Indian Equity Markets
-
64,000 బుల్ 19,000 కొత్త రికార్డుల్..!
ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లో బుధవారం రికార్డుల మోత మోగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సూచీలు మరోరోజూ దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం మరింత ప్రోత్సాహాన్నిచి్చంది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 64,000 స్థాయిని తాకింది. నిఫ్టీ ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న 19,000 మైలురాయిని ఎట్టకేలకు అందుకుంది. సెన్సెక్స్ ఉదయం 286 పాయింట్లు లాభంతో 63,702 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 634 పాయింట్లు పెరిగి 64,050 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 499 పాయింట్ల లాభంతో 63,915 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 18,908 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌లో 194 పాయింట్లు ఎగసి 19,011 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 155 పాయింట్ల లాభంతో 18,972 వద్ద స్థిరపడింది. మెటల్, ఫార్మా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. సూచీల ఆల్‌టైం హై నమోదు తర్వాత చిన్న కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.08% పెరిగి ఫ్లాటుగా ముగిసింది. మిడ్ క్యాప్ సూచీ 0.73 శాతం లాభపడింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,350 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతూ... రూ.1,021 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల్లో రూ.3.43 లక్షల కోట్లు సెన్సెక్స్ రెండురోజుల వరుస ర్యాలీతో బీఎస్ఈలో 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 294.11 లక్షల కోట్లకు చేరింది. ఈ జూన్ 21 తేదిన బీఎస్ఈ లిస్టెడ్ మార్కెట్ క్యాప్ రూ. 294.36 లక్షల కోట్లు నమోదై జీవితకాల రికా ర్డు స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ‘‘దాదాపు ఏడు నెలల స్ధిరీకరణ తర్వాత తర్వాత నిఫ్టీ 19వేల స్థాయిని అందుకోగలిగింది. ఆర్థిక వృద్ధి ఆశలు, వడ్డీరేట్ల సైకిల్ ముగింపు అంచనాలు, గత కొన్ని రోజులు గా విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయ అంశాలు సూచీ ల రికార్డు ర్యాలీకి అండగా నిలిచాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే ఫార్మా, మెటల్ షేర్లకు ఎక్కువగా డిమాండ్ లభించింది’’ అని యస్ సెక్యూరిటీస్ గ్రూప్ ప్రెసిడెంట్ అమర్ అంబానీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్లు ఒక బిలియన్ డాలర్ విలువైన వాటాను కొనుగోలు చేయడంతో అదానీ గ్రూప్ షేర్లు రాణించాయి. ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ 5.34% లాభపడింది. అదానీ ట్రాన్స్మిషన్ 6%, అదానీ పోర్ట్స్ 5%, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ 2%, ఏసీసీ 1%, అదానీ పవర్ అరశాతం, అంబుజా సిమెంట్స్ 0.10 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీలు 0.16%, 0.32 శాతం చొప్పున నష్టపోయాయి. ► ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ట్రేడింగ్‌లో 44,508 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 206 పాయింట్ల లాభంతో 44,328 వద్ద స్థిరపడింది. -
కొనసాగుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు
న్యూఢిల్లీ: డాలర్ మారకం విలువ పెరుగుతుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింతగా పెంచే అవకాశాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. మే నెలలో ఇప్పటివరకూ రూ. 39,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. క్రూడాయిల్ ధరలు భారీ స్థాయిలో కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్యపరపతి విధానాలు అమలు కానుండటంతో భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు రావడంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ఈక్విటీ రీసెర్చ్–రిటైల్) శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ‘ఇటీవలి కాలంలో ఎఫ్‌పీఐల విక్రయాలు ఒక స్థాయికి చేరినట్లుగా కనిపిస్తోంది. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ), రిటైల్ ఇన్వెస్టర్లు దీటుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇకపైనా గరిష్ట స్థాయుల్లో ఎఫ్‌పీఐలు అమ్మకాలు కొనసాగించవచ్చు. అయితే, డీఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆ ప్రభావం కొంత తగ్గగలదు‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. భారత్‌తో పాటు తైవాన్, దక్షిణ కొరియా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఇతర వర్ధమాన దేశాల్లో కూడా ఎఫ్‌పీఐలు విక్రయాలు కొనసాగించారు. ఇప్పటివరకూ రూ. 1.66 లక్షల కోట్లు వెనక్కి.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ ఏడాది (2022)లో ఇప్పటివరకు రూ. 1.66 లక్షల కోట్ల పెట్టుబడులను ఈక్విటీల నుంచి వెనక్కి తీసుకున్నారు. మార్కెట్ కరెక్షన్‌కి లోను కావడంతో ఏప్రిల్ తొలి వారంలో ఎఫ్‌పీఐలు కాస్త కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. రూ. 7,707 కోట్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ మళ్లీ ఆ తర్వాత వారాల్లో భారీగా అమ్మకాలకు దిగారు. మే 2–27 మధ్య కాలంలో రూ. 39,137 కోట్ల మేర విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు రూ. 6,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. మే నెలలో మరో రెండు ట్రేడింగ్ సెషన్లు మిగిలి ఉన్నాయి. ‘భారత్‌లో వేల్యుయేషన్లు అధిక స్థాయిలో ఉండటం, అమెరికాలో బాండ్ ఈల్డ్‌లు .. డాలర్ మారకం విలువ పెరుగుతుండటం, అక్కడ మాంద్యం భయాలతో వడ్డీ రేట్లను పెంచుతుండటం వంటి అంశాలే ఎఫ్‌పీఐ అమ్మకాలకు కారణం‘ అని విజయ్ కుమార్ వివరించారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల కార్పొరేట్ల లాభాలు తగ్గొచ్చని, వినియోగదారులు ఖర్చు పెట్టడం తగ్గించవచ్చన్న ఆందోళన కూడా ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పుతోందని మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్ట్ర హిమాన్షు శ్రీవాస్తవ వివరించారు. వీటితో పాటు రష్యా–ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగనుండటం కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశీయంగాను ద్రవ్యోల్బణం.. దాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుండటం, ఆర్థిక వృద్ధిపై దాని ప్రభావాలు మొదలైన వాటిపై కొంత ఆందోళన నెలకొందని తెలిపారు. -
భారత మార్కెట్లలో లిక్విడిటీ సూపర్ సైకిల్
డ్రీమ్ రన్ మొదలైంది: మోర్గాన్ స్టాన్లీ న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్లు బలమైన నిధుల ప్రవాహం మధ్యలో ఉన్నాయని, డ్రీమ్ రన్ ఇప్పుడే మొదలైందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. దీన్ని దేశీయంగా నిధుల ప్రవాహ సూపర్ సైకిల్ (దీర్ఘకాలం)గా అభివర్ణించింది. వరుసగా 17వ నెల అయిన ఆగస్ట్‌లో నిధులు సానుకూలంగానే ఉన్నట్టు తెలిపింది. దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 3.9 బిలియన్ డాలర్ల (25,000 కోట్లు) నిధుల్ని స్వీకరించినట్టు, ఒక నెలలో ఈ స్థాయి నిధులు రావడం ఇదే మొదటిసారని, ఈటీఎఫ్‌లను కూడా కలిపితే ఇది 4.1 బిలియన్ డాలర్లు ఉంటుందని తన నివేదికలో మోర్గాన్ స్టాన్లీ వివరించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి 18.6 బిలియన్ డాలర్ల (రూ.1.19 లక్షల కోట్లు) నిధులు వచ్చాయని, ఈటీఎఫ్ లోకి వచ్చిన నిధులు 2.6 బిలియన్ డాలర్లు (16,640 కోట్లు)గా ఉన్నట్టు తెలిపింది. ‘‘ఆగస్ట్ చివరి నాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తుల విలువ 111 బిలియన్ డాలర్లు (రూ.7.10 లక్షల కోట్లు)గా ఉంది. మార్కెట్ క్యాప్ 5.3 శాతానికి పెరిగింది. 2000 తర్వాత ఇదే గరిష్ట స్థాయి. 3.2 శాతం స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్ట్ నెలకు సంబంధించి 3.2 శాతంగా ఉండొచ్చని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ఆహారం, నూనెల ధరలు పెరగడంతో ఈ మేరకు అంచనా వేసింది. జూలైలో ఇది 2.4 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే, టోకు ద్రవ్యోల్బణం సైతం ఆగస్ట్ నెలలో 2.9 శాతానికి పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో అంచనా వేసింది. దేశ కరెంట్ ఖాతా లోటు ఏప్రిల్–జూన్ క్వార్టర్లో 11.2 బలియన్ డాలర్లకు విస్తరిస్తుందని ఈ సంస్థ పేర్కొంది. అయినప్పటికీ కరెంటు ఖాతా లోటు ఆర్బీఐకి అనుకూలమైన జోన్లోనే కొనసాగుతుందని తెలిపింది. అధిక నూనె ధరలు, అననుకూలమైన బేస్ ప్రభావంతో ఎగుమతులు, దిగుమతుల వృద్ధి వార్షికంగా చూస్తే మోస్తరుగా ఉంటుందని పేర్కొంది. -
మార్కెట్లకు ఫెడ్ ఫీవర్
ముంబై: హిల్లరీ ఆధిక్యాన్ని కోల్పోయారన్న వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం, ఫెడ్ ఫీవర్ నేపథ్యంలో సెన్సెక్స్ 349 పాయింట్లు పతనమై 27,527 వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 8,514 వద్ద ముగిసింది. ఆరంభంనుంచీ భారీ నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో చివరికి భారీ నష్టాల్లో కీలక మద్దతు స్థాయిలకు దిగువనే క్లోజ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాలు ప్రభావితం కాగా ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ అధికంగా, రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో నష్టపోయాయి. ఓఎన్జీసీ, టాటా మోటార్స్, బీవోబీ, భెల్, యస్‌బ్యాంక్, స్టేట్‌బ్యాంక్, ఐడియా, గ్రాసిమ్, బాష్ రెడ్ లోను ఎంఅండ్ఎం, ఇన్ఫ్రాటెల్ ఇండస్ఇండ్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ గ్రీన్ లోనూ ట్రేడ్ అయ్యాయి. అయితే ఈ వారమంతా మార్కెట్లు బలహీనంగా కొనసాగే అవకాశాలున్నాయని మార్కట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. అయితే బంగారం ధరలు మాత్రం దూకుడు మీద ఉన్నాయి. ఒక నెల గరిష్టాన్నినమోదు చేసి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రాముల పుత్తడి 154 రూపాయల లాభంతో రూ. 30439వద్ద బలంగా ఉంది. డాలర్ మారకపు విలువలో రూపాయి 5 పైసల నష్టంతో రూ.66.77 వద్ద ఉంది. -
బ్యాంకింగ్ జోరు..ఈక్విటీ మార్కెట్ల హుషారు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, షార్ట్ కవరింగ్ తో దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈవారంలో రెండురోజులు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 28,151వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 8, 676వద్ద ముగిసింది. నిప్టీ బ్యాంక్ ఇండెక్స్ భారీగా లాభపడడంతో సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా క్లోజయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, హెల్త్ కేర్ రంగాల్లో నెలకొన్న కొనుగోళ్ల ఒత్తిడి స్టాక్ మార్కెట్లను లాభాలవైపు నడిపించింది. ప్రధాన బ్యాంక్ షేర్లన్నీ లాభాలను ఆర్జించాయి. సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఎన్టీపీసీ, భారతి ఎయిర్ టెల్ అదాని పోర్ట్స్, కోటక్ మహీంద్రా, గ్రాసిం, లాభపడగా, కోల్ ఇండియా, ఎల్ అండ్ టి, టాటా స్టీల్, మహీంద్ర,హిందాల్కో నష్టపోయాయి. లోయర్ లెవల్స్ వాల్యూ బైయింగ్ కనిపించింది. అలాగే పెరుగుతున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులు భారతీయ మార్కెట్లకు భారీ మద్దతునిచ్చాయి. ఫెడ్ ప్రకటన పెట్టుబడిదారుల మనోభావాలను ప్రభావితం చేసిందని ఎనలిస్టులు విశ్లేషించారు. -
పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్!
హైదరాబాద్: అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో సానుకూలంగా స్పందించిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో పరుగులు పెడుతున్నాయి. క్రితం ముగింపుకు ప్రధాన సూచీలు సెన్సెక్స్ 626 పాయింట్ల వృద్ధితో 19825 పాయింట్ల వద్ద, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 5867 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ద్రవ్యమార్కెట్ లో రూపాయి 113 పైసలు బలపడి 64.11 వద్ద ట్రేడ్ అవుతోంది. సూచీ ఆధారిత కంపెనీల షేర్లలో అత్యధికంగా టాటా మోటార్స్ 9.30 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్స్, జయప్రకాశ్ అసోసియేట్స్, లార్సెన్, హెచ్ డీఎఫ్ సీ కంపెనీలు 6 శాతానికి పైగా లాభపడ్డాయి. కెయిర్న్ ఇండియా, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, లుపిన్, బ్యాంక్ ఆఫ్ బరోడా లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.