Positive Global Cues
-
ఐటీ, మెటల్ దన్ను: లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వాల్ స్ట్రీట్‌లో బౌన్స్ బ్యాక్ కావడంతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 414 పాయింట్లు ఎగిసి 54174వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు ఎగిసి 16173 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా ఐటీ, మెటల్, లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో , ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్ టిసిఎస్ లాభాల్లోనూ బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ, ఎం అండ్ ఎం నష్టపోతున్నాయి. -
ఆల్ టైం హైలో స్టాక్‌మార్కెట్లు
ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు అంచనాలకనుగుణంగానే ఇవి చరిత్రాత్మక గరిష్టాల వద్ద మొదలయ్యాయి. ఆరంభంలోనే 30వేల మైలురాయిని అధిగమించిన సెన్సెక్స్ స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు బుల్ దూకుడుతో ప్రస్తుతం సెన్సెక్స్ 109 పాయింట్లు ఎగిసి 30,042, వద్ద, నిఫ్టీ పాయింట్ల లాభంతో9,331 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన రంగాలూ లాభపడుతున్నాయి. మెటల్, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా బోనస్ షేర్ల ప్రతిపాదనతో విప్రో 2.2 శాతం ఎగసింది. హిందాల్కో, ఎంఅండ్ఎం, బీవోబీ, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతుండగా, ఇన్ఫ్రాటెల్ టాప్ లూజర్‌గా ఉంది. టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, జీ, సిప్లా స్వల్పంగా నష్టపోతున్నాయి. అటు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్లో సెంట్రిస్ట్ అభ్యర్థి మాక్రన్ విజయం సాధించడంతో సోమవారం ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు జోష్‌వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అటు అమెరికాసహా ఇటు ఆసియా వరకూ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి కూడా బలంగా ఉంది. 0.48పైసల లాభంతో రూ.63.96 వద్ద రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. రూ. 64 స్థాయిని తొలిసారి బ్రేక్ చేసి 20 నెలల గరిష్టాన్ని తాకింది. అయితే బంగారం మాత్రం మరింత బలహీనపడింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. రూ. 305 నష్టపోయిన పుత్తడి రూ. 28,826 వద్ద వుంది. -
సెన్సెక్స్ 30వేలు దాటేస్తుందా?
ముంబై: మంగళవారం నాటి హవానుకొనసాగిస్తూ నేడు (బుధవారం) దేశీయ స్టాక్ మార్కెట్లు తమహవాను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆల్ టైం గరిష్టం వద్ద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ముగియడం, సెన్సెక్స్ 30 వేల స్థాయికి చేరువగా పటిష్టంగా ముగిశాయి. అటు అంతర్జాతీయ సంకేతాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేటి సెషన్లో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ తన కీలకమైన మానసిక స్థాయి 30,000 అధిగిమించే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. నిన్నటి సెషన్లో సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగి 29,943 వద్ద ముగియగా, నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 9,306 వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 179 కోట్ల రూపాయల షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 9,316 వద్ద ట్రేడవుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ లాభాలు ఆర్జించడంతో ఆర్ఐఎల్ షేరు రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. మంగళవారం మార్కెట్ ముగిసిన తర్వాత దేశీయ మూడవ పెద్ద సంస్థ ఇటీ సంస్థ విప్రో ఫలితాలను ప్రకటించింది. ఇది కూడా మార్కెట్‌కు సానుకూలంగా మారనుంది. విప్రో వాటాదారులకు 1: 1 బోనస్ ప్రకటించింది. ఇది స్టాక్‌కు ప్రతికూలం. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగే అవకాశం ఉంది. యాక్సిస్ బ్యాంక్, టాటా స్పిన్, కెపిఐటీ టెక్నాలజీస్, స్టెర్లైట్ టెక్నాలజీస్, జిఐసి హౌసింగ్ తదితర సంస్థలు మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. -
వెండి ధరలు ఒక్కసారిగా జూమ్
ముంబై: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్ లో వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో వెండి కిలో రూ 602 లు పెరిగింది. ఫెడ్ అంచనాల నేపథ్యంలో ఇటీవల విలువలైన మెటల్స్ బంగారం, వెండి ధరలు నేల చూపులు చూశాయి. 40వేల దిగువకు పడిపోయాయి. అయితే గ్లోబల్ సానుకూల అంచనాలతో మదుపర్ల భారీ కొనుగోళ్లకు దిగారు. ప్రస్తుతం కిలో వెండి రూ 41.100 పలుకుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ డిసెంబర్ డెలివరీ (511 లాట్ల బిజినెస్ టర్నోవర్) వెండి కిలో 1.49 శాతం పెరిగి రూ 41,100 వద్ద ఉంది. మార్చి 2017 లో డెలివరీ (69 లాట్ల) 1.44 శాతం పెరిగివరూ రూ 41,672 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ,వెండి 2.91 శాతం పెరిగింది. సింగపూర్ లో ఔన్స్ సిల్వర్ ధరలు 16. 79 డాలర్లుగా ఉంది. అటు డాలర్ కొద్దిగా వెనక్కి తగ్గడంతో బంగారం ధరలు కూడా పుంజుకున్నాయి. ఇటీవల తొమ్మిదిన్నర నెలల కనిష్టానికి పతనమైన పసిడి ధరలు ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. రూ.204 లాభంతో రూ.28,802గా వుంది. కాగా నష్టాలతో మొదలైన దేశీ స్టాక్ మార్కెట్లు కొనుగోళ్ల జోరుతో క్రమంగా లాభాల్లోకి పయనించాయి. సెన్సెక్స్ 67, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో కీలకమైన మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. -
బ్యాంకింగ్ జోరు..ఈక్విటీ మార్కెట్ల హుషారు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, షార్ట్ కవరింగ్ తో దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈవారంలో రెండురోజులు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 28,151వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 8, 676వద్ద ముగిసింది. నిప్టీ బ్యాంక్ ఇండెక్స్ భారీగా లాభపడడంతో సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా క్లోజయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, హెల్త్ కేర్ రంగాల్లో నెలకొన్న కొనుగోళ్ల ఒత్తిడి స్టాక్ మార్కెట్లను లాభాలవైపు నడిపించింది. ప్రధాన బ్యాంక్ షేర్లన్నీ లాభాలను ఆర్జించాయి. సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఎన్టీపీసీ, భారతి ఎయిర్ టెల్ అదాని పోర్ట్స్, కోటక్ మహీంద్రా, గ్రాసిం, లాభపడగా, కోల్ ఇండియా, ఎల్ అండ్ టి, టాటా స్టీల్, మహీంద్ర,హిందాల్కో నష్టపోయాయి. లోయర్ లెవల్స్ వాల్యూ బైయింగ్ కనిపించింది. అలాగే పెరుగుతున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెట్టుబడులు భారతీయ మార్కెట్లకు భారీ మద్దతునిచ్చాయి. ఫెడ్ ప్రకటన పెట్టుబడిదారుల మనోభావాలను ప్రభావితం చేసిందని ఎనలిస్టులు విశ్లేషించారు. -
గ్లోబల్ సంకేతాలతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: ప్రపంచ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపథ్యంలో గురువారం నాటి దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. బీఎస్సీ సెన్సెక్స్ సెన్సెక్స్ 236 పాయింట్ల లాభంతో 27,002దగ్గర, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో8270 దగ్గర క్లోజయ్యాయి. బ్రెగ్జిట్ రెఫరండం ఫలితాలకోసం ప్రపంచ మార్కెట్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్రమంలో ఉదయం ఫ్లాట్ గా మొదలయ్యాయి. యూరోపియన్ మార్కెట్లు బలంగా మొదలుకావడంతో మన మార్కెట్లు కూడా కోలుకొన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా ముగిసాయి. బ్యాంకింగ్, అటో మొబైల్, హెల్త్ కేర్ రంగంలో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. మరోవైపు రూపాయి బలంగా ఉండడం, ఇటీవలి ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేశాయని ఎనలిస్టులు అంచనావేశారు. బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించిందనీ, ఐటీ, ఫార్మా షేర్లు మిశ్రమంగా స్పందించాయని ట్రేడ్ బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ధృవ్ దేశాయ్ చెప్పారు. అటు అమెరికా కరెన్సీ డాలర్ తో పోలిస్తే రూపాయ మరింత బలపడింది. 24 పైసల కోలుకొని 67.24 దగ్గర ఉండగా, బులియన్ మార్కెట్ ట్రెండ్ మరింత నెగిటివ్ గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రా. పుత్తడి 30 వేల కింది పడిపోయింది. 192. రూపాయల నష్టంతో రూ. 29,930 దగ్గర ఉంది.