పసిడి మెరుపులు..ట్రెండ్ ఇక పై పైకే!
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్ లో బంగారం మెరుస్తోంది. ప్రపంచవ్యాపితంగా బంగారు 0.14 శాతం, వెండి ధర 0.44 శాతం పెరుగుదలను నమోదుచేసింది. గత నాలుగు సెషన్లనో రూ .400 లాభపడింది.గత వారమంతా లాభాల్లో కొనసాగిన పసిడి ధరలు క్రమంగా నిలదొక్కుకుంటున్నాయి. గ్లోబల్ ట్రెండ్ , వివాహ సీజన్ లో నెలకొన్నడిమాండ్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు వరసగా ఐదవ సెషన్ లోనూ లాభపడ్డాయి. శనివారం పది గ్రాముల బంగారం రూ 100 రూ 31.150 వద్ద పాజిటివ్ ధోరణితో ఉంది. దేశరాజధానిలో 99.9 స్వచ్ఛతబంగారం 10 గ్రాములు రూ 31.150 గా ఉంది. వెండి కూడా రూ .350 పెరిగి కిలో రూ. 44,000 స్థాయి వద్ద స్థిరంగా ఉంది. మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో అంతర్జాతీయ మార్కెట్లో గత వారం 1266 డాలర్ల దగ్గర మొదలైన ఔన్స్ పసిడి ధర వారాంతానికల్లా 1300 డాలర్లను అధిగమించింది.
నాణాల తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి డిమాండ్ కారణంగా మళ్లీ వెండి ధరలు పుంజుకోనున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ కారణంగా పసిడి ధరలు పెరుగుతున్నాయని బులియన్ వర్తకులు చెబుతున్నారు. దేశీయంగా కూడా నిరంతర కొనుగోళ్లతో సెంటిమెంట్ బలంగా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి ఆధిక్యంలోకి రావడంతో పసిడికి డిమాండ్ ఊపందుకుందని విశ్లేషిస్తున్నారు.