
ఏసీబీకి చిక్కిన టౌన్‌ప్లానింగ్ ఎస్‌ఓ
రూ.3 కోట్ల అక్రమాస్తులున్నట్టు గుర్తింపు
విలువైన ఆభరణాలు, ఆస్తుల పత్రాలు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. సికింద్రాబాద్ సర్కిల్ కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న దాచ జనార్దన్‌మహేశ్ రూ.3 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. బుధవారం మహేశ్, ఆయన బంధువులకు చెందిన ఐదు ఇళ్లు, కార్యాలయంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సైనిక్‌నగర్, మల్కాజిగిరిల్లో అపార్టుమెంట్, ఇల్లు, ఎర్రమంజిల్‌లో ఫ్లాట్ సహా రూ.3 కోట్ల మేర అక్రమ ఆస్తులున్నట్లు తేల్చారు. రూ.2.3 లక్షల నగదు, 1,300 గ్రా ముల బంగారు ఆభరణాలు, 2,300 గ్రాము ల వెండి సామగ్రి ఏసీబీ అధికారులు స్వాధీ నం చేసుకున్నారు.
వీటితో పాటు ఆయన, కుటుంబ సభ్యుల పేరిట రూ.28 లక్షల బ్యాంక్ బాలెన్స్, రూ.9 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రెండు కార్లు, రెండు బైక్‌లు ఉన్నట్టు గుర్తించినట్టు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్‌పీ ఎం.ప్రభాకర్ తెలిపారు. 1980ల్లో ఎన్‌ఎంఆర్ మజ్దూర్‌గా జీహెచ్‌ఎంసీలో చేరిన మహేశ్ సికింద్రాబాద్ సర్కిల్ వదిలి వెళ్లడు. వేరే సర్కిల్‌కు బదిలీ చేసినా, పైరవీలతో తిరిగి సికింద్రాబాద్‌కే రావడం ఆయన ప్రత్యేకత. ఈ సర్కిల్‌లో వాణిజ్య భవనాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తె8లుస్తోంది.