ముంబై: హిల్లరీ ఆధిక్యాన్ని కోల్పోయారన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం, ఫెడ్ ఫీవర్ నేపథ్యంలో సెన్సెక్స్ 349 పాయింట్లు పతనమై 27,527 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 8,514 వద్ద ముగిసింది. ఆరంభంనుంచీ భారీ నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో చివరికి భారీ నష్టాల్లో కీలక మద్దతు స్థాయిలకు దిగువనే క్లోజ్ అయ్యాయి.
దాదాపు అన్ని రంగాలు ప్రభావితం కాగా ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ అధికంగా, రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో నష్టపోయాయి. ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, బీవోబీ, భెల్, యస్‌బ్యాంక్, స్టేట్‌బ్యాంక్, ఐడియా, గ్రాసిమ్, బాష్ రెడ్ లోను ఎంఅండ్‌ఎం, ఇన్ఫ్రాటెల్ ఇండస్‌ఇండ్, హెచ్‌యూఎల్, ఎన్‌టీపీసీ గ్రీన్ లోనూ ట్రేడ్ అయ్యాయి. అయితే ఈ వారమంతా మార్కెట్లు బలహీనంగా కొనసాగే అవకాశాలున్నాయని మార్కట్ ఎనలిస్టులు భావిస్తున్నారు.
అయితే బంగారం ధరలు మాత్రం దూకుడు మీద ఉన్నాయి. ఒక నెల గరిష్టాన్నినమోదు చేసి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రాముల పుత్తడి 154 రూపాయల లాభంతో రూ. 30439వద్ద బలంగా ఉంది. డాలర్ మారకపు విలువలో రూపాయి 5 పైసల నష్టంతో రూ.66.77 వద్ద ఉంది.
మార్కెట్లకు ఫెడ్ ఫీవర్
Published Wed, Nov 2 2016 4:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
Advertisement