సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. అంతర్జాతీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో వరుసగా మూడో సెషన్‌లోనే నష్టాలతో ప్రారంభ మయ్యాయి. సెన్సెక్స్ 370 పాయింట్లకు పైగా పతనంతో 62515వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు నష్టంతో 18602 వద్ద కొనసాగుతోంది.
దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా వేదాంత, సిప్లా, సెయిల్ తదితర మెటల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎస్‌బీఐ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా బాగా లాభపడుతుండగా హిందాల్కో, టాటాస్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్ నష్టపోతున్నాయి.
రూపాయి భారీ పతనం:
డాలరు మారకంలో రూపాయి భారీగా కుప్పకూలింది. అమెరికా జాబ్ మార్కెట్ రిపోర్ట్ అందోళన, ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు అంచనాలతో డాలర్ బలం పుంజుకుంది. దీంతో దేశీయ కరెన్సీ బలహీనపడింది. ఏకంగా 60పైసలు పతనమై 82.23 స్థాయికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment