Stock News Today: Positive Global Cues Surges Over 400 Points | July 18, 2022 - Sakshi
Sakshi News home page

Stock Market Updates: ఐటీ, మెటల్‌ దన్ను: లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

Published Mon, Jul 18 2022 10:31 AM | Last Updated on Mon, Jul 18 2022 11:21 AM

Positive Global Cues Surges Over 400 Points - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వాల్ స్ట్రీట్‌లో బౌన్స్  బ్యాక్‌ కావడంతో ఆసియా  మార్కెట్లు సానుకూలంగా   ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌  414  పాయింట్లు ఎగిసి 54174వద్ద,  నిఫ్టీ 124 పాయింట్లు ఎగిసి 16173 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.  ప్రధానంగా ఐటీ, మెటల్‌, లాభాల్లో ఉన్నాయి.  

హిందాల్కో , ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, విప్రో, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్,  ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్ టిసిఎస్ లాభాల్లోనూ  బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎం అండ్‌ ఎం నష్టపోతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement