రత్యేకంగా ఆ విగ్రహాన్నే ఎందుకు కొనుగోలు చేశాడు? ఈ విగ్రహానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకుంటున్న కిషోర్ రెడ్డి(రాజ్ అర్జున్)కి ఉన్న సంబంధం ఏంటి? ఆర్గాన్ డేవిడ్(వెన్నెల కిశోర్) కారణంగా రుద్రా గ్యాంగ్‌తో పాటు గణేష్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆ విగ్రహం ఎవరికి దక్కింది? అందులో పడిపోయిన డైమాండ్ చివరకు ఎవరికి దక్కింది? గణేష్ లైఫ్‌లోకి కృష్ణవేణి(ప్రగతి శ్రీవాస్తవ)ఎలా వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే మూడు లక్షణాలు ఉంటాయి. ఇవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ‘గం..గం..గణేశా’ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇలాంటి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. కానీ డిఫరెంట్ కామెడీతో పాటు క్రిస్పీ ఎడిటింగ్‌తో హిలేరిస్‌గా కథనాన్ని సాగించాడు. కథ మొత్తం వినాయకుడి విగ్రహం చుట్టే తిరుగుతుంది. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ సింపుల్‌గానే ఉన్నా ఎంటర్టైన్ చేస్తాయి.హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా కథ ఆ తర్వాత కర్నూల్ కు షిప్ట్ అవుతుంది. సినిమా ప్రారంభంలో వచ్చే హీరో లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. డైమాండ్ దొంగిలించాలని హీరో ఫిక్సయ్యాక..కథలో వేగం పుంజుకుంటుంది. ఒకవైపు కిశోర్ రెడ్డి ట్రాక్.. మరోవైపు గణేష్ ట్రాక్ రెండింటిని సమాంతరంగా నడిపిస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని సాగించాడు. డైమండ్ వినాయకుడి విగ్రహంలోకి చేరడం..దాన్ని కిశోర్ రాజకీయ ప్రత్యర్థి గ్రామమైన రాజావారి పల్లెకు తీసుకెళ్లడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథంతా విగ్రహం చుట్టే తిరగడంతో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే విగ్రహం కొట్టేసేందుకు రుద్రా గ్యాంగ్, డైమండ్‌ను తీసుకెళ్లడం కోసం హీరో చేసే ప్రయత్నాలు అంతగా ఎంటర్టైన్ చేయవు. మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డైమండ్గా వెన్నెల కిశోర్ పండించే కామెడీ మాత్రం సినిమాకు ప్లస్ అయింది. అతను తెరపై కనిపించిన ప్రతి సారి థియేటర్లలో నవ్వులు పూశాయి. అదేసమయంలో అరుణ్ గ్యాంగ్‌కు సంబంధించిన సన్నివేశాలు.. నీలవేణితో గణేష్ నడిపే లవ్‌ట్రాక్ కథకు అనవసరంగా జోడించినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో స్వామిజీ(రంజగన్)ఇచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. సినిమా ముగింపు మాత్రం దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులను నెగెటివ్ క్లైమాక్స్‌ని ఒప్పుకోరని అలా ముగించాడేమో. చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే.. ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేని ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ దేవరకొండ ఇప్పటిదాకా బాయ్ నెక్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. ఈ చిత్రంలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. గ్రే షేడ్స్ ఉన్న గణేష్ పాత్రలో ఆనంద్ ఒదిగిపోయాడు. డ్యాన్స్‌తో పాటు కామెడీ కూడా బాగా పండించాడు. తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఇక జబర్థస్త్ ఫేం ఇమ్మాన్యుయేల్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. హీరో స్నేహితుడు శంకర్‌గా ఆయన చక్కగా నటించాడు. తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్లుగా నటించిన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక ఇద్దరు తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా..ఉన్నంతలో చక్కగా నటించారు. మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డేవిడ్‌గా వెన్నెల కిశోర్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. ఆ పాత్రకు మరిన్ని సన్నివేశాలు ఉంటే బాగుండేది. కిశోర్ రెడ్డిగా రాజ్ అర్జున్, రుద్రాగా కృష్ణ చైతన్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. సన్నివేశాలను చాలా క్రిస్పిగా కట్ చేశాడు. స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
బర్త్‌డే సర్ప్రైజ్.. వర్షకు కాస్ట్లీ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్!
బుల్లితెర ఆన్‌స్క్రీన్ జోడి వర్ష, ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ గురించి తెలిసిందే. కామెడీ షో జబర్థస్త్ స్టేజ్‌పై జోడి కట్టి ఎంతో పాపులారిటి సంపాదించుకున్నారు. స్క్రీన్‌పై రియల్ కపుల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రష్మీ-సుధీర్ జోడి తర్వాత వీరిద్దరితో జోడి అంతగా గుర్తింపు పొందింది. ఏ షోలో అయినా వీరిద్దరు జతకట్టి ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తున్నారు. ఆ మధ్య మనస్పర్థల కారణంగా దూరంగా ఉన్న ఈ ఆన్‌స్క్రీన్ జోడి ఇటీవల ఓ షోలో కలిసిపోయారు. చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ ఈ నేపథ్యంలో వర్ష బర్త్‌డేకు ఇమ్మాన్యుయేల్ ఆమెకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. వచ్చే నెల ఆమె బర్త్‌డే సందర్భంగా కాస్ట్లీ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చాడు. ఈ సందర్భంగా స్వయంగా వర్షని హైదరాబాద్‌లోని ప్రముఖ జ్యువెల్లరి షాప్‌కు తీసుకెళ్లి ఆమెతో షాపింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని వ్లాగ్ చేసి తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే నిజానికి నెక్లెస్ బహుమతిగా ఇవ్వలేదని, తమ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది. -
గ్రామ కార్యదర్శిని చంపి, కాల్చేశారు..!
ఓర్వకల్లు : కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చుంచు ఎర్రగుడి గ్రామ కార్యదర్శిగా పని చేసిన ఇమ్మానుయేలు దారుణ హత్యకు గురయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇమ్మానుయేలు ఇటీవల సస్పెండ్ అయ్యారు. కాగా, ఆయన సోమవారం నుంచి కనిపించడం లేదు. బుధవారం ఆయన మృతదేహాన్ని ఓర్వకల్లు మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో పడి ఉండగా గమనించారు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేసిన ఆనవాళ్లను స్థానికులు కనుగొన్నారు. సగం కాలిన మృతదేహానికి కొద్దిదూరంలో ఆయన సెల్‌ఫోన్ పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ నాగరాజు యాదవ్, ఎస్సై చంద్రబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ బోల్తా.. దంపతులకు తీవ్ర గాయాలు
ఎడ్లపాడు: గుంటూరు జిల్లాఎడ్లపాడు మండలం ఎన్ఎస్ టెక్స్టైల్ వద్ద బైక్ బోల్తా పడిన ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఇమాన్యుయేల్.. ఆయన భార్య బైక్‌పై గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతుండగా.. బుధవారం రాత్రి టవల్.. బండి చక్రంలో పడడంతో బైకు బోల్తా పడింది. ఈఘటనలో తీవ్రగాయాలైన వారిని హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ తిమింగలం
-
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ తిమింగలం
హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్ ఇమ్మానియేల్ నివాసంపై ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గతంలో ఇమ్మానియేల్ మీద ఆరోపణలు రావటంతో ఈ సోదాలు చేపట్టారు. దాదాపు అయిదు కోట్ల వరకూ అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌తోని రెండు ప్రాంతాలతో పాటు వరంగల్లోనూ ఏకకాలంలో దాడులు చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సైబర్ నేరం కింద నైజీరియా దేశస్తుడి అరెస్ట్
తిరుచానూరు: సైబర్ నేరానికి పాల్పడ్డ నైజీరియా దేశస్తుడిపై తిరుచానూరు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అలాగే అతడిని నిర్బంధించిన 16 మందిని సైతం అరెస్టు చేశారు. తిరుచానూరు సీఐ రామకృష్ణాచారి కథనం మేరకు... నైజీరియాకు చెందిన ఇమ్మాన్యుయేల్(39) సంపాదన కోసం ఢిల్లీ వచ్చాడు. అక్కడ మ్యాక్స్‌వెల్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి డబ్బు సంపాదనకు సైబర్ మోసాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన వెంకటరమణ నాయుడుకు లారాజమ అనే మహిళ పేరుతో వీరు ఈ మెయిల్ పంపిం చారు. ‘జింబాబ్వేదేశం శెనగల్ పట్టణంలోని రెస్క్యూ హోమ్‌లో ఉంటున్నాను. అంతర్యుద్ధంలో మా తండ్రి మరణించాడు. ఆయనకు సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తి నా పేరుమీద ఉంది.. రెస్క్యూ హోమ్ నుంచి నేను బయటపడేందుకు డబ్బు అవసరం. ఆ మొత్తాన్ని పంపిస్తే నేను బయటకొచ్చి నాకు సాయం చేసినందుకు అధిక మొత్తంలో నగదు పంపిస్తా’ అని మెయిల్లో తెలిపారు. నగదును ఓ బ్యాంకు అకౌంట్లో వేయాలని తెలిపారు. దీంతో వెంకటరమణ నాయుడు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా సంబంధిత బ్యాంక్ అకౌంట్‌కు రూ.3.61లక్షలు చె ల్లించాడు. కొద్దిరోజుల తరువాత వెంకటరమణ నా యుడికి వారు ఒక పెట్టెను పంపించారు. అందులో అమెరికన్ డాలర్లు ఉన్నాయని, దాంతో పాటు ఒక రసాయనాన్ని పంపించామని, ఆ రసాయనంతో నో ట్లపై రుద్దితే డాలర్లుగా మారుతాయని సూచించారు. ఆ ప్రకారం వెంకటరమణనాయుడు రసాయనాన్ని రుద్దగా నల్లకాగితాలు బయటపడ్డాయి. బాధితుడు మెయిల్ ద్వారా ఈ విషయాన్ని వారికి వివరించాడు. వారు మరో రసాయనాన్ని వాడాల్సి ఉందని, దీని కోసం ఇంకా డబ్బు పంపించాలని తెలిపారు. దీంతో మోసపోయానని భావించిన వెంకటరమణనాయు డు ఎలాగైనా పోయిన డబ్బును రాబట్టుకునేందుకు పథకం పన్నాడు. ఇక్కడికి వస్తే డబ్బు ఇస్తానంటూ వారికి మెయిల్ చేశాడు. మంగళవారం సాయంత్రం ఇమ్మాన్యుయేల్ విమానం ద్వారా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాడు. వెంకటరమణనాయుడు తో పాటు మరో 15మంది కుర్రాళ్లు అతడిని మంచి మాటలు చెప్పి తనపల్లి సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించారు. డబ్బు చెల్లించాలంటూ డిమాం డ్ చేశారు. తాను నిర్భంధానికి గురైనట్లు తెలుసుకు న్న ఇమ్మాన్యుయేల్ వెంటనే మ్యాక్స్‌వెల్‌కు జరిగిన సంగతి వివరించాడు. అతను పోలీసులకు సమాచా రం ఇచ్చాడు. దీంతో తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఈస్టు డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, తిరుచానూరు సీఐ రామకృష్ణాచారి, ఎస్ఐ సూర్యనారాయణ సిబ్బంది తో కలిసి మంగళవారం అర్ధ రాత్రి ఆ ఇంటిపై దాడిచేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తెలిసిన వివరాల మేరకు ఇమ్మాన్యుయేల్‌పై బుధవారం సైబర్ నేరం కింద కేసు నమోదు చేశారు. అలాగే ఇమ్మాన్యుయేల్‌ను అక్రమంగా నిర్బంధించినందుకు వెంకటరమణ నాయుడుతో పాటు మరో 15మంది యువకులపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.