
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ ఫాంలోకి వచ్చేశాయి. గురువారం ఉదయం సరికొత్త రికార్డు స్థాయిని నమోదు దిశగా కదులుతున్నాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ తరువాత లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 65,609 వద్దస్థాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 19,450 కి చేరువలో ఉంది. రిలయన్స్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్ లాభపడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 140 పాయింట్ల లాభంతో 65,586 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 19,435వద్ద ఉత్సాహంగా ట్రేడ్ అవుతున్నాయి.
బ్రిటానియా, అపోలో, పవర్ గ్రిడ్, రిలయన్స్, కోల్ ఇండియా టాప్ విన్నర్స్‌గా కొనసాగుతుండగా, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, దివీస్‌లేబ్స్ , బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి. మరోవైపు రూపాయి 13 పైసలు కుప్పకూలి 82.36 వద్ద ఉంది. మరోసారి ఫెడ్ వడ్డీ రేటు పెంపు ఉంటుందనే అంచనాల మధ్య డాలర్ బలం పుంజుకుంది.
మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి
Comments
Please login to add a commentAdd a comment