అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ అబిడ్స్ బిల్ కలెక్టర్ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారిపై ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇప్పటివరకూ దాదాపు కోటి రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయని సమాచారం. నరసింహారెడ్డికి సంబంధిన ఇళ్లు, ఇతర ఆస్తులపై తనిఖీలు ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని అక్రమ ఆస్తులు వెలుగుచూసే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.