సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. అయితే ఆరంభ లాభాల నుంచి స్వల్పంగా వెనక్కి తగ్గిన కీలక సూచీలు ప్రధాన మద్దతు స్తాయిల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 73 పాయింట్లు లాభంతో 48876 వద్ద, నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 14636 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్ షేర్లు నష్టపోతుండగా దాదాపు అన్నిరంగాల షేర్లలోనూ కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది.
మరోవైపు మార్చి త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో విప్రో 6 శాతం ఎగిసింది. ఏషియన్ పెయింట్స్, హెచ్‌సిఎల్ టెక్, టాటా మోటర్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డిఎఫ్‌సి, హీరో మోటోకార్ప్, భారత్ పెట్రోలియం, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ లాభాల్లోనూ, ఐసీఐసీఐ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, సన్‌ఫార్మా నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment