ఎడ్లపాడు: గుంటూరు జిల్లాఎడ్లపాడు మండలం ఎన్‌ఎస్ టెక్స్‌టైల్ వద్ద బైక్ బోల్తా పడిన ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఇమాన్యుయేల్.. ఆయన భార్య బైక్‌పై గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతుండగా.. బుధవారం రాత్రి టవల్.. బండి చక్రంలో పడడంతో బైకు బోల్తా పడింది. ఈఘటనలో తీవ్రగాయాలైన వారిని హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.