ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, షార్ట్ కవరింగ్ తో దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈవారంలో రెండురోజులు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 28,151వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 8, 676వద్ద ముగిసింది. నిప్టీ బ్యాంక్ ఇండెక్స్ భారీగా లాభపడడంతో సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా క్లోజయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, హెల్త్ కేర్ రంగాల్లో నెలకొన్న కొనుగోళ్ల ఒత్తిడి స్టాక్ మార్కెట్లను లాభాలవైపు నడిపించింది. ప్రధాన బ్యాంక్ షేర్లన్నీ లాభాలను ఆర్జించాయి. సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఎన్టీపీసీ, భారతి ఎయిర్ టెల్ అదాని పోర్ట్స్, కోటక్ మహీంద్రా, గ్రాసిం, లాభపడగా, కోల్ ఇండియా, ఎల్ అండ్ టి, టాటా స్టీల్, మహీంద్ర,హిందాల్కో నష్టపోయాయి.
లోయర్ లెవల్స్ వాల్యూ బైయింగ్ కనిపించింది. అలాగే పెరుగుతున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులు భారతీయ మార్కెట్లకు భారీ మద్దతునిచ్చాయి. ఫెడ్ ప్రకటన పెట్టుబడిదారుల మనోభావాలను ప్రభావితం చేసిందని ఎనలిస్టులు విశ్లేషించారు.
బ్యాంకింగ్ జోరు..ఈక్విటీ మార్కెట్ల హుషారు
Published Thu, Aug 18 2016 4:26 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
Advertisement
Advertisement