Jwellery shop
-
జ్యువెల్లరీ సంస్థకు అంబాసిడర్‌గా శోభిత ధూళిపాళ
హైదరాబాద్: జ్యువెలరీ సంస్థ భీమా జ్యువెల్స్ ప్రముఖ నటి శోభిత ధూళిపాళను తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ సందర్భంగా ఆమె నటించిన ‘మేడ్ టు సెలబ్రేట్ యు’ టీవీ వాణిజ్య ప్రకటన విడుదల చేశారు. ‘‘మా బ్రాండ్ ప్రచారానికి శోభితను ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది. భీమా బ్రాండ్‌కు ఆమె మరింత గుర్తింపు తీసుకొస్తుంది’’ అని సంస్థ ఎండీ అభిõÙక్ బిందుమాధవ్ అన్నారు. అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటైన భీమా జ్యువెల్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించడం సంతోషం కలిగిస్తుందని శోభిత అన్నారు. -
Goldsmiths: మసకబారుతున్న ‘స్వర్ణ’కారుల బతుకులు
(డెస్క్–రాజమహేంద్రవరం): ఆధునిక పరిస్థితుల ప్రభావితంతో కుల వృత్తులు కూలిపోతున్నాయి. రోజురోజుకూ ఉనికి కోల్పోతున్నాయి. మనుగడ కష్టమని భావించిన కొందరు బతుకుదారి మార్చుకుంటున్నారు. మరికొందరు ఇప్పటికీ తాతల కాలం నుంచి వారసత్వంగా అబ్బిన వృత్తినే నమ్ముకుంటూ యాతనలు పడుతున్నారు. ఒకప్పుడు ‘బంగారు’బాబుల్లా బతికిన స్వర్ణకారుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. చాలామంది పల్లెటూళ్ల నుంచి పట్టణాల బాట పడుతున్నారు. బతుకు బండి పయనానికి ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. ఉనికిపాట్లు కార్పొరేట్ సంస్థల సవాళ్ల నేపథ్యంలో కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వర్ణకారులు ఇప్పటికీ ఉనికి చాటుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని నల్లమందుసందు, సీతమ్మసందు, చందాసత్రం, గుండువారి వీధి ప్రాంతాల్లో కొందరు స్వర్ణకారులు కొద్దోగొప్పో ఆభరణాల తయారీ పనులు చేసుకుంటూ వృత్తికి ఊపిరిలూదుతున్నారు. దీర్ఘకాలంగా ఉన్న పరిచయాలతో కొందరు ఇక్కడకు వచ్చి బంగారమిచ్చి వారితో ఆభరణాలు తయారు చేయించుకుంటున్నారు. ఒక్క రాజమహేంద్రవరం నగరంలోనే 2008 నాటికి వెయ్యి మందికి పైగా స్వర్ణకారులు ఉండేవారు. ఇప్పుడు వీరి సంఖ్య బాగా తగ్గిపోయింది. తమ సంఘంలో 600 మంది సభ్యులుగా కొనసాగుతున్నారని రాజమహేంద్రవరం స్వర్ణకారుల సంఘం గండేబత్తుల శ్యామ్ చెప్పారు. కార్పొరేట్ సెగ ఆభరణాల రంగంలో కార్పొరేట్లు అడుగు పెట్టడంతో స్వర్ణకారుల బతుకులు రంగు మారిపోయాయి. అప్పటి వరకూ ఉన్న ఉపాధి కాస్తా దూరం కావడం ప్రారంభమైంది. తొలినాళ్లలో జ్యూయలరీ షాపులొచ్చి వీరి మనుగడను కొంత దెబ్బ తీశాయి. పాతిక సంవత్సరాలుగా నగరాల్లో కార్పొరేట్ షాపులు పెరిగిపోయాయి. ఈ పదేళ్లలో ఓ మాదిరి పట్టణాలకూ ఈ షాపులు విస్తరించాయి. పగలూ రాత్రీ విద్యుద్దీపాల కాంతులతో వెలిగిపోయే అందాల షాపుల భవంతుల వైపే జనమూ అడుగులు వేస్తున్నారు. ఫలితంగా వృత్తి నైపుణ్యమున్న స్వర్ణకారులకు ఆదరణ తగ్గింది. కార్పొరేట్ తాకిడికి తలవంచిన కొందరు బ్యాంకులు లేదా బంగారంపై వడ్డీ ఇచ్చే వ్యక్తుల వద్ద అప్రైజర్లుగా చేరిపోయారు. వయసు 50లు దాటిన మరికొందరు మరో పని నేర్చుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో పాత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం స్వర్ణకారులుగా పని చేస్తున్నవారెవరూ తమ పిల్లలను ఈ రంగం వైపు నడిపించడంలేదు. తన ఇద్దరు పిల్లలూ బాగా చదువుకున్నారని.. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని నల్లమందు సందులో పని చేస్తున్న స్వర్ణకార సంఘం సభ్యుడు పేరూరి సూర్యప్రకాష్ చెప్పారు. తమ తరం తర్వాత స్వర్ణకారులు కనిపించరని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పడదామన్నా పెట్టుబడి ఏదీ.. అన్ని వృత్తుల మాదిరిగానే ఆభరణాల తయారీలో కూడా ఆధునికత అడుగు పెట్టింది. ప్రతి చిన్న పనీ యంత్రాల సాయంతోనే చేయాల్సి వస్తోంది. కానీ వాటిని సమకూర్చోలేక స్థాయికి తగ్గట్టుగా చిన్నపాటి పరికరాలతో స్వర్ణకారులు నెట్టుకొస్తున్నారు. గతంలో ఎక్కువగా కుంపటి ఉపయోగించేవారు. నాటి స్వర్ణకారులెందరినో శ్వాసకోశ వ్యాధులు ఇప్పటికీ వెంటాడుతున్నాయని స్వర్ణకారుడు ఈదరాడ శ్రీనివాస్ చెప్పారు. ఉదయం నుంచి చీకటి పడే వరకూ కూర్చుని పని చేయడం వల్ల శారీరక వ్యాయామం లేక అనారోగ్యం బారిన పడుతున్నామని మరో స్వర్ణకారుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దోగొప్పో డబ్బులు వెచ్చించి, చిన్నపాటి యంత్రాలు కొందామన్నా ఎక్కువ మందికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదు. ఒక్కో యంత్రానికి కనీసం రూ.50 వేల పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. వ్యక్తిగత రుణాలకు బ్యాంకులు సహకరించడ లేదని స్వర్ణకారుడు వరప్రసాద్ చెప్పారు. దొంగ బంగారం కొన్నారంటూ గతంలో పోలీసుల నుంచి తమకు తరచూ వేధింపులు ఎదురయ్యేవని కొందరు స్వర్ణకారులు చెప్పారు. ఐదేళ్లుగా ఈ వేధింపులు తగ్గాయన్నారు. ఏమైనప్పటికీ కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకోలేక స్వర్ణకారుల బతుకులు కాంతిహీనమవుతున్నాయి. సామాజిక భవనమూ లేదు ఈ మధ్యనే రాజమహేంద్రవరం స్వర్ణ కారుల సంఘానికి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. స్వర్ణకారుల బతుకులు దయనీయంగా ఉన్నాయి. ఈ నగరంలో మాకు ఒక సామాజిక భవనం కూడా లేదు. స్థలమివ్వగలిగితే భవనం ఇస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేసి సమకూర్చగలిగే ఆర్థిక స్తోమత మాలో ఎవ్వరికీ లేదు. ప్రజాప్రతినిధులు మా కష్టాలను గమనించి సామాజిక భవనం నిర్మించాలని కోరుతున్నాను. – గండేబత్తుల శ్యామ్, అధ్యక్షుడు, రాజమహేంద్రవరం స్వర్ణకారుల సంఘం రుణం అందించాలి స్వర్ణాభరణాల తయారీ యంత్రాలు చాలా ఖరీదైనవి. కొనుక్కుని బతుకుదామంటే ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. ముద్రా రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నా బ్యాంకులు స్పందించడం లేదు. పూచీకత్తు లేనిదే ఇవ్వబోమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తిలో ఎలా పోటీ పడగలం? ఎలా ముందుకు వెళ్లగలం? రుణ సదుపాయం కల్పిస్తే కొద్దోగొప్పో ఈ వృత్తి బతకడానికి అవకాశముంటుంది. – ఈదర వరప్రసాద్, నల్లమందు సందు, రాజమహేంద్రవరం ఈ స్పీడులో మాలాంటి వాళ్లకు కష్టమే.. ఎక్కడ పడితే అక్కడ జ్యూయలరీ షాపులు వచ్చేశాయి. పెద్ద పట్టణాల్లో కార్పొరేట్ సంస్థల షోరూములు వచ్చేశాయి. అక్కడ అడిగిన వెంటనే కావాల్సిన నగ దొరుకుతోంది. ప్రస్తుతం ప్రజలకు అడిగిన వెంటనే సరకు ఇవ్వాలి. ఒక్క క్షణం కూడా ఓపిక పట్టే తత్వం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎంత బాగా చేసినా ఫలితం ఏముంది? కొద్ది మంది మాత్రం చిన్నచిన్న నగలు చేయించుకోవడానికి నమ్మ కంతో వస్తున్నారు. జగన్ ప్రభుత్వం పుణ్యమాని పెన్షన్ వస్తోంది. – నామగిరి బ్రహ్మానందం, ప్రత్తిపాడు -
బర్త్‌డే సర్ప్రైజ్.. వర్షకు కాస్ట్లీ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్!
బుల్లితెర ఆన్‌స్క్రీన్ జోడి వర్ష, ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ గురించి తెలిసిందే. కామెడీ షో జబర్థస్త్ స్టేజ్‌పై జోడి కట్టి ఎంతో పాపులారిటి సంపాదించుకున్నారు. స్క్రీన్‌పై రియల్ కపుల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రష్మీ-సుధీర్ జోడి తర్వాత వీరిద్దరితో జోడి అంతగా గుర్తింపు పొందింది. ఏ షోలో అయినా వీరిద్దరు జతకట్టి ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తున్నారు. ఆ మధ్య మనస్పర్థల కారణంగా దూరంగా ఉన్న ఈ ఆన్‌స్క్రీన్ జోడి ఇటీవల ఓ షోలో కలిసిపోయారు. చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ ఈ నేపథ్యంలో వర్ష బర్త్‌డేకు ఇమ్మాన్యుయేల్ ఆమెకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. వచ్చే నెల ఆమె బర్త్‌డే సందర్భంగా కాస్ట్లీ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చాడు. ఈ సందర్భంగా స్వయంగా వర్షని హైదరాబాద్‌లోని ప్రముఖ జ్యువెల్లరి షాప్‌కు తీసుకెళ్లి ఆమెతో షాపింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని వ్లాగ్ చేసి తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే నిజానికి నెక్లెస్ బహుమతిగా ఇవ్వలేదని, తమ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది. -
సిబ్బందికి కార్లు, బైకులు కానుకగా పంచిన ఓనర్
వైరల్/చెన్నై: బాస్‌లలో.. మంచి బాసులు చాలా అరుదు. కేవలం టాస్క్‌లు, టార్గెట్లతో ఇబ్బందులు పెట్టేవాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే.. ఇక్కడో యజమాని.. తన దగ్గర పని చేసే ఉద్యోగులకు కార్లు, బైకులు కానుకలుగా ఇచ్చాడు. ఇది ఎక్కడో జరగలేదు.. మన పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలోనే జరిగింది. దీపావళికి స్వీట్లు, కొత్త బట్టలు పంచే యజమానులనే ఇప్పటిదాకా చూసి ఉంటారు. కానీ, చెన్నైకి చెందిన నగల షాపు ఓనర్ జయంతి లాల్ చాయంతి మాత్రం.. సిబ్బందికి కార్లు, బైకులు ఇచ్చి పెద్ద సర్ప్రైజే ఇచ్చారు. ఈ కానుకలకుగానూ ఆయనకు అక్షరాల కోటి ఇరవై లక్షల ఖర్చు అయ్యింది. ఈ విషయం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. చల్లానీ జ్యువెల్లరీలో పని చేసే ఉద్యోగులకు ఈ దీపావళికి మామూలు కానుకలు దక్కలేదు. వాళ్ల వాళ్ల పర్ఫార్మెన్స్, హోదాలను బట్టి కొంత మందికి బైకులు, మరికొందరికి కార్లను కానుకగా పంచారు జ్యువెలరీ అధినేత జయంతి లాల్ ఛాయంతి. మొత్తం సిబ్బంది కోసం పది కార్లు.. ఇరవై బైకులను పంచారాయన. కుటుంబాలతో సహా భోజనాలకు ఆహ్వానించడంతో.. ప్రతీ ఏడాది షరా మామూలుగా నిర్వహించే కార్యక్రమమే అనుకున్నారంతా. అయితే ఊహించని ఈ సర్ప్రైజ్లు అందుకుంటూ ఉద్యోగుల్లో కొందరు భావోద్వేగానికి లోనై కంట తడి పెట్టుకున్నారు. వీళ్లు ఉద్యోగులు కారు.. నా కుటుంబ సభ్యులు. అందుకే వీళ్లకు ఈ నా విజయంలో.. వైఫల్యంలో.. ప్రతీ అడుగులో వీళ్లు అడుగు వేశారు. నా వెన్నంటే ఉన్నారు. లాభాల బాట పట్టడానికి వీళ్లు చేసిన కృషికి వెలకట్టలేను. కానీ, వాళ్లను ఇలా ప్రొత్సహించాలని అనుకున్నా.. అంతే అని తెలిపారాయన. యజమాని ఊహించిన సర్ప్రైజ్ పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Chennai, Tamil Nadu | A jewellery shop owner gifted cars and bikes to his staff as Diwali gifts They have worked with me through all ups and downs. This is to encourage their work. We are giving cars to 10 people and bikes to 20: Jayanthi Lal, owner of the jewellery shop (16.10) pic.twitter.com/xwUI0sgNRn — ANI (@ANI) October 17, 2022 -
మంచిర్యాల : షాపు గేట్లు పగలగొట్టి చోరీకి పాల్పడిన దొంగలు
-
ఐదు నిమిషాల్లో 2 కోట్ల రూపాయలు..
ముంబై : పట్టపగలు ఓ బంగారు దుకాణాన్ని దోచేశారు దుండగులు. తుపాకితో బెదిరింపులకు దిగి ఈ దోపిడికి పాల్పడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, మీరా రోడ్డులోని శాంతినగర్ ఏరియాలో ఎస్ కుమార్ బంగారు నగల దుకాణం ఉంది. గురువారం మధ్యాహ్నం 2గంటల సమయంలో నలుగురు వ్యక్తులు షాపులోకి ప్రవేశించారు. వారికి షాపు సిబ్బంది నగలను చూపిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపాడు. ( మాటలకు అందని విషాదం: అమిత్ షా) సీసీ టీవీ ఫుటేజి దృశ్యాలు సిబ్బందిని బెదిరించి నగలను సంచుల్లో నింపుకోసాగారు. ఐదు నిమిషాల్లో తమకు కావాల్సిన మేరకు బంగారు నగలను దోచుకుని అక్కడినుంచి బయటకు వచ్చారు. అనంతరం బయట ఉంచిన బైకుపై ఇద్దరు.. మరో ఇద్దరు బైకును అక్కడే వదిలేసి కాలినడకన వెళ్లిపోయారు. దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసే నగలను వారు దోచుకెళ్లిపోయినట్లు సమాచారం. దోపిడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమరాల్లో రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నగల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
పనాజీ: గోవాలోని మార్గావ్ ప్రాంతంలో సప్నా ప్లాజా సమీపంలో స్వాప్నిల్ వాల్కే అనే 41 ఏళ్ల జ్యూవెలరీ షాపు యజమానిని దుండగులు హత్య చేశారు. కత్తులతో పొడవడంతో వ్యాపారి మృతి చెందాడు. దక్షిణ గోవా పోలీసు సూపరింటెండెంట్ మాట్లాడుతూ, ‘సప్నా ప్లాజా సమీపంలోని మార్గావ్ ఏరియాలో ఒక ఆభరణాల వ్యాపారిపై దాడి చేసినట్లు పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చింది. వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ మార్గవో టౌన్ సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను హోస్పిసియో ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాధితుడు చనిపోయినట్లు ప్రకటించారు అని ఆయన తెలిపారు. సంఘటన స్థలంలో ఒక నాటు తుపాకీ, 3 లైవ్‌రౌండ్లు, ఒక కత్తి కవర్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తరువాత ముగ్గురు వ్యక్తులు వీధి చివరకు పరుగెత్తుకొని వెళ్లడాన్ని అక్కడ ఉన్న చుట్టు పక్కన వారు వీడియో తీశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నామని, నిందుతులను గుర్తించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. దుకాణం లోపల, బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారు. చదవండి: టీనేజర్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం -
రాజధానిలో ... నగల షాపులో చోరీ
బరంపురం : రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని ఓ బంగారం దుకాణంలో జరిగిన ఆభరణాల చోరీ కేసులో సంబంధిత నిందితులైన నలుగురు మహిళలతో పాటు బంగారం కొన్న వ్యక్తిని బరంపురంలో పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నగరంలో సంచలనం రేపింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 18వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా రాజధాని భువనేశ్వర్‌లోని లింగరాజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల సమంతపూర్ దగ్గర ఉన్న దేవి దుర్గా జ్యుయలర్స్‌లో ముగ్గురు మహిళలు బంగారం కొనేందుకు వెళ్లగా మరో మహిళ బంగారం దుకాణం బయట పర్యవేక్షించింది. లోన ముగ్గురు మహిళలు బంగారం ఆభరణాన్ని లూటీ చేసి తప్పించుకుని వచ్చారు. జరిగిన సంఘటనపై బంగారం దుకాణం యాజమన్యం లింగరాజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దొంగలను పట్టించిన సీసీటీవీ దీంతో కేసు నమోదు చేసి పోలీస్ కమిషనరేట్ సవాల్‌గా తీసుకుని ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించింది. దర్యాప్తులో భాగంగా లూటీ జరిగిన దుకాణంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించి ఫొటోలు సేకరించారు. ఇటీవల బంగారం దుకాణాల్లో జరిగిన లూటీకి సంబంధించి ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. లూటీ చేసిన మహిళలను బరంపురం నగరంలోని హరడాఖండి బౌరి వీధికి చెందిన వారుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో శనివారం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక పోలీసు బృందం వచ్చి పెద్ద బజార్ పోలీసుల సహాయంతో నిందితులైన నలుగురు మహిళలను అరెస్ట్ చేసి పెద్ద బజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా లూటీ చేసిన బంగారం అభరణం కొన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు. అరెస్ట్ అయిన మహిళలను హరడాఖండిలోని బౌరి వీధికి చెందిన జుమ్మురి దాస్, జుమ్మిరి బెహరా, సుశీల దాస్, సంజు బెహరాలుగా గుర్తించామని ఐఐసీ అధికారి సురేష్ త్రిపాఠి చెప్పారు. ఈ మహిళలు గతంలో కూడా రాష్ట్రంలోని వివిధ బంగారం దుకాణాల్లో నగలు లూటీ చేసిన కేసుల్లో పలుమార్లు అరెస్ట్ అయి జైల్‌కు వెళ్లినట్లు చెప్పారు. -
గర్ల్ ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్!
ఇద్దరి మధ్య ఏమీ లేదు లేదంటూనే శ్రద్ధాకపూర్ కోసం వజ్రాల ఉంగరం కొనేశాడు ఆదిత్యారాయ్ కపూర్. తన చిత్రం ప్రమోషన్లో ఎంతో బిజీగా ఉన్నా.. షాట్ గ్యాప్‌లో షాపింగ్‌కు ట్రైచేశాడీ కుర్ర హీరో. ‘దావత్ ఎ ఇష్క్’ చిత్రం ప్రచార కార్యక్రమం కోసం సహనటి పరిణీతి చోప్రాతో సూరత్ వెళ్లే క్రమంలో ఆదిత్యా... ఓ జ్యువెలరీ షాప్‌ను విజిట్ చేశాడట. అక్కడ రద్దీ ఉండటంతో తిరిగి వచ్చేశాడట. తరువాత నగల వ్యాపారిని తన హోటల్‌కు రప్పించుకొని డైమండ్ రింగ్ కొనేశాడనేది ‘ది మిర్రర్’ కథనం.