నైజీరియన్‌ యువతులతో వ్యభిచారం... | Prostitution With Nigerian Girls, Police Rescued 9 Young Women, More Details Inside | Sakshi
Sakshi News home page

నైజీరియన్‌ యువతులతో వ్యభిచారం...

Published Thu, Nov 28 2024 12:17 PM | Last Updated on Thu, Nov 28 2024 1:06 PM

9 arrested for prostitution with Nigerian women

తిరువొత్తియూరు: కోయంబేడు మార్కెట్‌ ఎదురుగా ఉన్న మంగమాల్‌ నగర్‌ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని స్థానిక పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ అరుల్‌ మణిమారన్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. నైజీరియాకు చెందిన యువతులు ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 

ఆ తర్వాత వ్యభిచారం నిర్వహిస్తున్న నైజీరియాకు చెందిన 9 మంది యువతులను పోలీసులు రక్షించారు. అద్దె ఇంట్లో ఉంటూ సెల్‌ ఫోన్‌ యాప్‌  ద్వారా కస్టమర్లను సంప్రదించి ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు సమాచారం. రక్షించబడిన 9 మంది నైజీరియన్‌ మహిళలను మైలాపూర్‌లోని ప్రభుత్వ ఆశ్రమానికి అప్పగించారు. వీరితో సంబంధం ఉన్న ముఠాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement