
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. శుక్రవారం ఆరంభంలోనే లాభపడినా, రోజంతా లాభ నష్టాల మధ్య ఊడిసలాడాయి.చివరికి సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో 53760 వద్ద నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 16,049 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 16వేల స్థాయిని ఎగువన ముగిసింది. కానీ సెన్సెక్స్ ఇంకా 54వేల దిగువనే ఉంది.
హిందుస్థాన్ యూనిలీవర్ 2.86 శాతంలాభంతో అగ్రస్థానంలో ఉండగా, టైటాన్, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఐషర్ మోటార్స్ మారుతీ సుజుకీ ఇండియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఐటీ షేర్ల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. టాటా స్టీల్, పవర్ గ్రిడ్ హెచ్‌సిఎల్ టెక్, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్ట పోయాయి.
అటు డాలరు మారకంలో రూపాయి శుక్రవారం 79.96వద్ద మరో రికార్డు కనిష్టానికి చేరింది. చివరికి 79.88 వద్ద స్థిరపడింది. గురువారం 79.90 వద్ద రికార్డు కనిష్టాన్ని టచ్ చేసి 79.89 వద్ద క్లోజ్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment