
సీసీ టీవీ ఫుటేజి దృశ్యాలు
ముంబై : పట్టపగలు ఓ బంగారు దుకాణాన్ని దోచేశారు దుండగులు. తుపాకితో బెదిరింపులకు దిగి ఈ దోపిడికి పాల్పడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, మీరా రోడ్డులోని శాంతినగర్ ఏరియాలో ఎస్ కుమార్ బంగారు నగల దుకాణం ఉంది. గురువారం మధ్యాహ్నం 2గంటల సమయంలో నలుగురు వ్యక్తులు షాపులోకి ప్రవేశించారు. వారికి షాపు సిబ్బంది నగలను చూపిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపాడు. ( మాటలకు అందని విషాదం: అమిత్ షా)
సీసీ టీవీ ఫుటేజి దృశ్యాలు
సిబ్బందిని బెదిరించి నగలను సంచుల్లో నింపుకోసాగారు. ఐదు నిమిషాల్లో తమకు కావాల్సిన మేరకు బంగారు నగలను దోచుకుని అక్కడినుంచి బయటకు వచ్చారు. అనంతరం బయట ఉంచిన బైకుపై ఇద్దరు.. మరో ఇద్దరు బైకును అక్కడే వదిలేసి కాలినడకన వెళ్లిపోయారు. దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసే నగలను వారు దోచుకెళ్లిపోయినట్లు సమాచారం. దోపిడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమరాల్లో రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment