హిమాయత్‌నగర్: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్ట్రాగామ్ వేదికగా అమ్మాయిలను మోసం చేస్తున్న నైజీరియన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో అడిషనల్ డీసీపీ స్నేహ మెహర, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. బేగంపేటకు చెందిన ఓ యువతికి యూఎస్‌లో ఉంటానంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.
స్నేహానికి గుర్తుగా యూఎస్ నుంచి విలువైన గిఫ్ట్‌లు పంపిస్తున్నట్లు సదరు వ్యక్తి యువతితో నమ్మబలికాడు. ఢిల్లీ కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నామని యువతికి ఫోన్ చేసి రూ. 2.50 లక్షలు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించగా.. నైజీరియాకు చెందిన అల్లోట్ పీటర్ అలియాస్ చిబుజా, రోమాన్స్ జాషువాలను గుర్తించి అరెస్ట్ చేసినట్లు గజరావు భూపాల్ తెలిపారు.
(చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం)
Comments
Please login to add a commentAdd a comment