సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిసాయి. ఆసియా మార్కెట్లో అండతో ఆరంభంలో 350 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ఆ తరువాత లాభాలను కోల్పోయి క్రమంలో నష్టాల్లోకి జారుకుంది. చివర్లో కొనుగోళ్ల మద్దతుతోసెన్సెక్స్ 235 పాయింట్ల లాభంతో 61185 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు ఎగిసి 18202 వద్ద స్థిరపడ్డాయి. తద్వారాసెన్సెక్స్ 61వేలకు ఎగువన, నిఫ్టీ 18200 ఎగువన పటిష్టంగా ముగిసాయి.
దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల నార్జించాయి. వారాంతంలో ఊహించిన దాని కంటే మెరుగైన త్రైమాసిక ఫలితాలతో బ్రిటానియా 8శాతం, ఎస్‌బీఐ 3 శాతం ఎగిసాయి. ఇంకా అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్ షర్ మెటార్స్ గ్రాసిం కూడా భారీగా పెరిగాయి. నిరాశాజనకమైన త్రైమాసిక ఫలితాలతో దివీస్ ల్యాబ్ 9 శాతం కుప్పకూలింది. ఏషియన్ పెయింట్స్ 2 శాతానికిపైగా నష్టపో యింది. అలాగే సిప్లా, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. .
రుపీ హై జంప్: అటు డాలరు మారకంలో రూపాయి భారీగా ఎగిసింది. ఆరంభంనుంచి పాజటివ్‌గా ఉన్న రూపాయి చివర్లో ఏకంగా 63 పైసలు జంప్ చేసి 81.90 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment