Upward Trend
-
ఆరో రోజూ పెరిగిన పెట్రోలు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరలు పెరిగాయి. మంగళవారం వరుసగా ఆరో రోజు కూడా పెరిగాయి. అటు గత సెషన్లుగా స్థిరంగా ఉన్న డీజిల్ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు పెరగడం వల్ల ధరలు ప్రభావితమయ్యాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరిగాయి, చెన్నైలో లీటరుకు 16 పైసలు పెరిగాయి. హైదరాబాద్ : పెట్రోలు ధర రూ. 78.96, డీజిల్ ధర 71.85 విజయవాడ : పెట్రోలు ధర రూ. 78.17 , డీజిల్ ధర 70.81 ఢిల్లీ : పెట్రోలు ధర రూ. 74.20, డీజిల్ ధర 65.84 కోలకతా: పెట్రోలు ధర రూ. 76.89, డీజిల్ ధర 68.25 చెన్నై : పెట్రోలు ధర రూ. 77.13 డీజిల్ ధర 69.59 ముంబై : పెట్రోలు ధర రూ. 79.86, డీజిల్ ధర 69.06 -
పసిడి మెరుపులు..ట్రెండ్ ఇక పై పైకే!
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్ లో బంగారం మెరుస్తోంది. ప్రపంచవ్యాపితంగా బంగారు 0.14 శాతం, వెండి ధర 0.44 శాతం పెరుగుదలను నమోదుచేసింది. గత నాలుగు సెషన్లనో రూ .400 లాభపడింది.గత వారమంతా లాభాల్లో కొనసాగిన పసిడి ధరలు క్రమంగా నిలదొక్కుకుంటున్నాయి. గ్లోబల్ ట్రెండ్ , వివాహ సీజన్ లో నెలకొన్నడిమాండ్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు వరసగా ఐదవ సెషన్ లోనూ లాభపడ్డాయి. శనివారం పది గ్రాముల బంగారం రూ 100 రూ 31.150 వద్ద పాజిటివ్ ధోరణితో ఉంది. దేశరాజధానిలో 99.9 స్వచ్ఛతబంగారం 10 గ్రాములు రూ 31.150 గా ఉంది. వెండి కూడా రూ .350 పెరిగి కిలో రూ. 44,000 స్థాయి వద్ద స్థిరంగా ఉంది. మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో అంతర్జాతీయ మార్కెట్లో గత వారం 1266 డాలర్ల దగ్గర మొదలైన ఔన్స్ పసిడి ధర వారాంతానికల్లా 1300 డాలర్లను అధిగమించింది. నాణాల తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి డిమాండ్ కారణంగా మళ్లీ వెండి ధరలు పుంజుకోనున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ కారణంగా పసిడి ధరలు పెరుగుతున్నాయని బులియన్ వర్తకులు చెబుతున్నారు. దేశీయంగా కూడా నిరంతర కొనుగోళ్లతో సెంటిమెంట్ బలంగా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి ఆధిక్యంలోకి రావడంతో పసిడికి డిమాండ్ ఊపందుకుందని విశ్లేషిస్తున్నారు. -
పుత్తడిలో కొనుగోళ్ల జోరు
ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం ఖాయం అన్న వార్తలతో పుత్తడికి డిమాండ్ బాగా పెరిగింది. విదేశీమార్కెట్ లో విలువైన లోహాల ధరలు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీయంగా శుక్రవారం నాటి పసిడి ధరలు పుంజుకుంటున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు లాభాల్లో ఉన్నాయి. శ్రావణమాసం, రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో జ్యువెల్లరీ మార్కెట్ల లో ధరలు ఊపందుకున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. దేశీయ మార్కెట్ లో బంగారం వర్తకుల నిరంతర కొనుగోళ్లు బులియన్ మార్కెట్ ను ప్రభావితం చేస్తోందని అప్‌వర్డ్ ట్రెండ్ నెలకొందని తెలిపారు. దేశరాజధానిలో 99.9 , 99.5 స్వచ్ఛత బంగారం గత మూడు సెషన్స్‌లో 100 రూపాయలకు పైగా లాభపడింది. పది గ్రా. రూ 31.250 చొప్పున పలుకుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 31,465 వద్ద ఉంది. అటు నేటి మార్కెట్ లో బంగారం, వజ్రాభరణాల సంస్థల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా గీతాంజలి జెమ్స్ కొనుగోళ్ల మద్దతుతో కాంతులీనుతోంది. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినా అమెరికా ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉంటుందన్న అమెరికా ప్రకటనతో డాలర్ పుంజుకుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో 0.5శాతం నష్టపోయి ఔన్స్ బంగారం 1346 డాలర్ల దగ్గర ఉంది. ఇక వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. రక్షబంధన్ ను సందర్భంగా నిన్న (గురువారం) మార్కెట్లకు సెలవు.