పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్!
హైదరాబాద్:
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో సానుకూలంగా స్పందించిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో పరుగులు పెడుతున్నాయి. క్రితం ముగింపుకు ప్రధాన సూచీలు సెన్సెక్స్ 626 పాయింట్ల వృద్ధితో 19825 పాయింట్ల వద్ద, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 5867 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ద్రవ్యమార్కెట్ లో రూపాయి 113 పైసలు బలపడి 64.11 వద్ద ట్రేడ్ అవుతోంది.
సూచీ ఆధారిత కంపెనీల షేర్లలో అత్యధికంగా టాటా మోటార్స్ 9.30 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్స్, జయప్రకాశ్ అసోసియేట్స్, లార్సెన్, హెచ్ డీఎఫ్ సీ కంపెనీలు 6 శాతానికి పైగా లాభపడ్డాయి. కెయిర్న్ ఇండియా, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, లుపిన్, బ్యాంక్ ఆఫ్ బరోడా లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.