సెన్సెక్స్‌ 30వేలు దాటేస్తుందా? | Sensex Likely To Cross 30,000 On Positive Global Cues; Wipro In Focus | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 30వేలు దాటేస్తుందా?

Published Wed, Apr 26 2017 8:57 AM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

సెన్సెక్స్‌ 30వేలు దాటేస్తుందా?

సెన్సెక్స్‌ 30వేలు దాటేస్తుందా?

ముంబై:  మంగళవారం నాటి హవానుకొనసాగిస్తూ   నేడు (బుధవారం) దేశీయ స్టాక్‌ మార్కెట్లు  తమహవాను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా   ఆల్‌ టైం గరిష్టం వద్ద నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ ముగియడం, సెన్సెక్స్  30 వేల స్థాయికి చేరువగా పటిష్టంగా  ముగిశాయి.  అటు అంతర్జాతీయ సంకేతాలు  కూడా సానుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేటి సెషన్లో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ బెంచ్మార్క్ సెన్సెక్స్ తన కీలకమైన మానసిక స్థాయి 30,000 అధిగిమించే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. నిన్నటి సెషన్లో సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగి 29,943 వద్ద ముగియగా,  నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 9,306 వద్ద స్థిరపడింది.

ఇదిలా ఉండగా మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 179 కోట్ల రూపాయల షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్‌(ఎస్‌జీఎక్స్‌) నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 9,316 వద్ద ట్రేడవుతోంది.  ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ లాభాలు ఆర్జించడంతో ఆర్‌ఐఎల్‌ షేరు రికార్డ్‌ స్థాయిలో దూసుకుపోతోంది.  మంగళవారం మార్కెట్  ముగిసిన  తర్వాత  దేశీయ మూడవ పెద్ద సంస్థ  ఇటీ సంస్థ విప్రో  ఫలితాలను ప్రకటించింది. ఇది కూడా మార్కెట్‌కు  సానుకూలంగా మారనుంది. విప్రో వాటాదారులకు   1: 1  బోనస్ ప్రకటించింది. ఇది స్టాక్‌కు ప్రతికూలం. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగే అవకాశం ఉంది.  యాక్సిస్ బ్యాంక్, టాటా స్పిన్, కెపిఐటీ టెక్నాలజీస్, స్టెర్లైట్ టెక్నాలజీస్, జిఐసి హౌసింగ్ తదితర  సంస్థలు  మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement