బుల్లితెర ఆన్‌స్క్రీన్ జోడి వర్ష, ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ గురించి తెలిసిందే. కామెడీ షో జబర్థస్త్ స్టేజ్‌పై జోడి కట్టి ఎంతో పాపులారిటి సంపాదించుకున్నారు. స్క్రీన్‌పై రియల్ కపుల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రష్మీ-సుధీర్ జోడి తర్వాత వీరిద్దరితో జోడి అంతగా గుర్తింపు పొందింది. ఏ షోలో అయినా వీరిద్దరు జతకట్టి ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తున్నారు. ఆ మధ్య మనస్పర్థల కారణంగా దూరంగా ఉన్న ఈ ఆన్‌స్క్రీన్ జోడి ఇటీవల ఓ షోలో కలిసిపోయారు.
చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్
ఈ నేపథ్యంలో వర్ష బర్త్‌డేకు ఇమ్మాన్యుయేల్ ఆమెకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. వచ్చే నెల ఆమె బర్త్‌డే సందర్భంగా కాస్ట్లీ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చాడు. ఈ సందర్భంగా స్వయంగా వర్షని హైదరాబాద్‌లోని ప్రముఖ జ్యువెల్లరి షాప్‌కు తీసుకెళ్లి ఆమెతో షాపింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని వ్లాగ్ చేసి తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే నిజానికి నెక్లెస్ బహుమతిగా ఇవ్వలేదని, తమ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment