పుత్తడిలో కొనుగోళ్ల జోరు | Gold Maintains Upward Trend On Jewellers' Buying | Sakshi
Sakshi News home page

పుత్తడిలో కొనుగోళ్ల జోరు

Published Fri, Aug 19 2016 3:24 PM | Last Updated on Mon, Oct 8 2018 8:34 PM

పుత్తడిలో కొనుగోళ్ల జోరు - Sakshi

పుత్తడిలో కొనుగోళ్ల జోరు

ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం ఖాయం అన్న వార్తలతో  పుత్తడికి డిమాండ్ బాగా పెరిగింది. విదేశీమార్కెట్ లో  విలువైన లోహాల ధరలు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీయంగా  శుక్రవారం నాటి పసిడి ధరలు పుంజుకుంటున్నాయి.  దీంతో వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు  లాభాల్లో ఉన్నాయి.  శ్రావణమాసం, రానున్న పండుగల సీజన్  నేపథ్యంలో జ్యువెల్లరీ మార్కెట్ల లో ధరలు ఊపందుకున్నాయని ఎనలిస్టులు  పేర్కొన్నారు.  దేశీయ మార్కెట్ లో బంగారం వర్తకుల నిరంతర కొనుగోళ్లు  బులియన్ మార్కెట్ ను ప్రభావితం చేస్తోందని  అప్వర్డ్ ట్రెండ్ నెలకొందని తెలిపారు.


దేశరాజధానిలో 99.9 , 99.5  స్వచ్ఛత బంగారం గత మూడు సెషన్స్లో 100 రూపాయలకు పైగా  లాభపడింది.  పది గ్రా. రూ 31.250 చొప్పున పలుకుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 31,465 వద్ద ఉంది. అటు నేటి మార్కెట్ లో బంగారం, వజ్రాభరణాల సంస్థల షేర్లు లాభాల్లో  ఉన్నాయి. ముఖ్యంగా  గీతాంజలి జెమ్స్‌   కొనుగోళ్ల మద్దతుతో  కాంతులీనుతోంది.  

కాగా  ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినా అమెరికా ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉంటుందన్న అమెరికా ప్రకటనతో డాలర్ పుంజుకుంది.  ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో  0.5శాతం నష్టపోయి  ఔన్స్ బంగారం 1346  డాలర్ల  దగ్గర ఉంది.  ఇక వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి. రక్షబంధన్ ను సందర్భంగా నిన్న (గురువారం) మార్కెట్లకు సెలవు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement