ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) ఎంవీఆర్ కృష్ణాజీ నివాసం, బంధువుల ఇళ్లు, కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలకు దిగారు.
విజయనగరం : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) ఎంవీఆర్ కృష్ణాజీ నివాసం, బంధువుల ఇళ్లు, కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలకు దిగారు.
విజయనగరం పట్టణంలోని ఉడా కాలనీలోని కృష్ణాజీ నివాసం, ఆయన సంబంధీకులకు చెందిన పట్టణంలోని మూడు ఇళ్లల్లో, ఎచ్చర్లలోని ఆయన కార్యాలయంపై అధికారులు వేర్వేరుగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.4 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. వీటిలో అక్రమాస్తులు ఎన్ని? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై అధికారుల విచారణ కొనసాగుతోంది.