illegal properties
-
10 కోట్ల ఆస్తి.. 4 కేజీల బంగారం.. మైండ్ బ్లాక్ అయ్యేలా జ్యోతి ఆస్తులు
-
అయోధ్య భూకుంభకోణంపై దర్యాప్తు
లక్నో: అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామమందిరం సమీపంలోని భూములను కొంటూ బీజేపీ నేతలు, ఉన్నతాధికారులు భూకుంభకో ణానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అక్రమ కొనుగోళ్లు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సర్కార్ హెచ్చరించింది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం కేసులో 2019లో చరిత్రాత్మక తీర్పు వెలువడిన మరు క్షణమే అయోధ్య, పరిసర ప్రాంతాల్లో భూముల బలవంతపు కొనుగోళ్ల పర్వం ఊపందుకుందని మీడియాలో వార్తలొచ్చాయి. బీజేపీ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, కమిషన్ బంధువులు, సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, డీఐజీ తదితరులు అయోధ్య సమీప స్థలాలను కొనుగోలు చేశారన్న వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ రెవెన్యూ శాఖను ఆదేశించారని యూపీ అదనపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సమాచార) నవనీత్ సెహగల్ చెప్పారు. మతం ముసుగులో హిందుత్వ వాదులు స్థలాలను దోచుకుంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి: ప్రియాంక కుంభకోణంపై యూపీ సర్కార్ దర్యాప్తునకు ఆదేశించడాన్ని కంటి తుడుపు చర్యగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అభివర్ణించారు. ఆలయం కోసం అధిక ధరలకు భూములు కొంటూ ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రియాంక ఆరోపించారు. సుప్రీంకోర్టు సూమోటోగా కలగజేసుకుని న్యాయం చేయాలన్నారు. ఆలయం కోసం వేల కోట్ల విరాళాలిచ్చిన రామభక్తుల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని బీఎస్పీ చీఫ్ మాయవతి సైతం డిమాండ్‌చేశారు. -
ఐటీడీఏ పీఓ ఇంట్లో ఏసీబీ సోదాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ పీఓ జల్లేపల్లి వెంకటరావు ఇంటిపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు జరిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో జరిపిన ఈ దాడుల్లో ఇప్పటివరకు ఐదు ఫ్లాట్లు, ఒక కారు, రెండిళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది. మొత్తం కోటి రూపాయల ఆస్తులున్నట్లు ఇప్పటివరకు చేసిన తనిఖీలలో తేలింది. శ్రీకాకుళంతో పాటు ఆముదాలవలస, వైజాగ్‌లలోని అతనికి చెందిన ఇళ్లపై కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఉద్యోగి
-
జీహెచ్ఎంసీ ఉద్యోగి అక్రమ ఆస్తులు రూ.3కోట్లు!
హైదరాబాద్: అవినీతి తిమింగళాలపై ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ అబిడ్స్ బిల్ కలెక్టర్ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారిపై ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇప్పటివరకూ దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయని సమాచారం. నరసింహారెడ్డికి సంబంధిన ఇళ్లు, ఇతర ఆస్తులపై ఏసీబీ డీఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని అక్రమ ఆస్తులు వెలుగుచూసే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులను చూసి బాత్రూంలో దాక్కుని మీరు వెళ్లిపోకపోతే సూసైడ్ చేసుకుంటానని మొదట బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే అధికారులు మాత్రం వెనక్కి తగ్గకుండా తమ డ్యూటీ చేసుకుపోయారు. ఏసీబీ డీఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి నేటి ఉదయం 5 గంటల సమయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని కుకట్ పల్లి, బాలానగర్, మరో ప్రాంతంలో ఉన్న నరసింహారెడ్డి ఇళ్లపై దాడులు నిర్వహించి కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేటలో 25 ఏకరాలకు పైగా భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కోట్లకు పడగలెత్తిన సీఐ బాలకృష్ణ
రియల్ ఎస్టేట్.. లిక్కర్ లాబీలతో నగర పోలీసుల అనుబంధం, భాగస్వామ్యం తాజా ఏసీబీ దాడులతో బట్టబయలైంది. రౌడీషీటర్ల పీచమణచాల్సిన పోలీసు అధికారులు.. ఏకంగా వారినే తమ బినామీలుగా పెట్టుకొని అడ్డగోలు వ్యాపారాలు.. దందాలతో కోట్లకు పడగలెత్తుతున్న తీరు విస్మయం కలిగిస్తోంది. వారికి ప్రభుత్వం ఇచ్చే వేతనాలు.. వారి ఆస్తులకు పొంతనే లేకపోయినా పోలీస్ బాస్‌లు చూసీచూడనట్లు పోతుండటంతో అక్రమ దందాలు అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతున్నాయి. తాజాగా నాలుగోపట్టణ సీఐ బాలకృష్ణపై ఏసీబీ జరిపిన దాడులు ఆయనకు రౌడీషీటర్లతో ఉన్న ‘రియల్’ బంధాన్ని వెలుగులోకి తెచ్చాయి. విశాఖపట్నం: విశాఖ కమిషనరేట్ పరిధిలోని నాలుగో పట్టణ సీఐ కె.వి.బాలకృష్ణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం జరిపిన దాడులు.. ఆయన నివాసం, కుటుంబ సభ్యుల ఇళ్లలో జరిపిన సోదాల్లో బంగారం, వెండి, నగదుతోపాటు కళ్లు చెదిరేలా భవంతులు, స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించి కీలక పత్రాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ రేటు ప్రకారం వీటి విలువ రూ.2 కోట్లని ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. అయితే బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.10 కోట్లుపైనే ఉంటుందని అంచనా. విశాఖలోని పీఎంపాలెం, సింహాచలం, కొవ్వూరు, విజయనగరం తదితర ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో జరిపిన సోదాల్లో అత్త, మామ, తండ్రి, భార్య, మరదలు పేరిట విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు నిర్థారణ అయ్యింది. కుటుంబ సభ్యుల పేరుతో.. పోతినమల్లయ్యపాలెంలో బాలకృష్ణకు చెందిన జీ+3 రెండు ఇళ్లు, శివాజీపాలెం మంగపురం కాలనీలో 1800 అడుగుల ప్లాటు, విజయనగరంలో తండ్రి పేరిట కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు గుర్తించారు. అత్త పేరుతో ఎండాడలో 2015లో రూ.40 లక్షలు విలువైన ఫ్లాట్ కొనుగోలు చేశారు. తన మరదలి పేరిట కొమ్మాది సమీపంలోని జె.కె. ప్లాజాలో రూ. 60 లక్షల ఫ్లాట్, నరవలో భార్య పేరు మీద 37 సెంట్లు భూమి, 10 లక్షల విలువైన 227 గజాల స్ధలం ఉన్నట్లు గుర్తించారు. ఫోర్తుటౌన్ స్టేషన్లో సీఐ బాలకృష్ణ చాంబర్ నుంచి కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాలకృష్ణ ఇంట్లో 25 తూలాల బంగారం, తనఖా పట్టిన 400 గ్రాముల బంగారం లభించిందన్నారు. వీటితోపాటు మూడు కేజీల వెండి, బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు ఉన్నాయని తెలిపారు. ఇన్సూరెన్స్, చీటీలకు సంబంధించి రూ. 8 లక్షల విలువైన పత్రాలు లభించాయి. బ్యాంకు లాకరు తాళం కూడా ఉందని పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన అన్నదమ్ముల గొడవను సెటిల్ చేసేందుకు సీఐ బాలకృష్ణ రూ.2 లక్షలు తీసుకున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై గత ఏడాది నుంచి ఫోర్తుటౌన్ పోలీస్‌స్టేషన్‌పై నిఘా పెట్టామని డీఎస్పీ వెల్లడించారు. రెండు లక్షలు తీసుకున్నవారిలో ఈయనతోపాటు ఒక ఎస్సై, ఒక హెచ్‌సీ, కానిస్టేబుల్ ఉన్నట్లు తెలిపారు. వారిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. విజయనగరం, కొవ్వూరు,సింహాచలంలో బాలకృష్ణ కుటుంబ సభ్యుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. పలు వ్యాపారాలు రౌడీ షీటర్ అయిన నానాజీ అనే వ్యక్తిని సీఐ తనకు బినామీగా పెట్టుకున్నారన్న ఆరోపణలతో నానాజీ ఇంట్లోనూ సోదాలు చేశామని.. అయితే అక్కడ ఏమీ లభించలేదని డీఎస్పీ చెప్పారు. అయితే ఇతని ద్వారానే బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు తెలిసింది. విజయనగరం జిల్లాలో లిక్కర్ లాబీలో కూడా గతంలో వాటాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏఆర్ నుంచి లా అండ్ ఆర్డర్‌కు 1992లో ఆర్.ఎస్.ఐ.గా పోలీస్ శాఖలో చేరిన బాలకృష్ణ.. 2002లో లా అండ్ ఆర్డర్‌కు వచ్చారు. యలమంచిలిలో సీఐగా చేశారు. అనంతరం పీఎంపాలెం ట్రాఫిక్ సీఐగా వచ్చారు. 2015 జనవరిలో ఫోర్తుటౌన్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. సీఐ బాలకృష్ణపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
ఏసీబీ వలలో ప్రభుత్వాధికారి
హైదరాబాద్ : ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అధికారి విజయ్ కుమార్ అక్రమ ఆస్తులను కలిగి ఉన్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.12 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. అలకాపురి, నల్లకుంటలో రెండు ఇళ్లు, కావూరి హిల్స్‌లో రెండు ఫ్లాట్లు, ఆదిభట్లలో మరో మూడు ఫ్లాట్లు, ఓఆర్ఆర్ సమీపంలో 5 ఎకరాల వ్యవసాయ భూమి, 6లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దాడులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీకి చిక్కిన టౌన్‌ప్లానింగ్ ఎస్ఓ
రూ.3 కోట్ల అక్రమాస్తులున్నట్టు గుర్తింపు విలువైన ఆభరణాలు, ఆస్తుల పత్రాలు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. సికింద్రాబాద్ సర్కిల్ కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న దాచ జనార్దన్‌మహేశ్ రూ.3 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. బుధవారం మహేశ్, ఆయన బంధువులకు చెందిన ఐదు ఇళ్లు, కార్యాలయంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సైనిక్‌నగర్, మల్కాజిగిరిల్లో అపార్టుమెంట్, ఇల్లు, ఎర్రమంజిల్‌లో ఫ్లాట్ సహా రూ.3 కోట్ల మేర అక్రమ ఆస్తులున్నట్లు తేల్చారు. రూ.2.3 లక్షల నగదు, 1,300 గ్రా ముల బంగారు ఆభరణాలు, 2,300 గ్రాము ల వెండి సామగ్రి ఏసీబీ అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. వీటితో పాటు ఆయన, కుటుంబ సభ్యుల పేరిట రూ.28 లక్షల బ్యాంక్ బాలెన్స్, రూ.9 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండు కార్లు, రెండు బైక్‌లు ఉన్నట్టు గుర్తించినట్టు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఎం.ప్రభాకర్ తెలిపారు. 1980ల్లో ఎన్ఎంఆర్ మజ్దూర్‌గా జీహెచ్ఎంసీలో చేరిన మహేశ్ సికింద్రాబాద్ సర్కిల్ వదిలి వెళ్లడు. వేరే సర్కిల్‌కు బదిలీ చేసినా, పైరవీలతో తిరిగి సికింద్రాబాద్‌కే రావడం ఆయన ప్రత్యేకత. ఈ సర్కిల్లో వాణిజ్య భవనాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తె8లుస్తోంది. -
డిప్యూటీ ఈవో కు 29 ప్లాట్లు, ఓ లాడ్జీ..
