global cues
-
బంగారం రూ. 90వేలు?: 2025లో ధరలు..
2023లో రూ. 58వేలు వద్ద ఉన్న బంగారం ధర.. 2024 చివరి నాటికి రూ. 77,000 దాటేసింది. ఈ ధరలు 2025లో రూ. 90వేలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ధరలు పెరగడానికి కారణం ఏమిటి? గోల్డ్ రేటు పెరిగితే కొనుగోలుదారుల సంఖ్య తగ్గుతుందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. చాలా మంది గోల్డ్ మీదనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం బంగారం ధరలు రోజు రోజుకు గణనీయంగా పెరగడమే. ఇందులో నష్టాలు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కూడా బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి.ఆర్ధిక పరిస్థితుల అనిశ్చితి ఇలాగే కొనసాగితే.. 2025లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 85,000 నుంచి రూ. 90,000లకు చేరుకునే అవకాశం ఉంది. 2024 అక్టోబర్ 30న బంగారం రేటు రూ.82400 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాలను తాకింది. కేజీ వెండి ధర కూడా ఏకంగా లక్ష రూపాయల మార్క్ అధిగమించేసింది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మాత్రమే కాకుండా.. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు వంటివి 2025లో గోల్డ్ రేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024తో పోలిస్తే వృద్ధి రేటు 2025లో మితంగా ఉండవచ్చని.. ఎల్కేపీ సెక్యూరిటీస్ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది పేర్కొన్నారు. వెండి ధర 2025లో రూ. 1.25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ధరలు ఎంత పెరిగినా బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గే అవకాశం లేదని సమాచారం.ఇదీ చదవండి: పేరు మార్చుకున్న మస్క్.. వినడానికే వింతగా ఉంది!సాధారణంగా బంగారం ధరలు ప్రతి ఏటా 2 నుంచి 3 శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడంతో క్రిప్టో కరెన్సీ వాల్యూ పెరుగుతోంది. దీని వద్ద బంగారం కొనుగోళ్లు కొంత మందగించి అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు.మోదీ ప్రభుత్వం జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాలను 6 శాతం తగ్గించింది. దీంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆ తరువాత పసిడి కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరిగింది. ఆ తరువాత వచ్చిన పండుగ సీజన్, పెళ్లిళ్ల సీజన్ వంటివి మళ్ళీ బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి. కాగా వచ్చే ఏడాది గోల్డ్ రేట్లు మరింత పెరుగుతాయని స్పష్టమవుతోంది. -
గ్లోబల్ సంకేతాలు: నష్టాల్లో సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బలహీన గ్లోబల్ సంకేతాలతో ఆరంభంలోనే శుక్రవారం 300 పాయింట్లకు పైగా పడిపోయింది. సెన్సెక్స్388 పాయింట్లు నష్టపోయి 52631 వద్ద, నిప్టీ 115 పాయింట్లు పతనంతో 15665 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. టైటన్, ఎం అండ్ఎం, టాటా మెటార్స్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్ర, సిప్లా, టీసీఎస్, విప్రో, ఏషియన్ పెయింట్స్ లాభపడుతున్నాయి. కాగా గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌లుక్‌పై ఇన్వెస్టర్లు ఆందోళన నేపథ్యంలో ఆసియా స్టాక్‌లు నష్టపోతున్నాయి. దీనికి తోడు వాల్ స్ట్రీట్ ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 21 శాతం పతనాన్ని నమోదు చేసింది . 1970 తర్వాత అత్యంత దారుణమైన పతనమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
డాలర్ దెబ్బతో రూపీ ఢమాల్
సాక్షి, ముంబై: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ 34 పైసలు క్షీణించింది. ప్రధానంగా అమెరికా కరెన్సీ డాలరు పుంజుకోవడం, ముడి చమురు ధరలు పెరగడంతో డాలరుతో పోలిస్తే రూపాయి 34 పైసలు తగ్గి 72.85 స్థాయికి పడిపోయింది. డాలర్ ఇండెక్స్ 0.01 శాతం పెరిగి 92.94 కు చేరుకుంది. శుక్రవారం రూపాయి 72.51 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 870 పాయింట్లు ఎగియగా,నిఫ్టీ 263పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. హోలీ కారణంగా ఫారెక్స్ మార్కెట్ సోమవారం పనిచేయని సంగతి తెలిసిందే. (మెటల్ షైన్ : సెన్సెక్స్ 800 పాయింట్లు జంప్) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ముంబై : గ్లోబల్ మార్కెట్ల డౌన్ట్రెండ్తో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. జమ్ము కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులతో మదుపుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్ల పైగా నష్టంతో 36,456 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 10,813 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
దేశీయంగా ఐవోసీ ట్రేడింగ్ డెస్క్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రియల్ టైమ్ ప్రాతిపదికన ముడిచమురును కొనుగోలు చేసే దిశగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశీయంగా ఢిల్లీలో ట్రేడింగ్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన ముడిచమురును మెరుగైన ధరకే దక్కించుకోవడం ద్వారా దిగుమతి వ్యయాలను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎ.కె.శర్మ తెలిపారు. ఐవోసీ ప్రస్తుతం తమ అవసరాల్లో 30 శాతాన్ని (15 మిలియన్ టన్నుల) స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం 2017లో సింగపూర్‌లో ప్రత్యేక ట్రేడింగ్ ఆఫీస్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా కంపెనీ అంతర్గతంగా ట్రేడింగ్ టీమ్‌ను, సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసుకున్న నేపథ్యంలో దేశీయంగానూ డెస్క్‌ను ప్రారంభించింది. గత నెల 25న తొలి ట్రేడ్ కింద నైజీరియాలో ఉత్పత్తయ్యే అగ్బామి రకం క్రూడ్ పది లక్షల బ్యారెల్స్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేట్ సంస్థలకు దేశీయంగా ట్రేడింగ్ డెస్క్‌లు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ రంగంలో మాత్రం ఇలాంటిది ఏర్పాటు చేసిన మొదటి సంస్థ ఐవోసీనే. సింగపూర్ డెస్క్‌లో క్రూడ్ కొనుగోలుకు బిడ్స్ రావడం, నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి రెండు గంటల దాకా పట్టేస్తుండగా.. దేశీ డెస్క్ ఏర్పాటుతో ఎప్పటికప్పుడు మారే ధరలపై తక్షణమే బేరసారాలు చేసి, వెంటనే నిర్ణయం కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఐవోసీ పేర్కొంది. -
భారీగా తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఐదున్నర నెలల కనిష్టానికి నేడు బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్ క్షీణించడం.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేడు బులియన్ మార్కెట్లో 250 రూపాయలు తగ్గి, రూ.30,800గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 620 రూపాయలు తగ్గి 40వేలకు కింద రూ.39,200గా నమోదైంది. వెండి కూడా పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ క్షీణించింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. దీంతో సెంటిమెంట్ బలహీనపడిందని బులియన్ ట్రేడర్లు పేర్కొన్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీరేట్లను కొనసాగింపుగా పెంచనున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో, ఈ విలువైన మెటల్‌కు డిమాండ్ తగ్గుతోంది. గ్లోబల్‌గా ఒక్క ఔన్స్‌కు బంగారం ధర 0.32 శాతం క్షీణించి 1,223.30 డాలర్లుగా నమోదైంది. వెండి కూడా 0.84 శాతం తగ్గి, 15.41 డాలర్లుగా ఉంది. ఇక దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 250 రూపాయల చొప్పున తగ్గి, రూ.30,800గా, రూ.30,650గా రికార్డయ్యాయి. నిన్న కూడా బంగారం ధరలు 100 రూపాయలు తగ్గాయి. -
గ్లోబల్ ఎఫెక్ట్ : మార్కెట్లు డౌన్
ముంబై : గ్లోబల్‌గా సంకేతాలు బలహీనంగా ఉండటంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ సంకేతాలతో పాటు అత్యధిక బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి క్షీణించడం మార్కెట్లను పడగొట్టింది. 100 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, ప్రస్తుతం 124 పాయింట్ల నష్టంలో 35,339 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 39 పాయింట్ల నష్టంలో 10,729 వద్ద కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతుండటంతో, దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ 2 శాతం వరకు నీరసించాయి. ట్రేడింగ్ ప్రారంభంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, టెక్ మహింద్రా టాప్ గెయినర్లుగా ఉండగా.. పవర్ గ్రిడ్, ఏసియన్ పేయింట్స్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఎక్కువగా నష్టపోయాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ 2014 నవంబర్ నుంచి తొలిసారి 8 శాతం మార్కుకు పైకి ఎగిశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ ట్రేడింగ్ ప్రారంభంలో 34 పైసలు పడిపోయి 67.46 గా నమోదైంది. క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభం కావడంతో రూపాయి బలహీనపడిందని మోతీలాల్ ఓస్వాల్ అన్నారు. మరోవైపు ఆసియన్ షేర్లు కూడా రెండున్నర నెలల గరిష్టం నుంచి వెనక్కి తగ్గాయి. యూరోప్ భారీ ద్రవ్య ఉద్దీపనం ముగింపుకు చేరుకుంటుండటంతో, ఆసియన్ మార్కెట్లు నష్టపోతున్నాయి. -
భారీగా తగ్గిన గోల్డ్ ధరలు
న్యూఢిల్లీ : బంగారం ప్రియులకు శుభవార్త. బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజే 430 రూపాయల మేర పడిపోయాయి. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ క్షీణించడంతో పాటు, అంతర్జాతీయంగా సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో, బుధవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 430 రూపాయలు తగ్గి రూ.32,020గా నమోదైంది. సిల్వర్ కూడా బంగారం బాటనే పట్టింది. సిల్వర్ ధరలు సైతం కేజీకి 250 రూపాయలు తగ్గి రూ.40,650గా నమోదయ్యాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్క ఔన్స్‌కు 1300 డాలర్ల కిందకి పడిపోవడంతో, దేశీయంగా బంగారం ధరలు తగ్గినట్టు తెలిసింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడటంతో బంగారం ధర అంతర్జాతీయంగా ఈ ఏడాది కనిష్ట స్థాయిల్లో ఔన్స్‌కు 1290.30 డాలర్లను నమోదుచేసింది. సిల్వర్ కూడా అంతర్జాతీయంగా 1.52 శాతం తగ్గి, ఔన్స్‌కు 16.24 డాలర్లగా ఉంది. కేవలం అంతర్జాతీయంగా ఈ విలువైన మెటల్స్ ధరలు పడిపోవడమే కాకుండా.. స్థానిక ఆభరణదారులు, వర్తకుల నుంచి ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో దేశీయంగా ధరలు దిగొచ్చాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.430 చొప్పున తగ్గి రూ.32,020, రూ.31,870గా నమోదయ్యాయి. నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు 165 రూపాయలు లాభపడిన సంగతి తెలిసిందే. -
రూ.32వేలను దాటేసిన బంగారం
-
రూ.32వేలను దాటేసిన బంగారం
సాక్షి, ముంబై: అక్షయ తృతీయ మెరుపులు పసిడిని అపుడే భారీగానే తాకాయి. కొనుగోలు దారుల ఉత్సాహంతో బంగారం ధర మళ్లీ చుక్కలను తాకింది. అటు గ్లోబల్ సంకేతాలు, ఇటు దేశీయంగా నగల వ్యాపారస్థుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.32వేల మార్కును టచ్ చేసింది. గురువారం నాటి బులియన్ ట్రేడింగ్‌లో పది గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.32,150కి చేరింది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి భారీగా కూడా కొనుగోళ్లు పెరిగాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ .24,900 వద్ద ఉంది. అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం స్వల్ప వెనుకంజలో ఉంది. ఇక మరో విలువైన మెటల వెండికూడా ఇదే బాటలో ధర కూడా తిరిగి రూ.40వేల మార్కుకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.240 పెరిగి రూ.40వేలకు చేరింది. అంతర్జాతీయంగానూ పసిడి ధర పెరిగింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.02శాతం పెరిగి 132.80డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.60శాతం పెరిగి 16.65డాలర్లుగా ఉంది. మరోవైపు ఫ్యూచర్స్‌మార్కెట్ లో మాత్రం పసిడి స్వల్ప వెనుకంజలో ఉంది. కాగా ఏప్రిల్ 18న అక్షయ తృతీయ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు స్థానిక ఆభరణాల తయారీదారులు భారీ ఆఫర్ల వెల్లువ కురుస్తున్న సంగతి తెలిసిందే. వివిధ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
పెరిగిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : సంక్రాంతి పండుగ సీజన్లో బంగారం ధరలు పైపైకి పెరుగుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. నేటి బులియన్ ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏడు వారాల గరిష్టంలో వంద రూపాయలు పెరిగి 30,750 రూపాయలుగా నమోదైంది. అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్ సంకేతాలు మాత్రమే కాకుండా.. డాలర్ విలువ పడిపోవడం, స్థానిక ఆభరణ వర్తకదారుల నుంచి కొనుగోళ్లు దేశీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరను పెంచుతున్నాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. గ్లోబల్‌గా బంగారం ధరలు ఒక్కో ఔన్స్‌కు 1.17 శాతం పెరిగి 1,337.40 డాలర్లుగా నమోదయ్యాయి. అదేవిధంగా సిల్వర్ ధరలు కూడా 1.44 శాతం లాభపడి, ఔన్స్‌కు 17.21 డాలర్లకు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 10 గ్రాములకు 30,750 రూపాయలుగా, 30,600 రూపాయలుగా ఉన్నాయి. అదేవిధంగా వెండి ధరలు కూడా దేశీయంగా 100 రూపాయలు లాభపడి కేజీకి 39,900 రూపాయలకు పెరిగాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి మద్దతు వస్తుండటంతో, వెండి ధరలు పెరిగినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. -
రికార్డు గరిష్టంలోకి నిఫ్టీ అప్
సాక్షి, ముంబై : నిఫ్టీ, మిడ్‌క్యాప్స్ తాజా గరిష్ట స్థాయిల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలతో మార్కెట్లు భారీగా జంప్ చేశాయి. ప్రారంభంలో 200 పాయింట్లకు పైగా జంప్ చేసిన సెన్సెక్స్, 195.18 పాయింట్ల లాభంలో 32,467 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 72 పాయింట్ల లాభంలో 10,150 మార్కుకు పైన 10,157 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంకు సైతం 25వేల మార్కును అధిగమించింది. ఎల్ అండ్ టీ, భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టాటా మోటార్స్ నిఫ్టీలో మేజర్ గెయినర్స్‌గా లాభాలు పండిస్తున్నాయి. సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీలు మాత్రమే నిఫ్టీలు నష్టాలు గడిస్తున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.8శాతం పైకి ఎగిసింది. మిడ్‌క్యాప్స్‌లో గోవా కార్బన్, బొంబై డైయింగ్, గ్రాఫైట్ ఇండియా, స్పెషాలిటీ రెస్టారెంట్స్, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, క్యాడిలా హెల్త్‌కేర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 10 శాతం పైగా లాభపడుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలపడి 64 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 156 రూపాయల నష్టంలో 29,854 రూపాయలుగా ఉన్నాయి. -
పసిడి ధరలు వెల వెల
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో బంగారం ధర వెలవెలబోతోంది. వరుసగా సెషన్లుగా క్షీణిస్తున్న పుత్తడి ధరలు మంగళవారం మరింత దిగి వచ్చాయి. విదేశీ ధోరణి, స్థానిక నగల దుకాణదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి దిగి వస్తోంది. అయితే వెండి ధరలుమాత్రం స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న కారణంగా ఇకపై ద్రవ్యోల్బణం బలపడనున్నట్లు ఫెడ్ అధికారులు తాజాగా పేర్కొనడంతో డాలరు ఇండెక్స్ 97కు బలపడింది. ఇది పరోక్షంగా దేశీయ కరెన్సీ, పసిడిలో అమ్మకాలకు కారణమైంది. అటు ఫ్రాన్స్‌లోనూ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం, బ్రెక్సిట్ చర్చలు మొదలుకావడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహాన్నివ్వగా పసిడిపట్ల విముఖతను పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత పది గ్రాముల ధర రూ. 100 తగ్గి రూ. 29,000, రూ .28,850 వద్ద ఉన్నాయి. నిన్న రూ. 70 పడిపోయింది. అయితే సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ. 24,400 గా నమోదైంది. మరోవైపు వెండి కేజీ ధర రూ. 38,700 వద్ద ఉంది. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.60 పెరిగి కు రూ .38,300 కి చేరుకుంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. బంగారం ధర రూ. 28, 547 వద్ద ఉంది. -
బంగారం ధరలకు ఫెడ్ షాక్
న్యూఢిల్లీ: వడ్డీరేట్లను పెంచుతూ అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. ఎంసీఎక్స్‌మార్కెట్ లో పుత్తడి ధరలు గురువారం నీరసించాయి. మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్ ఆగస్టు డెలివరీ బంగారు ధరలు భారీగా పడిపోయాయి. పది గ్రా. పసిడి ధర రూ.234 క్షీణించి రూ.28, 796 స్థాయిని నమోదు చేసింది. ఇటీవల కొన్ని సెషన్లుగా ఓలటైల్‌గా ఉన్న పసిడిధరలు తాజాగా మరింత దిగజారాయి. దీంతో రెండు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1.37 శాతం క్షీణించి 1,262.26 డాలర్లుగా ఉంది.అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగాపుంజుకున్నాయి. 0.01 శాతం పెరిగి 17 డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఇన్వెస్లర్ల ఆందోళన అమ్మకాలకు దారి తీస్తోందని ఎనలిస్టుల అంచనా. అటు దేశీయస్టాక్‌మార్కెట్లు కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ 9600 స్థాయికి దిగువన కొనసాగుతోంది. బుధవారం న్యూయార్క్ ఔన్స్ బంగారం ధర 0.47 శాతం తగ్గి 1,260.10 డాలర్లను నమోదు చేసింది. ప్రపంచ మార్కెట్లో బలహీన ధోరణి కారణంగా , ఫండ్స్ వర్తకంలో బంగారు ధరలు తగ్గుముఖం పట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కాగా అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. అంతేకాదు ఈ ఏడాది మరో సారి రేట్ కట్ తప్పదనే సంకేతాలు అందించిన సంగతి తెలిసిందే. -
రికవరీ : బంగారం ధరలు జంప్ చేశాయి
న్యూఢిల్లీ : బంగారం ధరలు రికవరీ అయ్యాయి. నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 300 రూపాయల మేర పెరిగి, 29,550గా నమోదైంది. అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలు, స్థానిక జువెల్లర్స్ భారీగా కొనుగోళ్లు చేపడటంతో బంగారం ధరలు 300 రూపాయల మేర పెరిగాయని తెలిసింది. ఇటు వెండికీ పరిశ్రమ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ తో దీని ధరలు కూడా కేజీకి రూ.1,170 పెరిగి రూ.40,470గా నమోమైంది. అమెరికా జాబ్స్ డేటా పేలవంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికవరీ అయ్యాయి. జాబ్స్ డేటా పేలవంగా రావడంతో ఫెడరల్ రిజర్వు కూడా వడ్డీరేట్ల పెంపును క్రమవిధానంలో పెంచాలని చూస్తోంది. అంతేకాక దేశీయ స్పాట్ మార్కెట్లో స్థానిక జువెల్లర్స్ ఎక్కువగా బంగారం కొనుగోళ్లను చేపడుతున్నారు. దీంతో విలువైన ఈ మెటల్స్ ధరలు పెరిగాయని బులియన్ విశ్లేషకులు చెప్పారు. గ్లోబల్ గా గోల్డ్ ధర 1.04 శాతం పెరిగి ఒక ఔన్సు 1,278 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ కూడా 1.48 శాతం లాభపడి ఔన్స్ కు 17.53డాలర్లుగా ఉంది. దేశీయ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ ధరలు 300 రూపాయల చొప్పున పెరిగాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధరలు రూ.29,550, రూ.29,400 రూపాయలుగా ఉన్నాయి. నిన్నటి మార్కెట్లో ఇవి 100 రూపాయల మేర పడిపోయాయి. -
గ్లోబల్ దెబ్బ: మార్కెట్లు ఢమాల్
బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో స్టాక్ మార్కెట్ల హ్యాట్రిక్ రికార్డుల పరుగుకు బ్రేక్ పడింది. గురువారం ట్రేడింగ్ లో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 108.05 పాయింట్ల మేర నష్టపోతూ 30,550 వద్ద, నిఫ్టీ 38.50 పాయింట్ల నష్టంలో 9487 వద్ద ట్రేడవుతున్నాయి. హీరో మోటార్ కార్ప్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్లుగా నష్టాలు పాలవుతుండగా.. విప్రో, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లాభాలార్జిస్తున్నాయి. నిఫ్టీలో అతిపెద్ద సూచీలన్నీ నష్టాల బాట పట్టాయి. మిడ్ క్యాప్స్, ఐటీ, ఫార్మా, ఆటో, ఎనర్జీ, ఇతర సూచీలు దిగువ స్థాయిలో ట్రేడవుతున్నాయి. అటు డాలర్ తో రూపాయి విలువ 19 పైసలు బలహీనపడి 64.34 వద్ద ప్రారంభమైంది. గ్లోబల్ సంకేతాలతో మరోవైపు ఆసియన్ స్టాక్స్ నష్టాల్లోనే ఉన్నాయి. జపాన్ నిక్కీ 1.2 శాతం, ఆస్ట్రేలియన్ షేర్లు 1.1 శాతం నష్టపోయాయి.బలహీనమైన గ్లోబల్ సంకేతాలు బంగారానికి భారీగా సహకరించాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 537 రూపాయల మేర పైకి ఎగిసి 28,631 వద్ద ట్రేడవుతున్నాయి. కాగ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్లో తలదూర్చడానికి ప్రయత్నించారంటూ రిపోర్టులు రావడంతో గ్లోబల్ గా అనిశ్చితి ఏర్పడింది. -
