గ్రామ కార్యదర్శిని చంపి, కాల్చేశారు..!
Published Wed, Feb 17 2016 2:37 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
ఓర్వకల్లు : కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చుంచు ఎర్రగుడి గ్రామ కార్యదర్శిగా పని చేసిన ఇమ్మానుయేలు దారుణ హత్యకు గురయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇమ్మానుయేలు ఇటీవల సస్పెండ్ అయ్యారు. కాగా, ఆయన సోమవారం నుంచి కనిపించడం లేదు. బుధవారం ఆయన మృతదేహాన్ని ఓర్వకల్లు మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో పడి ఉండగా గమనించారు.
మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేసిన ఆనవాళ్లను స్థానికులు కనుగొన్నారు. సగం కాలిన మృతదేహానికి కొద్దిదూరంలో ఆయన సెల్‌ఫోన్ పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ నాగరాజు యాదవ్, ఎస్సై చంద్రబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement