ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్ ఇమాన్యుల్ నివాసంపై ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గతంలో ఇమాన్యుల్ మీద ఆరోపణలు రావటంతో ఈ సోదాలు చేపట్టారు.