లాభాల్లో నడుస్తున్న మార్కెట్లు
ముంబై: కొనుగోళ్ల జోరుతో లాభాల్లో ముగిసిన నిన్నటి మార్కెట్లు, శుక్రవారం ట్రేడింగ్‌లోనూ మంచి లాభాలతో ఎంట్రీ ఇచ్చాయి. పాజిటివ్‌గా వస్తున్న ఆసియా సంకేతాలతో మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి.100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 58.57 పాయింట్ల లాభంలో 29,480 వద్ద ట్రేడవుతోంది. 20.20 పాయింట్ల లాభంలో నిఫ్టీ 9156 వద్ద కొనసాగుతోంది. ఆసియా నుంచి పాజిటివ్ సంకేతాలతో పాటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్, ఎఫ్ఎమ్సీజీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు పడిపోయి 64.64 వద్ద ప్రారంభమైంది.బంగారం ధరలు స్వల్పంగా 3 రూపాయల నష్టంలో 29,302 వద్ద నమోదవుతున్నాయి. -
సెన్సెక్స్ 184 పాయింట్లు లాస్
ముంబై : బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, రుతుపవనాలపై వస్తున్న నిరాశజనకమైన అంచనాలతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 184.25 పాయింట్లు పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ 29,237.15 వద్ద, 62.80 పాయింట్ల నష్టంలో 9045.20 వద్ద నిఫ్టీ క్లోజయ్యాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొద్దామనుకున్న హెల్త్ కేర్ బిల్లుపై ఆయనకు ఎదురుదెబ్బ తగలడంతో డాలర్ ఇండెక్స్ ఢమాల్ మంటోంది. డాలర్ పడిపోతుండటంతో బంగారం పైపైకి ఎగుస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 108.00 పైకి ఎగిసి రూ.28,901 వద్ద ట్రేడయ్యాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా ఏడాదిన్నర గరిష్ట స్థాయిలకు ఎగిసింది. 34 పైసల లాభంతో 65.08 వద్ద ముగిసింది. బలహీనమైన గ్లోబల్ సంకేతాలు, నిరాశజనకమైన రుతుపవనాలు అంచనాలకు తోడు లాభాల స్వీకరణ కూడా మార్కెట్లకు దెబ్బకొట్టింది. మెటల్, టెక్, ఐటీ, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఆటో సూచీలు నష్టాల్లో నడిచాయి. కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, హీరో మోటార్ కార్పొరేషన్, ఏసియన్ పేయింట్స్, టాటా మోటార్స్, విప్రో, లుపిన్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్ నేటి ట్రేడింగ్ మేజర్ లూజర్లుగా 2.37 శాతం వరకు నష్టపోయాయి. -
మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాల దెబ్బ
ముంబై: అంతర్జాతీయంగా వస్తున్న బలహీనమైన సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లను భారీగా దెబ్బకొట్టాయి. వరుసగా మూడో సెషన్లోనూ ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు నష్టాల్లో గడిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 171.51 పాయింట్ల నష్టంలో 29,313 వద్ద, 53.95 పాయింట్ల నష్టంలో 9067 వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ప్రారంభం ట్రేడింగ్ లో భారతీ ఎయిర్ ఇండియా 5 శాతం మేర నష్టాల గడించి, అతిపెద్ద లూజర్ గా నిలిచింది. దాని తర్వాత మహింద్రా అండ్ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీహెచ్ఈఎల్, ఐడియా సెల్యులార్, హిందాల్కోలు నష్టపోతున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా పడిపోయింది. 27 పైసల నష్టంతో 65.56 వద్ద ప్రారంభమైంది. ట్రంప్ పాలసీ విధానాలపై ఆందోళనలు, గతవారం అమెరికా రిజర్వు బ్యాంకు కామెంట్లు డాలర్ ను నిరాశపరుస్తున్నాయి.నాలుగు నెలల కనిష్టంలోకి డాలర్ పడిపోయింది. నార్త్ కొరియా క్షిపణి పరీక్ష, డొనాల్డ్ ట్రంప్ పన్ను వాగ్ధానాలు మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఇదే సమయంలో యూరో ఆరు వారాల గరిష్టంలోకి ఎగిసింది. డాలర్ బలహీనంతో ఇటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు రూ.357 లాభంతో రూ.28,862 వద్ద ట్రేడవుతున్నాయి. -
బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?
ముంబై: డాలర్ బలంతో ఇటీవల వెలవెలబోయిన బంగారం ధరలు మళ్లీ పరుగు అందుకున్నాయి. ఈ మధ్య కాలంలో పది గ్రా. రూ.26వేల స్థాయిని టచ్ చేసిన పుత్తడి ధర మళ్లీ రూ.30 వేల స్థాయి దిశగా కదులుతోంది. శుక్రవారం భారీగా లాభపడిన పుత్తడి ఆరు వారాల గరిష్ఠానికి తాకింది. వరుసగా నాలుగో రోజూ రైజింగ్ లో ఉన్న బంగారం ధర రూ. 200 ఎగిసి రూ.29,450 (10 గ్రా)గా ఉంది. సిల్వర్ ధరలు మాత్రం రూ.300 క్షీణించి రూ.41 వేల స్థాయి కిందికి దిగజారి కిలో రూ. 40,950 గా ఉంది. ప్రపంచ సానుకూల సంకేతాలతో వ్యాపారులు సెంటిమెంట్ బలపడినట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే రాబోయే పెళ్లిళ్ల సీజన్, చిల్లర వర్తకుల డిమాండుకు, తోడు స్థానిక నగల వ్యాపారుల కొనుగోళ్లు పసిడి ధరల్లో జోష్ పెంచాయంటున్నారు. ప్రపంచవ్యాపితంగా 0.33 శాతం పెరిగి ఔన్స్ బంగారం ధర 1,195 వద్ద ఉందివ. న్యూయార్క్ లో ఔన్స్ వెండి 0.30 శాతం ఎగిసి వరకు 16.74 డాలర్ల వద్ద ఉంది. దేశరాజధానిలో 99.9 శాతం 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు వరుసగా రూ.29,450 , రూ.. 29,300 స్థాయిలో ధగధగ లాడుతున్నాయి. ఈ స్థాయి ధరలు గత నవంబరు 29 న నమోదు కాగా, గత మూడు సెషన్లలో రూ.550 పెరిగింది. సావరిన్ గోల్డ్ 8 గ్రా.రూ. 24,300 స్థిరంగా ఉన్నాయి. అయితే ఎంసీక్స్ మార్కెట్ లో పదిగ్రా. స్వల్పంగా క్షీణించి రూ. 28,378 వద్ద ఉంది. , -
మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు!
ముంబై : గత కొన్ని రోజులుగా తగ్గుముఖంగా ఉన్న బంగారం ధరలు సోమవారం రికవరీ అయ్యాయి. అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలతో పాటు దేశీయ బులియన్ మార్కెట్లో నెలకొన్న తాజా డిమాండ్‌తో బంగారం ధరలు ఎగిశాయి. వెండి సైతం స్వల్పంగా లాభపడింది. శుక్రవారం రూ.29,160గా ఉన్న 99.5 శాతం స్వచ్ఛమైన 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర నేటి మార్కెట్లో రూ.135 రూపాయలు లాభపడి రూ.29,295గా నమోదైంది. అదేవిధంగా 10 గ్రాముల ప్యూర్ బంగారం ధర రూ.29,445గా ఉంది. వెండి ధర సైతం స్వల్పంగా రూ.35 ఎగిసి కేజీ రూ.41,800 వద్ద ముగిసింది. డాలర్ షాక్‌తో ఐదున్నర కనిష్ట స్థాయికి పడిపోయిన బంగారం ధరలు గ్లోబల్‌గా పునరుద్ధరించుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ద్రవ్యోల్బణం పెరగొచ్చనే అంచనాలతో డాలర్ విలువ బలపడుతూ వస్తోంది. దూసుకుపోతున్న డాలర్ కొంచెం నెమ్మదించే సరికి, బంగారం ధరలు పునరుద్ధరించుకోవడం ప్రారంభించాయి. స్పాట్ గోల్డ్ ధరలు అంతర్జాతీయంగా ఒక ఔన్స్‌కు 1,214.21 డాలర్లు ఎగిశాయి. సిల్వర్ సైతం 16.67 డాలర్లు పెరిగింది. -
పసిడి మెరుపులు..ట్రెండ్ ఇక పై పైకే!
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్ లో బంగారం మెరుస్తోంది. ప్రపంచవ్యాపితంగా బంగారు 0.14 శాతం, వెండి ధర 0.44 శాతం పెరుగుదలను నమోదుచేసింది. గత నాలుగు సెషన్లనో రూ .400 లాభపడింది.గత వారమంతా లాభాల్లో కొనసాగిన పసిడి ధరలు క్రమంగా నిలదొక్కుకుంటున్నాయి. గ్లోబల్ ట్రెండ్ , వివాహ సీజన్ లో నెలకొన్నడిమాండ్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు వరసగా ఐదవ సెషన్ లోనూ లాభపడ్డాయి. శనివారం పది గ్రాముల బంగారం రూ 100 రూ 31.150 వద్ద పాజిటివ్ ధోరణితో ఉంది. దేశరాజధానిలో 99.9 స్వచ్ఛతబంగారం 10 గ్రాములు రూ 31.150 గా ఉంది. వెండి కూడా రూ .350 పెరిగి కిలో రూ. 44,000 స్థాయి వద్ద స్థిరంగా ఉంది. మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో అంతర్జాతీయ మార్కెట్లో గత వారం 1266 డాలర్ల దగ్గర మొదలైన ఔన్స్ పసిడి ధర వారాంతానికల్లా 1300 డాలర్లను అధిగమించింది. నాణాల తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి డిమాండ్ కారణంగా మళ్లీ వెండి ధరలు పుంజుకోనున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ కారణంగా పసిడి ధరలు పెరుగుతున్నాయని బులియన్ వర్తకులు చెబుతున్నారు. దేశీయంగా కూడా నిరంతర కొనుగోళ్లతో సెంటిమెంట్ బలంగా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి ఆధిక్యంలోకి రావడంతో పసిడికి డిమాండ్ ఊపందుకుందని విశ్లేషిస్తున్నారు. -
మార్కెట్లకు ఫెడ్ ఫీవర్
ముంబై: హిల్లరీ ఆధిక్యాన్ని కోల్పోయారన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం, ఫెడ్ ఫీవర్ నేపథ్యంలో సెన్సెక్స్ 349 పాయింట్లు పతనమై 27,527 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 8,514 వద్ద ముగిసింది. ఆరంభంనుంచీ భారీ నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో చివరికి భారీ నష్టాల్లో కీలక మద్దతు స్థాయిలకు దిగువనే క్లోజ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాలు ప్రభావితం కాగా ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ అధికంగా, రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో నష్టపోయాయి. ఓఎన్జీసీ, టాటా మోటార్స్, బీవోబీ, భెల్, యస్‌బ్యాంక్, స్టేట్‌బ్యాంక్, ఐడియా, గ్రాసిమ్, బాష్ రెడ్ లోను ఎంఅండ్ఎం, ఇన్ఫ్రాటెల్ ఇండస్ఇండ్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ గ్రీన్ లోనూ ట్రేడ్ అయ్యాయి. అయితే ఈ వారమంతా మార్కెట్లు బలహీనంగా కొనసాగే అవకాశాలున్నాయని మార్కట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. అయితే బంగారం ధరలు మాత్రం దూకుడు మీద ఉన్నాయి. ఒక నెల గరిష్టాన్నినమోదు చేసి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రాముల పుత్తడి 154 రూపాయల లాభంతో రూ. 30439వద్ద బలంగా ఉంది. డాలర్ మారకపు విలువలో రూపాయి 5 పైసల నష్టంతో రూ.66.77 వద్ద ఉంది. -
వెండి ధగ ధగ
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల యధాతథంగా ఉంచాలనే నిర్ణయాన్ని ప్రకటించడంతో బులియన్ మార్కెట్ సానుకూలంగా స్పందించింది. విలువైన మెటల్స్ ధగధగ లాడుతున్నాయి. ముఖ్యంగా వెండి, బంగారు ధరల్లో వేగం పుంజుకుంది. నిన్నటి జోరు శుక్రవారం కూడా కొనసాగుతోంది. బంగారం 31వేల రూపాయల మార్క్ ను దాటగా వెండి కిలో 47వేల రూపాయలకు పైన స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 375 లాభపడి రూ. 47375 దగ్గర ఉంది. హైదరాబాద్‌లో నిన్నటి బులియన్ మార్కెట్ లో వెండి కిలో రూ.48,300 ను తాకింది. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ముఖ్యంగా పారిశ్రామిక అవసరాలు, నాణేల తయారీకి వెండి కొనుగోళ్లు పెరగడంతో వెండి ధగధగలాడింది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఒక్కరోజే కిలో వెండి ధర రూ.1,550 పెరిగి రూ.47,750కి చేరిందని పీటీఐ పేర్కొంది. మరోవైపు వడ్డీరేట్ల పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామన్న ఫెడ్ ప్రకటన డాలర్ విలువను బలహీన పర్చింది. ఫలితంగా దేశీయ కరెన్సీ బలపడంతో పాటు, పసిడి, వెండిలపై ఇన్వెస్టర్ల పెట్టుబడులు మళ్లాయని బులియన్ మార్కెట్ వర్గాల అంచనా. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ తీవ్ర ఒడిదుడుకులను ఫేస్ చేశాయి. బ్రెగ్జిట్ పరిణామాల అనంతరం తొలిసారి ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో.. నష్టాలతో బెంబేలెత్తిన దేశీయ మార్కెట్లు మంగళవారం గా కోలుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 122 పాయింట్ల లాభంతో 26,524 దగ్గర, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 8,127 దగ్గర ముగిసాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల ప్రభావం దేశీయ మార్కెట్లను లాభాలపైపు మళ్ళించింది.. భారతీయ కరెన్సీ రూపాయి గత వారం యొక్క బ్రెగ్జిట్ హ్యాంగోవర్ నుంచి గణనీయంగా కోలుకుంటూ ఉండడం కూడా భారత ఈక్విటీ సూచీలకు సానుకూలంగా మారింది. అటు బులియన్ ధరలు ఈరోజు నష్టాలను నమోదు చేశాయి. దాదాపు 350 రూ.పైగా నష్టపోయింది. రూపాయి 0.03 మూడుపైసల లాభంతో 67.91 దగ్గర ఉంది.