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయ డిప్యూటీ ఈవో టి.భూపతిరెడ్డి ఇంటిపై మంగళవారం రెండో రోజు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు భూపతిరెడ్డి ఆస్తులు 29 ప్లాట్లు, ఓ లాడ్జీ ఉన్నట్లు గుర్తించామని.. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. టీటీడీ అధికారిగా పనిచేసినప్పుడు తాను ఏ తప్పు చేయలేదని, తన కుమారులు విదేశాలలో ఉంటూ సంపాదించిందే తప్ప.. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని భూపతిరెడ్డి చెప్పారు. తనపై ఎవరో కుట్ర పన్ని తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆయన ఆరోపించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం రావడంతో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆయన ఇంట్లో పలు కీలకమైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఆస్తులు రూ.4 కోట్లు
విజయనగరం : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) ఎంవీఆర్ కృష్ణాజీ నివాసం, బంధువుల ఇళ్లు, కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలకు దిగారు. విజయనగరం పట్టణంలోని ఉడా కాలనీలోని కృష్ణాజీ నివాసం, ఆయన సంబంధీకులకు చెందిన పట్టణంలోని మూడు ఇళ్లల్లో, ఎచ్చర్లలోని ఆయన కార్యాలయంపై అధికారులు వేర్వేరుగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.4 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. వీటిలో అక్రమాస్తులు ఎన్ని? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై అధికారుల విచారణ కొనసాగుతోంది. -
‘నల్లధనం’ బిల్లుకు ఆమోదం
మరో రెండు ముఖ్యమైన బిల్లులకు లోక్‌సభ ఓకే న్యూఢిల్లీ: విదేశాల్లో దాచిన నల్లధనానికి సంబంధించి కఠిన చర్యలతో కూడిన బిల్లును బుధవారం పార్లమెంటు ఆమోదించింది. విదేశాల్లో అక్రమ ఆస్తులు దాచిన వారు.. వాటిని వెల్లడించేందుకు గల గడువును వినియోగించుకోవాలని సూచించిం ది. లేదంటే ప్రపంచ ఆటోమేటిక్ సమాచార మార్పిడి వ్యవస్థ 2017లో అమలులోకి వస్తుందని.. ఆ తర్వాత ఇటువంటి వారు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని హెచ్చరించింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ కొత్త చట్టం ఉపయోగపడుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో పేర్కొన్నారు. రెండు రోజుల కిందట లోక్‌సభ ఆమోదం పొందిన ‘నల్ల ధనం (బహిర్గతం చేయని విదేశీ ఆదాయం, ఆస్తులు) మరియు పన్ను విధింపు బిల్లు - 2015’ను బుధవారం రాజ్యసభ కూడా ఆమోదించింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ఈ అంశానికి తాము ఇస్తున్న ప్రాధాన్యతను ఇది సూచిస్తోందని ట్విటర్లో వ్యాఖ్యానించారు. అలాగే.. విజిల్‌బ్లోయర్స్ ప్రొటెక్షన్ (సవరణ) బిల్లు - 2015 (సామాజిక సమాచార ఉద్యమకారుల పరిరక్షణ బిల్లు)ను లోక్‌సభ ఆమోదించింది. అలాగే.. చెక్కుల తిరస్కరణ (బౌన్స్) కేసుల్లో కేసుల నమోదును మరింత సరళం చేసేందుకు ఉద్దేశించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఇక లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న జాతీయ జలమార్గాల బిల్లు, పరిహారపూరిత అటవీకరణ నిధి బిల్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ తెలిపారు. నేపాల్‌లో, భారత్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సంభవించిన భూకంపం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవటం పట్ల లోక్‌సభ విచారం వ్యక్తంచేసింది. ఉభయసభలూ నిరవధిక వాయిదా: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. లోక్‌సభ, రాజ్యసభ రెండూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఇటీవలి సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో అధికారిక కార్యక్రమాలు జరగటం ఈ సమావేశాల విశేషం. అయితే.. విపక్షాలప్రతిఘటన కారణంగా.. వివాదాస్పదమైన భూ సేకరణ బిల్లు, కీలకమైన ఆర్థిక సంస్కరణకు ఉద్దేశించిన జీఎస్టీ బిల్లులను ప్రభుత్వం పార్లమెంటు ఆమోదం పొందలేకపోయింది. లోక్‌సభ షెడ్యూల్డు పని గంటల్లో 117 శాతం, రాజ్యసభ షెడ్యూల్డు పని గంటల్లో 101 శాతం ఫలవంతంగా పనిచేశాయని.. గత పదేళ్లలో ఇదే అత్యుత్తమమని ప్రభుత్వం పేర్కొంది. -
అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ ఇంటిపై ఏసీబీ దాడులు
-
ఆక్రమిత భూములన్నీ ఇక స్వాధీనమే!
సాక్షి, హైదరాబాద్: ఆక్రమణలకు గురైన అన్ని రకాల భూములను స్వాధీనం చేసుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. భూదాన్, అసైన్డ్, పట్టణ భూ గరిష్ట పరిమితి పరిధిలోని భూములపై నిర్దిష్టం గా వివరాలను అధ్యయనం చేయడానికి కట్టుదిట్టంగా రహస్య ఏర్పాట్లు చేసింది. ఈ విభాగానికి వస్తు న్న ఫిర్యాదులను, సమాచారాన్ని ఏ రోజుకారోజు తెలంగాణ సీఎం కార్యాలయ ముఖ్య అధికారి ఒకరు సమీక్షిస్తున్నారు. భూ ఆక్రమణలు, అక్రమాలపై వచ్చిపడుతున్న ఫిర్యాదులు, సమాచారంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఆక్రమణలకు గురైన భూములు ఏకంగా 3 లక్షల నుంచి 4 లక్షల ఎకరాలు ఉన్నాయని సర్కారు భావిస్తోంది. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు... హైదరాబాద్ పరిసరాల్లోని భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాలు కింది స్థాయిలోకి వెళ్లిన తర్వాత.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధుల్లోనే కాకుండా జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో జరిగిన భూ ఆక్రమణలపై సీఎం కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయి. వీటిని అధ్యయనం చేయడానికి సీసీఎల్ఏ కార్యాలయంలో సహాయ కార్యదర్శి స్థాయి అధికారితో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని నెలకొల్పారు. ఆక్రమణలకు సంబంధిం చిన వివరాలను అత్యంత రహస్యంగా సేకరించడానికి, అధ్యయనం చేయడానికి వీలుగా కొందరు అధికారులను, సిబ్బం దిని ప్రత్యేకంగా వినియోగించుకుంటున్నారు. వారంతా సహా య కార్యదర్శికి మాత్రమే జవాబుదారీగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆ కార్యాలయంలోని మిగిలిన సిబ్బందికి కూడా ఈ విషయాలు ఏవీ తెలియకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆ విభాగంలోకి వారికి ప్రవేశం కూడా లేకుండా చేశా రు. గతంలోని కమిటీలోని ముఖ్యుల ఆధ్వర్యంలోనే భూదాన్ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని ప్రాథమికంగా పలు నివేదికలు అందినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా భూదాన్ ట్రస్టులో కీలకంగా వ్యవహరించినవారిని ముందుగానే అదుపులోకి తీసుకోవాలని, లేకుంటే శిక్ష నుంచి తప్పించుకునేందుకు వారు విదేశాలకు పారిపోయే ప్రమాదం కూడా ఉందని సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్టుగా విశ్వసనీయ సమాచారం. వీటన్నింటిపైనా సీసీఎల్ఏలో ఏర్పాటైన విభాగం సమాచారాన్ని సేకరిస్తోంది. వీటితోపాటు అసైన్డు భూములపైనా చాలా ఆరోపణలు, ఆధారాలు వస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కుంభకోణాలు నిర్దిష్ట ఆధారాలతో బయటకు వచ్చాయని సీఎం కార్యాలయం నిర్ధారణకు వచ్చింది. అసైన్డుసహా సర్కారు భూముల్ని కొన్ని ప్రాంతాల్లో అమ్ముకున్నారు. మరి కొన్ని చోట్ల బినామీ అసైనీల పేరుతో అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డారు. అసైన్డ్ చేసిన ఉద్దేశానికి, కేటాయించిన లక్ష్యానికి భిన్నంగా ఇతరత్రా అవసరాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వినియోగించుకున్నారు. ఇలాం టి ఫిర్యాదులు వేలాదిగా సీఎం కార్యాలయానికి వచ్చిపడుతున్నాయి. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కింద మినహాయిం పు పొందిన భూములు కూడా చాలాచోట్ల నిరుపయోగంగా పడి ఉన్నట్టు సీఎం కార్యాలయానికి సమాచారం అందుతోంది. కబ్జాకు గురైన భూములు సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల ఎకరాలు ఉండే అవకాశం ఉందని సీఎం కార్యాలయం నిర్ధారణకు వచ్చింది. ఇందులో భూదాన్ భూములే లక్ష ఎకరాలకు పైగా ఉన్నట్లు అంచనా. సీసీఎల్ఏలో ఏర్పాటైన ప్రత్యేక విభాగం వీటన్నింటిపైనా లోతుగా, నిర్దిష్టమైన ఆధారాలతో అధ్యయనం చేసి, ఏ రోజుకారోజు నివేదికలను, సమాచారాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.