బంగారం రూ. 90వేలు?: 2025లో ధరలు.. | Gold Price May Hit Rs 90000 in 2025 | Sakshi
Sakshi News home page

బంగారం రూ. 90వేలు?: 2025లో ధరలు..

Published Tue, Dec 31 2024 8:30 PM | Last Updated on Tue, Dec 31 2024 8:39 PM

Gold Price May Hit Rs 90000 in 2025

2023లో రూ. 58వేలు వద్ద ఉన్న బంగారం ధర.. 2024 చివరి నాటికి రూ. 77,000 దాటేసింది. ఈ ధరలు 2025లో రూ. 90వేలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ధరలు పెరగడానికి కారణం ఏమిటి? గోల్డ్ రేటు పెరిగితే కొనుగోలుదారుల సంఖ్య తగ్గుతుందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.

పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. చాలా మంది గోల్డ్ మీదనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం బంగారం ధరలు రోజు రోజుకు గణనీయంగా పెరగడమే. ఇందులో నష్టాలు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కూడా బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి.

ఆర్ధిక పరిస్థితుల అనిశ్చితి ఇలాగే కొనసాగితే.. 2025లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 85,000 నుంచి రూ. 90,000లకు చేరుకునే అవకాశం ఉంది. 2024 అక్టోబర్ 30న బంగారం రేటు రూ.82400 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాలను తాకింది. కేజీ వెండి ధర కూడా ఏకంగా లక్ష రూపాయల మార్క్ అధిగమించేసింది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మాత్రమే కాకుండా.. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు వంటివి 2025లో గోల్డ్ రేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024తో పోలిస్తే వృద్ధి రేటు 2025లో మితంగా ఉండవచ్చని.. ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది పేర్కొన్నారు. వెండి ధర 2025లో రూ. 1.25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ధరలు ఎంత పెరిగినా బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గే అవకాశం లేదని సమాచారం.

ఇదీ చదవండి: పేరు మార్చుకున్న మస్క్.. వినడానికే వింతగా ఉంది!

సాధారణంగా బంగారం ధరలు ప్రతి ఏటా 2 నుంచి 3 శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడంతో క్రిప్టో కరెన్సీ వాల్యూ పెరుగుతోంది. దీని వద్ద బంగారం కొనుగోళ్లు కొంత మందగించి అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

మోదీ ప్రభుత్వం జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారంపై దిగుమతి సుంకాలను 6 శాతం తగ్గించింది. దీంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆ తరువాత పసిడి కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరిగింది. ఆ తరువాత వచ్చిన పండుగ సీజన్, పెళ్లిళ్ల సీజన్ వంటివి మళ్ళీ బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి. కాగా వచ్చే ఏడాది గోల్డ్ రేట్లు మరింత పెరుగుతాయని స్పష్టమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement